Stock Market Today, 09 October 2023: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు ద్రవ్య విధానంలో ఆర్‌బీఐ కొనసాగించిన యథాతథ స్థితి నేపథ్యంలో, శుక్రవారం, వరుసగా రెండో రోజు కూడా ఇండియన్ ఈక్విటీస్ ర్యాలీ చేశాయి.
లాభాల్లో అమెరికా స్టాక్స్
సెప్టెంబర్ నెలలో, తక్కువ వేతన వృద్ధిలో U.S.లో నియామకాలు పెరిగినట్లు జాబ్స్ డేటా రావడంతో, శుక్రవారం టెక్నాలజీ షేర్ల ఆధ్వర్యంలో US స్టాక్స్ ర్యాలీ చేశాయి.
మిశ్రమంగా ఆసియా షేర్లు
మధ్యప్రాచ్యంలోని సైనిక సంఘర్షణతో చమురు & ట్రెజరీలు పెరగడంతో ఆసియా మార్కెట్లు న్యూట్రల్‌గా కదులుతున్నాయి.
ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 121 పాయింట్లు లేదా 0.61 శాతం రెడ్ కలర్‌లో 19,649 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టైటన్: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో టైటన్ ఆదాయాలు సంవత్సరానికి 20% పెరిగాయి. ఈ మూడు నెలల కాలంలో మొత్తం 81 స్టోర్స్ యాడ్ అయ్యాయి, మొత్తం స్టోర్ల సంఖ్య 2,859కు చేరింది.
PB ఫిన్‌టెక్: జపనీస్ టెక్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్, శుక్రవారం, బ్లాక్ డీల్స్ ద్వారా PB ఫిన్‌టెక్‌లో కొంత వాటాను ఆఫ్‌లోడ్ చేసింది. మొత్తం 1.14 లక్షల షేర్లు లేదా 2.5% వాటాను సాఫ్ట్ బ్యాంక్ విక్రయించింది.
KPI గ్రీన్: 'క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ (CPP)' విభాగంలో 4.20 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి కొత్త ఆర్డర్లను KPI గ్రీన్ ఎనర్జీ అందుకుంది.
అదానీ గ్రీన్: 'అదానీ గ్రీన్ ఎనర్జీ' పూర్తి యాజమాన్యంలోని స్టెప్-డౌన్ అనుబంధ సంస్థ అయిన 'అదానీ సోలార్ ఎనర్జీ జైసల్మేర్', రాజస్థాన్‌లోని బికనీర్ వద్ద 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో 0.6% వాటా కోసం అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA) రూ. 4,966.80 కోట్ల పెట్టుబడి పెడుతోంది.
పురవంకర: ఈ కంపెనీ కార్యాలయం, ఇతర ప్రెమిసెస్‌లో ఆదాయపు పన్ను విభాగం సోదాలు నిర్వహించినట్లు పురవంకర వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి బ్యాంక్ మొత్తం అడ్వాన్సులు 17% YoY, 3% QoQ పెరిగి రూ.10.25 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
బయోకాన్: టైప్ 2 మధుమేహం, స్థూలకాయం చికిత్సలో ఉపయోగించే లిరాగ్లుటైడ్‌ను మార్కెట్ చేయడానికి కెనడాలోని స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్ కంపెనీ జూనో ఫార్మాస్యూటికల్స్‌తో భాగస్వామ్య ఒప్పందంపై బయోకాన్ సంతకం చేసింది.
మెట్రోపొలిస్ హెల్త్‌కేర్: ఈ కంపెనీ, తన కోర్ బిజినెస్‌లో రెండంకెల వృద్ధితో బలమైన Q2FY24 అప్‌డేట్స్ ఇచ్చింది. QoQ ఆపరేటింగ్ మార్జిన్లు కూడా పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ప్రీమియం కట్టకపోయినా లైఫ్‌ను కవర్ చేసే ఎల్‌ఐసీ 'జీవన్ ఆజాద్' పాలసీ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial