Ashish Kacholia Portfolio: దలాల్ స్ట్రీట్‌లోని టాప్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలను సాధారణ ఇన్వెస్టర్లు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఫేమస్ పెట్టుబడిదార్ల పోర్ట్‌ఫోలియోల్లో ఏ స్టాక్స్ ఉంటే, కొందరు రిటైల్ ఇన్వెస్టర్లు అవే స్టాక్స్ కొంటుంటారు. ఎందుకంటే, ఒక కంపెనీ పనితీరు బాగుంటే, లేదా భవిష్యత్తులో బ్రహ్మండంగా బిజినెస్ చేస్తుందనుకుంటేనే ఏ బిగ్ షాట్ అయినా ఆ కంపెనీలో షేర్లు కొంటారు. కాబట్టి, అతని ఐడియాను మిగిలిన వాళ్లు ఫాలో అవుతారు.
ఇండియన్ మార్కెట్‌లో ఉన్న ప్రముఖ ఇన్వెస్టర్లలో ఆశిష్ కచోలియా (Ashish Kacholia) ఒకరు. జూన్ త్రైమాసికం ముగింపు నాటికి, కచోలియా దాదాపు 37 స్టాక్స్‌ను హోల్డ్ చేస్తున్నట్లు రీసెంట్ డేటాను బట్టి తెలుస్తోంది. ఆగస్టు 1, 2023 నాటికి ఆ హోల్డింగ్స్ విలువ దాదాపు రూ. 2,286 కోట్లు. కచోలియాకు 1% కంటే ఎక్కువ వాటా ఉన్న కంపెనీల పేర్లు మాత్రమే ఆ డేటాలో ఉన్నాయి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు, ఆ 37 స్టాక్స్‌లో 26 కౌంటర్లు రెండంకెల లాభాలు అందించాయి. 50% నుంచి 95% వరకు రిటర్న్స్ ఇచ్చిన స్క్రిప్స్ తొమ్మిది ఉన్నాయి.
రెప్రో ఇండియా | YTD లాభం: 97% | 52 వారాల గరిష్టం: రూ. 838
ఆశిష్ కచోలియాకు ఈ కంపెనీలో సుమారుగా 3.48% వాటా ఉంది, దీని విలువ ఆగస్టు 1 నాటికి దాదాపు రూ. 35 కోట్లు.
ఉగ్రో క్యాపిటల్ | YTD లాభం: 85% | 52 వారాల గరిష్టం: రూ. 281
ఈ కంపెనీలో దాదాపు 1.56% వాటా ఉంది, దీని విలువ ఆగస్టు 1 నాటికి దాదాపు రూ. 40 కోట్లు.
సఫారీ ఇండస్ట్రీస్ (ఇండియా) | YTD రాబడి: 75% | 52 వారాల గరిష్టం: రూ. 3180
ఈ కంపెనీలో సుమారుగా 2.29% వాటా ఉంది, దీని విలువ ఆగస్టు 1 నాటికి దాదాపు రూ. 160 కోట్లు.
వీనస్ పైప్స్ & ట్యూబ్స్ | YTD లాభం: 75% | 52 వారాల గరిష్టం: రూ. 1288
ఈ కంపెనీలో దాదాపు 1.97% వాటా ఉంది, దీని విలువ ఆగస్టు 1 నాటికి దాదాపు రూ. 50 కోట్లు.
టార్క్ | YTD లాభం: 70% | 52 వారాల గరిష్టం: రూ. 76
ఈ కంపెనీలో సుమారుగా 2.22% వాటా ఉంది, దీని విలువ ఆగస్టు 1 నాటికి దాదాపు రూ. 47 కోట్లు.
SG ఫిన్‌సర్వ్ | YTD లాభం: 66% | 52 వారాల గరిష్టం: రూ. 748
ఈ కంపెనీలో దాదాపు 1.17% వాటా ఉంది, దీని విలువ ఆగస్టు 1 నాటికి దాదాపు రూ. 30 కోట్లు.
ఆదిత్య దర్శనం | YTD లాభం: 56% | 52 వారాల గరిష్టం: రూ. 2465
ఈ కంపెనీలో సుమారుగా 1.99% వాటా ఉంది, దీని విలువ ఆగస్టు 1 నాటికి దాదాపు రూ. 57 కోట్లు.
భారత్ బిజిలీ | YTD లాభం: 54% | 52 వారాల గరిష్టం: రూ. 3,977
ఈ కంపెనీలో దాదాపు 1.79% వాటా ఉంది, దీని విలువ ఆగస్టు 1 నాటికి దాదాపు రూ. 38 కోట్లు.
గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్ | YTD లాభం: 52% | 52 వారాల గరిష్టం: రూ. 1,021
ఈ కంపెనీలో సుమారుగా 4.17% వాటా ఉంది, దీని విలువ ఆగస్టు 1 నాటికి దాదాపు రూ. 97 కోట్లు.
ఆశిష్ కచోలియా దగ్గరున్న స్టాక్స్ అన్నీ అద్భుతాలు చేయలేదు. బార్బెక్యూ-నేషన్ హాస్పిటాలిటీ, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, నిట్ వంటి కొన్ని కౌంటర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 25% నుంచి 70% వరకు పడిపోయాయి. కాబట్టి, సొంతంగా పరిశోధన చేసి పెట్టుబడులు పెట్టాలి గాని, మరొకరిని కాపీ కొడితే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: నష్టాలొచ్చినా పీవీఆర్ బొమ్మకి భలే ఫాలోయింగ్, బాక్సాఫీస్ బద్ధలు కొడుతుందట!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial