Stock Market Today, 07 July 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 9 పాయింట్లు లేదా 0.05 శాతం రెడ్‌ కలర్‌లో 19,479 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌/ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


టైటన్: 2023-24 జూన్ త్రైమాసికం ‍‌(Q1 FY24) వ్యాపార లెక్కల్ని టైటన్ అప్‌డేట్‌ చేసింది. గత ఏడాది ఇదే కాలం కంటే 20% (YoY) ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. జూన త్రైమాసికంలో అన్ని కీలక కన్జ్యూమర్‌ బిజినెస్‌లు రెండంకెల వృద్ధిని సాధించాయి.


డాబర్: FMCG మేజర్ డాబర్ ఇండియా (Dabur India) ఏకీకృత వ్యాపారం, జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో, 10% పైగా వృద్ధిని నమోదు చేయవచ్చని మార్కెట్‌ అంచనా వేసింది.


JK సిమెంట్: జేకే సిమెంట్ పూర్తి స్థాయి సబ్సిడియరీ కంపెనీ జేకే మ్యాక్స్‌ పెయింట్స్‌ (JK Maxx Paints), ఆర్కో పెయింట్స్‌లో (Acro Paints) రూ. 60.24 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీనివల్ల, ఆర్కో పెయింట్స్‌లో 20% స్టేక్‌ డైరెక్ట్‌గా జేకే మ్యాక్స్‌ పెయింట్స్‌కు, ఇన్‌డైరెక్ట్‌గా జేకే సిమెంట్‌ చేతిలోకి వస్తుంది.


ఇండియన్ ఆయిల్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), ప్రాజ్ ఇండస్ట్రీస్ (Praj Industries) కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశంలో బయో ఫ్యూయల్స్‌ ఉత్పత్తి సామర్థ్యాలను బలోపేతం చేసే ప్రణాళికలను రూపొందించడానికి ఒక టర్మ్ షీట్‌పై సంతకం చేశాయి.


అదానీ గ్రీన్: క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) రూట్‌లో రూ. 12,300 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు అదానీ గ్రీన్ ప్రకటించింది. QIP రూట్‌ ద్వారా, పెద్ద ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు భారీ స్థాయిలో షేర్లను ఇష్యూ చేస్తారు. 


హెల్త్‌కేర్ గ్లోబల్: NCHRI మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు హెల్త్‌కేర్ గ్లోబల్, NCHRIతో షేర్ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. తద్వారా, గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ అండర్‌లోకి NCHRI వస్తుంది.


శోభ: జూన్‌ త్రైమాసికంలో, 28% YoY వృద్ధితో 1465 కోట్ల రూపాయల అత్యధిక త్రైమాసిక అమ్మకాలను ఈ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ రికార్డ్‌ చేసింది. 1,394,117 చదరపు అడుగులను ప్రతి చదరపు అడుగుకు రూ. 10,506 చొప్పున  హైయస్ట్‌ ఎవర్‌ ప్రైస్‌కు అమ్మంది. తద్వారా రికార్డ్‌ స్థాయి క్వార్టర్‌ సేల్స్‌ అందుకుంది.


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: రిలయన్స్‌ బ్రాండ్‌తో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌ చేస్తున్న 'రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్'ను (RSIL) రిలయన్స్‌ నుంచి విడదీసి, 'జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్'గా (JFSL) పేరు మార్చడానికి, విడిగా లిస్ట్‌ చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్‌హోల్డర్లు, రుణదాతలు, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ మధ్య అరేంజ్‌మెంట్స్‌ స్కీమ్‌ను ఆమోదించింది.


అమరరాజా: అమరరాజా గ్రూప్‌లోని 'అమరరాజా ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌', డిజైన్‌ ఆల్ఫా (DFM సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌) అనే ఇంజినీరింగ్‌ డిజైన్‌ సర్వీసెస్‌ కంపెనీని సేవల సంస్థను కొనుగోలు చేసింది. దీంతో, పూర్తిస్థాయి ESDM (ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌) సర్వీసెస్‌ కంపెనీగా అమరరాజా ఎలక్ట్రానిక్స్‌ ఆవిర్భవిస్తుంది.


ఇది కూడా చదవండి: మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది - సూపర్ బ్లాక్ థీమ్ డిజైన్‌తో!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial