Stock Market Today, 09 June 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.20 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 39 పాయింట్లు లేదా 0.21 శాతం గ్రీన్ కలర్‌లో 18,759 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఈథర్ ఇండస్ట్రీస్: సస్టైనబుల్ కన్వర్జ్ పాలియోల్స్ టెక్నాలజీ కమర్షలైజేషన్ కోసం సౌదీ అరమ్‌కో టెక్నాలజీస్ కంపెనీతో లైసెన్స్ ఒప్పందంపై ఈథర్ ఇండస్ట్రీస్ సంతకం చేసింది.
కోటక్ మహీంద్ర బ్యాంక్: ప్రైవేట్ లెండర్ కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో కొంత వాటాను కెనడా పెన్షన్ ఫండ్ ఈరోజు బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది.
L&T ఫైనాన్స్: 2022-23 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఈక్విటీ షేర్‌కి రూ. 2 తుది డివిడెండ్‌ను L&T ఫైనాన్స్ బోర్డు ఆమోదించింది.
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) బోర్డ్ జూన్ 27న సమావేశమై తన ఈక్విటీ షేర్ల విభజన (share split) ప్రతిపాదనను పరిశీలించి, ఆమోదించనుంది.
హీరో మోటోకార్ప్: ఎలక్ట్రిక్ టూ-వీలర్ రేంజ్‌ను పెంచుకోవడానికి హీరో మోటోకార్ప్ సిద్ధమవుతోంది. కంపెనీ భవిష్యత్ వృద్ధి ప్రణాళికల్లో భాగంగా ప్రీమియం విభాగంలో మెరుగుపడడానికి ప్రస్తుత విక్రయాల మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేస్తామని కొత్త CEO నిరంజన్ గుప్తా తెలిపారు.
టాటా పవర్: టాటా స్టీల్ కోసం 966 మెగావాట్ల రౌండ్-ది-క్లాక్ (RTC) హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి టాటా పవర్ పునరుత్పాదక ఇంధన విభాగం లెటర్ ఆఫ్ అవార్డ్ అందుకుంది.
బ్లూ డార్ట్: కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (CFO) సుధ పాయ్ నియమితులయ్యారు. సెప్టెంబరు 1 నుంచి CFOగా పాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
IEX: మార్కెట్ కప్లింగ్ ప్రక్రియను CERC సకాలంలో చేపట్టే అవకాశం ఉంది. మార్కెట్ ఆధారిత ఎకనామిక్ డిస్పాచ్ కార్యకలాపం పోస్కో కంపెనీలకు మారవచ్చు. ధర నిర్ణయానికి వేదికగా ఉన్న IEXకు ఇక ఆ అవకాశం దూరం అవుతుంది.
CCL ప్రొడక్ట్స్: UKలో రిజిస్టర్ అయిన వివిధ బ్రాండ్‌ల కొనుగోలు కోసం Lofbergs గ్రూప్‌తో ఆస్తి కొనుగోలు ఒప్పందాన్ని CCL ప్రొడక్ట్స్ కుదుర్చుకుంది. ఈ కొనుగోలుతో, CCL ప్రొడక్ట్స్‌కు UKలోని ప్రధాన సూపర్ మార్కెట్‌లోకి యాక్సెస్ లభిస్తుంది.
తాన్లా ఫ్లాట్‌ఫామ్స్: వాల్యూఫస్ట్ మిడిల్ ఈస్ట్ FZC, వాల్యూఫస్ట్ డిజిటల్ మీడియాలలో 100% వాటాను కొనుగోలు చేసేందుకు తాన్లా ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
జైడస్ లైఫ్: నోటి ద్వారా ఉపయోగించే ఎసోంపెరజోల్ మెగ్నీషియం ఔషధాన్ని అమెరికాలో మార్కెట్ చేయడానికి USFDA నుంచి ఈ కంపెనీ తుది ఆమోదం పొందింది.
ఇది కూడా చదవండి: జొమాటో షేర్‌హోల్డర్ల ముఖాల్లో మళ్లీ చిరునవ్వు, దీనికి ఏడాది పట్టింది
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.