Stock Market Today, 04 October 2023: వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందన్న అంచనాలతో బాండ్‌ ఈల్డ్స్‌ బాగా పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది, నిన్న ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు పడిపోయాయి. ఈ రోజు నుంచి RBI MPC మీటింగ్‌ ప్రారంభమవుతుంది. RBI నిర్ణయాలు మన మార్కెట్ డైరెక్షన్‌ను డిసైడ్‌ చేస్తాయి. 


US స్టాక్స్ డౌన్
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అధిక స్థాయిలో కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎకనమిక్‌ డేటా సిగ్నల్స్‌ ఇస్తుండడంతో, జూన్ 1 కంటే కనిష్ట స్థాయిలో నిన్న S&P 500 ఇండెక్స్ ముగిసింది.


ఆసియా షేర్లు పతనం
వాల్ స్ట్రీట్‌లో నష్టాలతో ఆసియా షేర్లు కూడా క్షీణించాయి. US ఎంప్లాయ్‌మెంట్‌ డేటా ఊహించిన దాని కంటే మెరుగ్గా రావడంతో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలు పెరిగాయి, ట్రెజరీ ఈల్డ్స్‌ కూడా పెరిగాయి.


ఇవాళ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 13 పాయింట్లు లేదా 0.07 శాతం రెడ్‌ కలర్‌లో 19,437 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


మారుతి సుజుకి: మారుతి సుజుకి, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,159 కోట్ల కోసం ఆదాయ పన్ను విభాగం నుంచి డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్‌ అందుకుంది.


డిమార్ట్‌: రిటైల్ చైన్ డిమార్ట్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్, సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో తన ఏకీకృత రాబడి 18% పెరిగి రూ.12,308 కోట్లకు చేరుకుందని అప్‌డేట్‌ చేసింది.


యెస్ బ్యాంక్: Q2 FY24లో రుణాలు, అడ్వాన్సుల్లో సంవత్సరానికి 9% వృద్ధిని నమోదు చేశామని, ఆ మొత్తం 2.1 లక్షల కోట్లకు చేరిందని యెస్‌ బ్యాంక్‌ అప్‌డేట్‌ చేసింది. అదే సమయంలో డిపాజిట్లు కూడా ఏడాది ప్రాతిపదికన 17% పెరిగి రూ. 2.34 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపింది.


వేదాంత: లాంజిగర్ రిఫైనరీలో వేదాంత అల్యూమినా ఉత్పత్తి Q2లో 2% పెరిగింది. దాని స్మెల్టర్లలో అల్యూమినియం ఉత్పత్తి కూడా అదే కాలంలో 2% పెరిగింది.


నెస్లే ఇండియా: సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయాలతో పాటు స్టాక్ విభజన, మధ్యంతర డివిడెండ్ ప్రతిపాదనను పరిశీలించేందుకు నెస్లే ఇండియా డైరెక్టర్ల బోర్డు ఈ నెల 19న సమావేశం అవుతుంది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఇంటర్నేషనల్ హోల్డింగ్ కో (IHC), మంగళవారం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో తన వాటాను 5 శాతానికి పైగా పెంచుకున్నట్లు ప్రకటించింది.


రేమండ్: తన అనుబంధ సంస్థ టెన్ ఎక్స్ రియాల్టీ లిమిటెడ్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రూ. 301 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రేమండ్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


సౌత్ ఇండియన్ బ్యాంక్: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ అడ్వాన్స్‌లు 10% పెరిగి రూ. 74,975 కోట్లకు చేరుకున్నాయి. డిపాజిట్లు 10% పెరిగి రూ. 97,146 కోట్లకు చేరాయి.


JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రేటింగ్స్‌ను Ba2 నుంచి Ba1కి మూడీస్ అప్‌గ్రేడ్ చేసింది, ఔట్‌లుక్‌ను పాజిటివ్ నుంచి స్టేబుల్‌కు మార్చింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రెండు స్పెషల్‌ స్కీమ్స్‌ను క్లోజ్‌ చేసిన HDFC బ్యాంక్‌, FDలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే


Join Us on Telegram: https://t.me/abpdesamofficial