PVR Inox Share Price: ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో నష్టాలు మూటగట్టుకున్నా, PVR ఐనాక్స్ షేర్లు ఇవాళ (బుధవారం, 02 ఆగస్టు 2023) 3% గెయిన్స్‌తో ఓపెన్‌ అయ్యాయి. ఈ కంపెనీ నష్టాలు తత్కాలికమని, దీర్ఘకాలంలో గ్రోత్‌ రేట్‌ & బాక్సాఫీస్‌ సక్సెస్‌లను రెండు టాప్‌ బ్రోకరేజీలు బలంగా నమ్ముతున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన బ్రోకింగ్‌ కంపెనీ CLSA, రాబోయే కాలంలో వచ్చే పెద్ద సినిమాల లైనప్‌ను దృష్టిలో పెట్టుకుని, PVR ఐనాక్స్ స్టాక్‌ మీద 'బయ్‌' సిఫార్సు చేసింది. దేశీయ బ్రోకరేజ్ నువామా (Nuvama) కూడా మీడియం-లాంగ్‌ టర్మ్‌లో ఈ మల్టీప్లెక్స్‌ చైన్‌ షేర్లపై పాజిటివ్‌గానే ఉంది.


మోతీలాల్ ఓస్వాల్ మాత్రం, జాగ్రత్తగా ఉండమంటూ PVR ఐనాక్స్ షేర్‌హోల్డర్లను హెచ్చరించింది. OTT ప్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ పెరగడంతో పాటు బాలీవుడ్ సినిమాల సక్సెస్‌ పర్సెంటేజీ పడిపోవడాన్ని హైలెట్‌ చేసింది.


జూన్‌ క్వార్టర్‌ ఫలితాలు
జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ. 82 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని PVR ఐనాక్స్ రిపోర్ట్‌ చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 53.2 కోట్ల నికర లాభం ఆర్జించింది.


తొలి త్రైమాసికంలో రూ. 1,304.90 కోట్ల ఆదాయం ఆర్జించింది, గత సంవత్సరంతో పోలిస్తే (YoY) 32% పెరిగింది. అయితే, కంపెనీ ఖర్చులు కూడా అనూహ్యంగా పెరిగాయి. ఏడాది క్రితం జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ వ్యయాలు రూ. 917 కోట్లుగా ఉంటే, ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌లో అవి 56% పైగా పెరిగి రూ. 1,437.70 కోట్లకు చేరాయి. ఆదాయం పెరిగినా నష్టాలు రావడానికి ఇదే ప్రధాన కారణం.


PVR ఐనాక్స్‌ స్టాక్‌కు బ్రోకరేజ్‌ల సిఫార్సులు:


CLSA రికమెండేషన్‌ - బయ్‌ | ప్రైస్‌ టార్గెట్: రూ. 2,015
ఫారిన్‌ బ్రోకరేజ్ CLSA ఇచ్చిన ప్రైస్‌ టార్గెట్‌ ప్రకారం, PVR ఐనాక్స్ షేర్లు మంగళవారం నాటి ముగింపు ధర (రూ. 1565) కంటే 28% అప్‌సైడ్‌ను సూచిస్తున్నాయి.


నువామా రికమెండేషన్‌ బయ్‌ | ప్రైస్‌ టార్గెట్: రూ. 2,080
పీవీఆర్‌ ఐనాక్స్‌ స్టాక్‌కు 'బయ్‌' కాల్‌ ఇచ్చిన నువామా, ప్రైస్‌ టార్గెట్‌ను రూ. 1,990 నుంచి రూ. 2,080కి పెంచింది. రాబోయే 12 నెలల్లో ఈ స్టాక్‌ మరో 24% పెరగొచ్చని ఈ టార్గెట్‌ ప్రైస్‌ పరమార్ధం.


మోతీలాల్ ఓస్వాల్ రికమెండేషన్‌ - న్యూట్రల్‌ | ప్రైస్‌ టార్గెట్: రూ. 1,650
మల్టీప్లెక్స్‌ కౌంటర్‌ మీద న్యూట్రల్‌గా ఉన్న మోతీలాల్ ఓస్వాల్, రూ. 1,650 టార్గెట్ ధరను ప్రకటించింది. ఇది, మంగళవారం ముగింపు ధర కంటే 5% అప్‌సైడ్‌ను సూచిస్తోంది.


ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి, పీవీఆర్‌ ఐనాక్స్‌ షేర్లు 2.02% లాభంతో రూ. 1,597 వద్ద కదులుతున్నాయి. ఈ స్క్రిప్‌ గత ఆరు నెలల కాలంలో 10% పైగా పెరిగింది. గత నెల రోజుల్లోనే 16% ర్యాలీ చేసింది.


మరో ఆసక్తికర కథనం: జనం బంగారం కొనడం మానుకుంటున్నారు, రీజన్‌ ఇదే!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial