Stock Market Today, 15 June 2023: ఇవాళ (గురువారం) ఉదయం 8.15 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 30 పాయింట్లు లేదా 0.16 శాతం రెడ్‌ కలర్‌లో 18,805 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌/నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


యాక్సిస్ బ్యాంక్: గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బైన్ క్యాపిటల్, ఇవాళ (గురువారం, 15 జూన్‌ 2023) బ్లాక్ డీల్స్ ద్వారా యాక్సిస్ బ్యాంక్‌లో 267 మిలియన్‌ డాలర్ల విలువైన వాటాను విక్రయించే అవకాశం ఉందని న్యూస్‌ రిపోర్ట్స్‌ వచ్చాయి.


CDSL: ప్రమోటర్ ఎంటిటీ BSE Ltd, బుధవారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్‌లో (CDSL) కొంత వాటను విక్రయించింది.


సంగం ఇండియా: ఏస్ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా భార్య మాధురి కేలా, బల్క్ డీల్స్ ద్వారా సంగం ఇండియాలో కొంత వాటాను కైవసం చేసుకున్నారు.


TCS, DCB బ్యాంక్: ఈ రెండు కంపెనీ స్టాక్స్‌కు ఇవాళ ఎక్స్ డివిడెండ్‌ డేట్‌. ఈ కంపెనీలు ఇటీవల ప్రకటించిన డివిడెండ్‌ మొత్తం, స్టాక్‌ ధర నుంచి ఇవాళ తగ్గిపోతుంది. కాబట్టి, టీసీఎస్, డీసీబీ బ్యాంక్ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


తేగా ఇండస్ట్రీస్: కంపెనీ ప్రమోటర్ గ్రూప్ కంపెనీల కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదం తెలిపింది.


హీరో మోటోకార్ప్: హీరో మోటోకార్ప్, కొత్త Xtreme 160R 4V మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో స్టాండర్డ్, కనెక్టెడ్ 2.0, ప్రో (Standard, Connected 2.0, Pro) వేరియంట్లలో అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లతో అందుబాటులో ఉంటుంది.


HCL టెక్‌: హెచ్‌సీఎల్‌ టెక్, గూగుల్ క్లౌడ్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించాయి. గూగుల్‌ క్లౌడ్ జెనరేటివ్‌ AI టెక్నాలజీస్‌ను సాంకేతికతలతో కూడిన ఉమ్మడి పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఈ ఒప్పందం పొడిగింపు సాయపడుతుంది.


HDFC బ్యాంక్: హెచ్‌డీఎఫ్‌సీ - హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనం తర్వాత, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పరిమితులపై వీటికి సెబీ నుంతి మినహాయింపు దక్కే అవకాశం లేదని ఇటీ నౌ నివేదించింది.


డి-లింక్ ఇండియా: గత కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడిదార్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్‌ అందిస్తున్న డి-లింక్‌లో (ఇండియా), ఏస్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా బుధవారం బల్క్ డీల్స్ ద్వారా కొంత స్టేక్‌ అమ్మేశారు.


ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలేంటి.. ఇలా పెరిగాయ్‌! 2023 తొలి 3 నెలల్లోనే 3% జంప్‌! 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.