Stock Market Today, 03 August 2023: ఇవాళ (గురువారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 28 పాయింట్లు లేదా 0.14 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,528 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌/పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ Q1 రిజల్ట్స్‌ ప్రకటించే కీలక కంపెనీలు: ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, సన్ ఫార్మా, డాబర్, ఐషర్ మోటార్, జొమాటో. ఈ స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


మ్యాన్‌కైండ్ ఫార్మా: 2023-24 మొదటి త్రైమాసికంలో మ్యాన్‌కైండ్ ఫార్మా నికర లాభం భారీగా 66% పెరిగి రూ. 487 కోట్లకు చేరుకోగా, ఆదాయం 18% పెరిగి రూ. 2,579 కోట్లకు చేరుకుంది.


టైటన్: జూన్ క్వార్టర్‌లో టైటన్ లాభం ఏడాది ప్రాతిపదికన 2% తగ్గింది, రూ. 777 కోట్లకు పరిమితమైంది. ఈ టాటా గ్రూప్‌ కంపెనీ త్రైమాసిక ఆదాయం 19% జంప్ చేసి రూ. 10,306 కోట్లుగా నమోదైంది.


ఇండిగో: Q1 FY24లో, ఏవియేషన్‌ కంపెనీ ఇండిగో రూ. 3,091 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాది ఇదే కాలం కంటే 30% పెరిగి రూ. 16,683 కోట్లకు చేరుకుంది.


L&T ఫైనాన్స్: రిపోర్ట్స్‌ ప్రకారం, ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌లో 7.9 కోట్ల షేర్లను బెయిన్ క్యాపిటల్ బ్లాక్ డీల్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది.


వేదాంత: రిపోర్ట్స్‌ ప్రకారం, వేదాంత ప్రమోటర్ ట్విన్‌స్టార్, వేదాంతలో 16 కోట్ల షేర్లను బ్లాక్ డీల్ ద్వారా అమ్మేసే అవకాశం ఉంది.


HPCL: ఏప్రిల్‌-జూన్ కాలంలో హెచ్‌పీసీఎల్ రూ. 6,203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే కాలంలో ఈ కంపెనీకి వచ్చిన ఆదాయం రూ. 1.12 లక్షల కోట్లు.


మెట్రోపొలిస్ హెల్త్‌కేర్: తొలి త్రైమాసికంలో రూ. 29 కోట్ల నికర లాభాన్ని మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ సంపాదించింది. అదే సమయంలో కంపెనీకి రూ. 277 కోట్ల ఆదాయం వచ్చింది.


వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్: జూన్ క్వార్టర్‌లో వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్‌కు మిగిలిన నికర లాభం దాదాపు రూ.19 కోట్లు. కార్యకలాపాల ద్వారా రూ. 409 కోట్ల ఆదాయం వచ్చింది.


గుజరాత్ గ్యాస్: ఏప్రిల్-జూన్ కాలానికి రూ. 215 కోట్ల నికర లాభాన్ని గుజరాత్ గ్యాస్ ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ. 3,781 కోట్ల ఆదాయం వచ్చింది.


నియోగిన్ ఫిన్‌టెక్: మధుసూదన్ కేలా భార్య, ఏస్ ఇన్వెస్టర్ మాధురి కేలా బుధవారం బల్క్ డీల్స్ ద్వారా నియోగిన్ ఫిన్‌టెక్‌లో కొంత వాటా కొన్నారు.


JSW స్టీల్: JSW స్టీల్, JFE స్టీల్ కలిసి ఒక జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి. భారతదేశంలో కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియెంటెడ్ ఎలక్ట్రికల్ స్టీల్ ఉత్పత్తులను తయారు చేయడానికి 50:50 షేర్‌లో జాయింట్ వెంచర్‌ ఏర్పాటు చేస్తాయి.


ఇది కూడా చదవండి: ఆశిష్‌ కచోలియా ట్రేడింగ్‌ సీక్రెట్స్‌ లీక్‌, అతనికి లాభాలు తెస్తున్న స్టాక్స్‌ ఇవే!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.