ఏప్రిల్ 10 రాశిఫలాలు


మేష రాశి
ఈ రోజు మీరు ఏ పనీ చేయాలనుకున్నా ఉత్సాహంగా చేస్తారు. కుటుంబంలో పెద్దల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. అవసరం అయినవారికి సహాయం చేస్తారు..ఇది మీకు మానసికంగా ప్రశాంతతని ఇస్తుంది. పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులు పని విషయంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా చూసుకోవాలి. 
 
వృషభ రాశి
ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి మంచి రోజు. మీ వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంప్రదించి కొన్ని పొదుపు ప్రణాళికలు చేయడం మంచిది. రిలేషన్ షిప్ గురించి స్నేహితుడితో గొడవ పడితే ఈ రోజు ఆ గొడవ సమసిపోతుంది. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతి లభిస్తుంది. 


మిథున రాశి
ఈ రోజు మీరు ధార్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.ముఖ్యమైన పత్రాలపై జాగ్రత్తగా సంతకాలు చేయాలి. మీ కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే అందులో బయటి వ్యక్తులను ఇన్వాల్వ్ చేయవద్దు. మీ పిల్లలు మీ ఆకాంక్షలకు అనుగుణంగా జీవిస్తారు. తొందరపాటు నిర్ణయానికి పశ్చాత్తాపపడతారు. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది 


కర్కాటక రాశి 
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీ పలుకుబడి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలి అనుకునేవారికి మంచి అవకాశం లభిస్తుంది. మవ్యాపారంలో పురోగతి చెందుతారు.  జీవిత భాగస్వామితో కలసి బయటకు వెళతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే ఇబ్బంది ఎదుర్కోకతప్పదు. పాత అప్పులు తీరుస్తారు. 


Also Read:ఈ వారం ఈ రాశివారికి శుభప్రదం - కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది


సింహ రాశి
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అందరితో మంచి రిలేషన్ మెంటైన్ చేస్తారు. కుటుంబంలో నెలకొన్న విభేదాలు తొలగిపోతాయి. పెద్దలపట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. తల్లి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ప్రేమ వివాహానికి సిద్ధపడేవారికి, వారి వివాహంలో కొంత జాప్యం జరగవచ్చు. పెద్ద పెట్టుబడికి ఎవరి దగ్గరా అప్పు తీసుకోకండి. వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపండి.


కన్య రాశి 
ఈ రోజు మీకు పురోభివృద్ధి ఉంటుంది. తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపార పనులలో ఏదైనా సమస్య ఉంటే, అది ఈ రోజు తొలగిపోతుంది. ఆన్ లైన్ లో పనిచేసే వారు పెద్ద ఆర్డర్ పొందవచ్చు. మీ స్నేహితులలో ఒకరు పాత తప్పు  విషయాన్ని ప్రస్తావించి క్షమాపణ చెబుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేవారు బదిలీల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులకు మేధోపరమైన, మానసిక భారం తొలగిపోతుంది.


తులా రాశి 
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు..అందరితో కలుస్తారు. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.సంతానం మొండివైఖరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంటికి అతిథుల రాక ఖర్చును పెంచుతుంది. మీ లక్ష్యాలు నెరవేరడంతో మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఏ పనిలోనూ సంకోచం లేకుండా ముందుకు సాగితే తప్పకుండా పూర్తవుతుంది. 


వృశ్చిక రాశి 
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మీ ఇంటికి కొత్త అతిథి రాకతో, కుటుంబ సభ్యులందరూ బిజీగా ఉంటారు. కొత్తగా పెళ్లైన వారి జీవితంలో కొత్త అతిథి రావచ్చు. మీకు ఏదైనా పని అప్పగిస్తే, అందులో నిర్లక్ష్యంగా ఉండకండి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది 


Also Read: ఈ వారం ఈ రాశివారు డబ్బు-సమయం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి
 
ధనుస్సు రాశి 
ధనుస్సు రాశి వారికి ఈ రోజు పెట్టుబడి పరంగా మంచి రోజు.మీలో మార్చుకోవాలసిన కొన్ని అలవాట్లున్నాయి..జాగ్రత్త. దీని కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు తగదు. ఏదైనా చట్టపరమైన విషయంలో విజయం సాధించడం వల్ల మీ సంపద కూడా పెరుగుతుంది.వ్యాపారాలు చేసే వారి వేగం ఈరోజు కాస్త మందకొడిగా సాగుతుంది.


మకర రాశి
ఈ రోజు ధనానికి సంబంధించిన విషయాలలో మీకు మంచి రోజు. మీకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. కెరీర్ గురించి ఆందోళన చెందుతుంటే, మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆధ్యాత్మిక పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ ప్రణాళికల్లో చాలా ఆలోచనాత్మకంగా డబ్బును పెట్టుబడి పెట్టండి. అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు పరీక్షలో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంటారు


కుంభ రాశి
ఈ రోజు ఆస్తి సంబంధిత విషయాలలో మీకు మంచి రోజు అవుతుంది. మీ మనస్సులో ఒకరి కోరిక నెరవేరడం వల్ల కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. మీలో కళ, నైపుణ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగాలు మారాలని అనుకుంటున్న వారికి ఇదే మంచిసమయం. ఆర్థిక సంబంధిత విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. 


మీన రాశి
ఈ రాశి ఉద్యోగులు ఓ శుభవార్త వింటారు. వ్యాపారం చేసేవారు కొత్త ప్రణాళికలు తిరిగి ప్రారంభించవచ్చు. ఈ రోజు మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. పనిచేసే ప్రదేశంలో మీకు మద్దతు లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది..ఖర్చుల విషయంలో సమతుల్యత పాటించాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేయాలి.