Stock Market Today, 14 September 2023: బుధవారం, ఇండియన్‌ ఈక్విటీల్లో బలమైన గ్రాస్‌ డేటా (బలమైన IIP వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం) ఉత్సాహం కనిపించింది. దీంతో, నిఫ్టీ మొదటిసారిగా 20k మార్క్ పైన క్లోజ్‌ అయింది. ఈ రోజు మార్కెట్లు US ద్రవ్యోల్బణం డేటాకు ప్రతిస్పందిస్తాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలోనూ పెరిగింది.


US స్టాక్స్‌లో కొనుగోళ్లు
ఆగస్ట్‌లో యూఎస్‌ ద్రవ్యోల్బణం చాలా పరిమితంగానే పెరగడంతో, సెప్టెంబర్‌ జరిగే మీటింగ్‌లో వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ యథాతథంగా ఉంచుతుందనే అంచనాలు బలపడ్డాయి. దీంతో S&P 500, నాస్‌డాక్ బుధవారం లాభాల్లో ముగిశాయి.


పెరిగిన ఆసియా షేర్లు
వాల్ స్ట్రీట్ అంచనాలకు అనుగుణంగా ఉన్న US ద్రవ్యోల్బణ రిపోర్ట్‌తో, ఆసియా స్టాక్స్‌లో జాగ్రత్తతో కూడిన ఆశావాదం కనిపించింది. ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపును ఆపొచ్చు, కాకపోతే అది పూర్తిగా ముగియలేదని సంకేతాలను ఆసియా మార్కెట్లు బలపరిచాయి.


గిఫ్ట్‌ నిఫ్టీ
ఇవాళ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 33 పాయింట్లు లేదా 0.16 శాతం గ్రీన్‌ కలర్‌లో 20,179 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


అదానీ గ్రూప్‌ స్టాక్స్: అంబుజా సిమెంట్స్ కొనుగోలుకు నిధుల కోసం తీసుకున్న రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి బ్యాంకులతో అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోంది. ఇందుకోసం రుణదాతలను మూడు వర్గాలుగా విభజించారు. ఈ డీల్‌ ఈ సంవత్సరంలో ఆసియాలో అతి పెద్ద సిండికేట్ లోన్‌ డీల్స్‌లో ఒకటిగా ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ చేసింది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్, దాదాపు $1.5 బిలియన్ల కొత్త పెట్టుబడుల కోసం సింగపూర్, అబుదాబి, సౌదీ అరేబియా సావరిన్ వెల్త్ ఫండ్స్‌ సహా ప్రస్తుత పెట్టుబడిదార్లతో చర్చలు జరుపుతోంది.


KPI గ్రీన్ ఎనర్జీ: CPP విభాగంలో 4.20 MW పవన & 3.60 Mwdc సౌర సామర్థ్యంతో, మొత్తం 7.80 MW విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్‌ కార్యకలాపాలను KPI గ్రీన్ ఎనర్జీ ప్రారంభించింది.


NBCC: బొకారో స్టీల్ ప్లాంట్‌ కోసం ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయాల సంబంధిత ప్రాజెక్టుల కోసం SAIL నుంచి 'కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌' డీల్‌ను NBCC దక్కించుకుంది.


IRCTC: ఈ సంస్థ బస్ బుకింగ్ పోర్టల్/వెబ్‌సైట్ ద్వారా MSRTC ఆన్‌లైన్ బస్ బుకింగ్ సేవలను ప్రారంభించడానికి మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌తో (MSRTC) IRCTC ఒక అవగాహన ఒప్పందంపై (MOU) సంతకం చేసింది.


బాంబే డైయింగ్: ముంబైలోని వర్లీలో దాదాపు 22 ఎకరాల భూమిని, జపాన్ రియాల్టీ డెవలపర్ సుమిటోమో అనుబంధ సంస్థ అయిన గోయిసు రియాల్టీకి రూ.5200 కోట్లకు విక్రయించే ప్రతిపాదనను బాంబే డైయింగ్ బోర్డ్‌ ఆమోదించింది.


విప్రో: జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌లో సైబర్ డిఫెన్స్ సెంటర్‌ను (CDC) విప్రో ప్రారంభించింది. విప్రో CDCలు ప్రపంచవ్యాప్తంగా లోకలైజ్డ్‌ సపోర్ట్‌ అందిస్తాయి. దీంతోపాటు కస్టమర్ల సైబర్ భద్రత, అవసరాలను తీరుస్తాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ఇది కూడా చదవండి: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌! ఈ తప్పు చేస్తే బ్యాంకులు రోజుకు రూ.5000 పరిహారం ఇవ్వాల్సిందే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial