Friday Tips For Luck: ప్రతి వ్యక్తి ధనం సంపాదించడానికి పగలు రాత్రి కష్టపడతాడు. మీరు జీవితంలో ఆనందంతో పాటు పురోగతిని కోరుకుంటే, మీరు దీని కోసం లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలి. గ్రంథాలలో, లక్ష్మీ దేవిని సంపద, శ్రేయస్సు ప్రసాదించే దేవతగా పేర్కొన్నారు. శుక్రవారం శుక్రుడితో పాటు లక్ష్మీదేవికి అంకితం చేశారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు తప్పకుండా ఈ పనులు చేయండి.
Also Read : శుక్రవారం ఇలాంటి తప్పులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది
లక్ష్మిదేవి కటాక్షం కోసం ఇలా చేయండి
- శుక్రవారం లక్ష్మీదేవిని తామరపూలతో పూజించాలి. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
- లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, శుక్రవారాల్లో పంచదార మిఠాయి, పాయసం నైవేద్యంగా సమర్పించండి.
- శుక్రవారం ఇంటిని శుభ్రం చేయండి. ప్రధాన ద్వారం ముందు ముగ్గు వేసి లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించండి.
- శుక్రవారాల్లో తామర మాల లేదా స్పటిక మాలతో లక్ష్మీ మంత్రాలను జపించండి.
ధన లాభం కోసం
కొందరికి డబ్బు కొరత. ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవదు. ఇందుకోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించి, కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. మీరు లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో చిటికెడు కుంకుమపువ్వును కలపాలని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ భస్మాన్ని ఎరుపు రంగు కాగితంలో వేసి మీ పర్సులో భద్రంగా పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.
మీ భార్యకు బహుమతి ఇవ్వండి
స్త్రీ సుఖంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది. భార్యను గృహలక్ష్మి అంటారు. అందుకే మీ ఇంటి లక్ష్మీదేవిని సంతోషంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో శుక్రవారం నాడు భార్యకు బహుమతిని తెచ్చి, ఆమెను ఆనందంలో ముంచెత్తండి. ఈ పరిహారంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండేలా చేస్తుంది.
ప్రతికూలతను వదిలించుకోండి
కొన్నిసార్లు మన జీవితంలో పురోగతి నిలిచిపోతుంది. ఎంత ప్రయత్నించినా జీవితంలో ముందుకు సాగలేం. ఎందుకంటే ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది. దీని నుంచి విముక్తి పొందాలంటే శుక్రవారం సాయంత్రం పంచముఖ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సంపద, సంతోషం నెలకొంటాయని నమ్ముతారు.
Also Read : లక్ష్మీదేవి ఇలాంటి ఇళ్లలో ఎప్పటికీ ఉండదు!
సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం
శుక్రవారం లక్ష్మీదేవి, శుక్రుడికి అంకితం చేసిన రోజు. శుక్రుడు స్త్రీలింగ గ్రహం. ప్రేమ, అందానికి సంబంధించిన గ్రహంగా శుక్రుడిని పరిగణిస్తారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, శుక్రవారం నాడు లక్ష్మీదేవితో పాటు శుక్రుడిని పూజించాలని నమ్ముతారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.