Stock Market Today, 08 September 2023: గ్లోబల్ మార్కెట్ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు గురువారం గ్రీన్‌లో ముగిశాయి. సెన్సెక్స్ 0.6% లేదా 385 పాయింట్లు ర్యాలీ చేసి 66,265 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 100 పాయింట్లు లేదా 0.6% పెరిగి 19,727 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ ప్యాక్‌లో షార్ప్‌ అప్‌సైడ్‌ కనిపించింది. రియాల్టీ, మీడియా రంగాల స్టాక్స్‌ కూడా ర్యాలీలో పాల్గొన్నాయి. FMCG, ఫార్మా రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.


US మార్కెట్
S&P 500, నాస్‌డాక్‌ గురువారం పడిపోయాయి. చైనా ఐఫోన్‌ వినియోగంపై చైనా విధించిన ఆంక్షల ఆందోళనలతో ఆపిల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అయితే, ఊహించిన దానికంటే బలహీనమైన నిరుద్యోగ క్లెయిమ్‌ల డేటా, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెంచింది.


యూరోపియన్ షేర్లు
యూరోపియన్ షేర్లు గురువారం వరుసగా ఏడో సెషన్‌లోనూ నష్టాల్లో ముగిశాయి. ఐదేళ్లకు పైగా సుదీర్ఘమైన నష్టాల పరంపర ట్రాక్‌లో ఉన్నాయి. మందగిస్తున్న యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ, పెరిగిన U.S. వడ్డీ రేట్ల ఆందోళనలు కలిసి యూరోపియన్ షేర్ల బరువు తగ్గించాయి.


గిఫ్ట్‌ నిఫ్టీ
ఇవాళ ఉదయం 7.45 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 21 పాయింట్లు లేదా 0.11 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,788 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


వేదాంత: ఈ ఇండియన్‌ మైనింగ్‌ కంపెనీ వచ్చే ఏడాది సుమారు 2 బిలియన్‌ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉన్నందున, రుణ సమీకరణ కోసం వేదాంత రిసోర్సెస్ ప్రతినిధులు బాండ్ హోల్డర్‌లను కలవడానికి సింగపూర్, హాంకాంగ్‌ వెళుతున్నారు.


ఎల్‌టీఐమైండ్‌ట్రీ: సేల్స్‌ ఫోర్స్ ప్లాట్‌ఫామ్‌లో, వివిధ వ్యాపారాల టైమ్-టు-మార్కెట్‌ను వేగవంతం చేయడానికి ఎల్‌టీఐమైండ్‌ట్రీ రెండు ఇండస్ట్రీ సొల్యూషన్స్‌.. యాడ్‌స్పార్క్‌ (AdSpark), స్మార్ట్ సర్వీస్ ఆపరేషన్స్‌ (Smart Service Operations) లాంచ్‌ చేసింది.


JB కెమికల్స్: జేబీ కెమికల్స్‌ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లక్షయ్ కటారియా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. నవంబర్ 30, 2023 పని వేళలు ముగియడంతో తన విధుల నుంచి రిలీవ్ అవుతారు.


మజాగాన్ డాక్: మజాగాన్ డాక్, US ప్రభుత్వంతో మాస్టర్ షిప్ రిపెయిర్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా, యుఎస్ నేవీ షిప్‌ల్లో మరమ్మత్తులను మజాగాన్ డాక్‌ చేపడుతుంది.


టాటా స్టీల్: ఒడిశాలో గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు టాటా స్టీల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌తో (TSSEZL) ఒప్పందం కుదుర్చుకున్నట్లు AVAADA గ్రూప్ ప్రకటించింది.


అదానీ టోటల్ గ్యాస్: ఈ అదానీ గ్రూప్‌ కంపెనీ, ఉత్తరప్రదేశ్‌లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉన్నట్లు నేషనల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


షెమారూ ఎంటర్‌టైన్‌మెంట్: CGST, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు సెప్టెంబర్ 5న ఈ కంపెనీలో సోదాలు నిర్వహించి ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకున్నారు, ఆ తర్వాత వాళ్లకు బెయిల్ మంజూరు అయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ఇది కూడా చదవండి: జీ20 సమ్మిట్‌లో పాల్గొనే అందరికీ తలో వెయ్యి రూపాయలు, గవర్నమెంట్‌ ప్లాన్‌ భళా!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial