Stock Market Today, 02 June 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 70 పాయింట్లు లేదా 0.40 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,639 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ భారీ గ్యాప్‌-అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


అదానీ ఎంటర్‌ప్రైజెస్: స్టాక్ ఎక్స్ఛేంజీల సర్క్యులర్ ప్రకారం, నేటి (జూన్ 2, 2023‌) నుంచి స్వల్పకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) బయటకు వచ్చింది. ఈ స్టాక్‌ ట్రేడింగ్‌లో ట్రేడర్లకు స్వేచ్ఛ దొరుకుతుంది.


ఇన్ఫో ఎడ్జ్‌: ఇన్ఫో ఎడ్జ్ ‍‌(Info Edge) అనుబంధ సంస్థ AIPL, బ్రోకర్ నెట్‌వర్క్ కంపెనీ 4B నెట్‌వర్క్స్‌కు ‍‌(4B Networks) 288 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చింది. ఆ రుణం ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది. దీంతో, 4B నెట్‌వర్క్స్‌ వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌ను AIPL ప్రారంభించింది.


ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా: ట్రెమెలిముమాబ్ (Imjudo) కాన్‌సెంట్రేట్‌ను CT20 రూపంలో దిగుమతి చేసుకుని భారతదేశంలో విక్రయించడానికి, పంపిణీ చేయడానికి CDSCO నుంచి ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్ (AstraZeneca Pharma India) అనుమతి వచ్చింది.


ఇది కూడా చదవండి: జూన్‌ నుంచి కొత్త మార్పులు, ఈ వివరాలు తెలీకపోతే మీ జేబు గుల్ల! 


కాన్‌ ఫిన్ హోమ్స్‌: కెనరా బ్యాంక్‌ నుంచి వచ్చి, కాన్‌ ఫిన్ హోమ్స్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అయిన అమితాబ్‌ ఛటర్జీ (Amitabh Chatterjee) ఈ నెల 1వ తేదీన రాజీనామా చేశారు.


ఆదిత్య బిర్లా క్యాపిటల్‌: ఆదిత్య బిర్లా క్యాపిటల్ డైరెక్టర్ల బోర్డు, దాని ప్రమోటర్‌కు & ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీకి రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను ప్రాధాన్యత ప్రాతిపదికన జారీ చేయడానికి ఆమోదించింది. మొత్తం రూ. 3,000 కోట్ల ఈక్విటీ ఫండ్‌ సేకరించాలన్న ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ (Aditya Birla Capital) ప్లాన్‌లో ఇదొక భాగం.


కోల్ ఇండియా: కోల్ ఇండియా OFS మొదటి రోజున 3.46 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోల్ ఇండియా OFSలో (Coal India OFS) పాల్గొనడానికి రిటైల్ ఇన్వెస్టర్లకు ఇవాళ అవకాశం ఉంటుంది. ఈ షేర్లు T+1 పద్ధతిలో డీమ్యాట్‌ అకౌంట్లలోకి వస్తాయి.


ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్: ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ (IndusInd Bank, Infosys) కంపెనీలు ప్రకటించిన డివిడెండ్‌కు సంబంధించి ఇవాళ ఎక్స్‌-డేట్‌. ఆయా డివిడెండ్‌ మొత్తాలకు అనుగుణంగా షేర్‌ ధరలు ఇవాళ తగ్గుతాయి.


ఇది కూడా చదవండి: బ్లూ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు, రెడ్‌ సిలిండర్‌ రేటు యథాతథం 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.