Stocks to watch today, 10 April 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 16 పాయింట్లు లేదా 0.09 శాతం రెడ్‌ కలర్‌లో 17,700 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


PNC ఇన్‌ఫ్రాటెక్: రూ. 771 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం హరియాణా రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ను ఈ కంపెనీ అందుకుంది.


శోభ: FY23 నాలుగో త్రైమాసికంలో (జనవరి-ఏప్రిల్‌ కాలం), రూ. 1,463 కోట్ల విలువైన 1.48 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని విక్రయించి, రికార్డ్‌ స్థాయి త్రైమాసిక గణాంకాలను ఈ కంపెనీ ప్రకటించింది.


టాటా మోటార్స్: జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో కలిపి, నాలుగో త్రైమాసికంలో టాటా మోటార్స్ గ్లోబల్ హోల్‌సేల్స్ 3,61,361 యూనిట్లుగా లెక్క తేలాయి, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8% ఎక్కువ.


జిందాల్ స్టీల్ అండ్ పవర్: షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని తన ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు పూర్తిగా తిరిగి చెల్లించాయని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ప్రకటించింది.


IIFL ఫైనాన్స్: ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కెనడా (EDC), డ్యుయిష్ బ్యాంక్ నుంచి కలిపి 100 మిలియన్‌ డాలర్ల దీర్ఘకాలిక రుణాన్ని ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్ పొందింది.


అదానీ విల్మార్: ఏడాది ప్రాతిపదికన (YoY), వాల్యూమ్స్‌లో 14% బలమైన వృద్ధితో FY23లో అదానీ విల్మార్ లిమిటెడ్ టర్నోవర్ రూ. 55,000 కోట్లకు చేరుకుంది.


టైటన్: కీలక వ్యాపారాల విభాగాల్లో ఆరోగ్యకరమైన రెండంకెల వృద్ధిని టైటన్‌ సాధించింది. 2023 మార్చి త్రైమాసికంలో YoYలో 25% ఆదాయ వృద్ధిని నివేదించింది. వాచీలు & వేరియబుల్స్‌తో పాటు వర్ధమాన వ్యాపార విభాగాల్లో బలమైన ప్రదర్శన చేసింది.


రైల్‌ వికాస్ నిగమ్: సైమెన్స్ ఇండియా కలిసి ఏర్పడిన కన్సార్టియంలో రైల్ వికాస్ నిగమ్ 60% వాటాతో ప్రధాన భాగస్వామిగా నిలిచింది.


ముత్తూట్ ఫైనాన్స్: గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 22 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. షేర్‌ ముఖ విలువలో ఈ డివిడెండ్‌ 220%.


అదానీ టోటల్ గ్యాస్: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను కిలోకు రూ. 8.13, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరను స్టాండర్డ్‌ క్యూబిక్ మీటర్‌కు (scm) రూ. 5.06 మేర అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ తగ్గించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.