Maruti Suzuki Invicto: ఆటో లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇన్విక్టోని మారుతి సుజుకి లాంచ్ చేసింది. దీన్ని టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా తయారు చేశారు. కియా కార్నివాల్, టయోటా ఇన్నోవా క్రిస్టాలతో మారుతి సుజుకి ఇన్విక్టో పోటీ పడనుంది.


మారుతి సుజుకి ఇన్విక్టో డిజైన్ ఎలా ఉంది?
ఈ లేటెస్ట్ మారుతి కారు డిజైన్ పరంగా టయోటా ఇన్నోవా హైక్రాస్‌ తరహాలో ఉంటుంది. అయితే ఇన్విక్టో బంపర్‌లో మాత్రం మారుతి సుజుకి కొన్ని మార్పులు చేసింది.


మారుతి సుజుకి ఇన్విక్టో క్యాబిన్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
క్యాబిన్ గురించి చెప్పాలంటే దీన్ని పూర్తిగా బ్లాక్ థీమ్‌తో లాంచ్ చేశారు. దీనిలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. పవర్ ఒట్టోమన్ ఫీచర్‌ కూడా అందించారు. కంపెనీ దీన్ని చింపాంజీ గోల్డ్ యాక్సెంట్‌తో లాంచ్ చేసింది. ఈ కారులో లెదర్ సీట్లు, సాఫ్ట్ టచ్ ప్రీమియం ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, యాంబియంట్ లైటింగ్‌ ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఇతర ఫీచర్లలో 7-8 సీట్ కాన్ఫిగరేషన్, మెమరీతో 8 వే పవర్ డ్రైవర్ సీట్, ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ ఏసీ, వెనుక డోర్ సన్‌షేడ్‌లు, ఐఆర్ కట్ విండ్‌షీల్డ్, పవర్డ్ టెయిల్‌గేట్, 360 డిగ్రీ మానిటర్‌తో వెనుక డోర్ సన్‌షేడ్‌లు ఉన్నాయి.


మారుతి సుజుకి ఇన్విక్టోలో ఏ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి?
ఈ ఎంపీవీకి సంబంధించి భద్రతా ఫీచర్ల విషయంలో కంపెనీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ రియర్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఏబీడీ ఉన్న ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్‌ను కలిగి ఉన్న వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్‌తో పాటు 360 డిగ్రీ వ్యూ ఉన్న కెమెరా, ఎయిర్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


మారుతి సుజుకి ఇన్విక్టో ఇంజిన్
హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో మారుతి సుజుకి ఇన్విక్టో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ఇంజన్ 6000 ఆర్పీఎం వద్ద 112 కేడబ్ల్యూహెచ్ శక్తిని, 4400 ఆర్పీఎం వద్ద 188 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 4000 ఆర్పీఎం వద్ద 83.73 కేడబ్ల్యూ శక్తిని, 206 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఈ కారుకు మొత్తం 137 కేడబ్ల్యూ అవుట్‌పుట్‌ను ఇవ్వగలవు. ఈ కారు ఏకంగా 23.24 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి ఇన్విక్టో ఇంధన ట్యాంక్ సామర్థ్యం 52 లీటర్లుగా ఉంది.


మారుతి సుజుకి ఇన్విక్టో ధర ఎంత?
కంపెనీ ఈ ఎంపీవీని మూడు వేరియంట్‌ల్లో (జీటా ప్లస్ 7 సీటర్, జీటా ప్లస్ 8 సీటర్, ఆల్ఫా ప్లస్) లాంచ్ చేసింది చేసింది. ధర గురించి చెప్పాలంటే, జీటా ప్లస్ 7 సీటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 24.79 లక్షలుగా నిర్ణయించారు. ఇక జీటా ప్లస్ 8 సీటర్ ధర రూ. 24.84 లక్షలు గానూ (ఎక్స్ షోరూమ్), ఆల్ఫా ప్లస్ ధర రూ. 28.42 లక్షలు గానూ (ఎక్స్ షోరూమ్) ఉంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial