Stock Market Today, 01 September 2023: NSE నిఫ్టీ నిన్న (గురువారం) 19,254 వద్ద క్లోజ్‌ అయింది. గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.00 గంటల సమయానికి 40 పాయింట్లు లేదా 0.21 శాతం రెడ్‌ కలర్‌లో 19,389 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో, జార్జ్ సోరోస్ మద్దతు ఉన్న OCCRP నుంచి వచ్చిన బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్ షేర్లు క్షీణించడంతో చేయడంతో నిఫ్టీ50, సెన్సెక్స్ ఎరుపు రంగులో క్లోజ్‌ అయ్యాయి. 


ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చే యూఎస్‌ జాబ్‌ డేటా కోసం ట్రేడర్లు ఎదురు చూస్తుండడంతో ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. దీంతోపాటు, Q1 FY24లో 7.8%కి పెరిగిన ఇండియా GDP గ్రోత్‌ రేట్‌ పైనా పెట్టుబడిదార్లు రియాక్ట్‌ అవుతారు. అయితే, అంచనాల కంటే ఇది తక్కువగా ఉంది. గ్లోబల్ ట్రెండ్స్‌తో పాటు, GDP వృద్ధి డేటా, వాహనాల నెలవారీ అమ్మకాలు, మెటల్ ప్రొడక్షన్‌ డేటా కూడా ఇవాళ మార్కెట్ మూడ్‌ను ప్రభావితం చేస్తాయి. 


ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌ లేదా నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


సూల వైన్‌యార్డ్స్‌: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ వెర్లిన్‌వెస్ట్ ఆసియా, గురువారం బ్లాక్ డీల్స్ ద్వారా సూల వైన్‌యార్డ్స్‌లో ‍‌(Sula Vineyards) కొంత వాటాను విక్రయించింది. ఈ కంపెనీ షేరు నిన్న 3.62% నష్టంతో రూ.490.30 వద్ద ముగిసింది.


గుజరాత్ గ్యాస్: సౌదీ అరామ్‌కో, సెప్టెంబర్ ప్రొపేన్ కాంట్రాక్ట్ ధరను ఒక్కో టన్నుకు 550 డాలర్లుగా నిర్ణయించింది, ప్రస్తుతం ఉన్న ధర టన్నుకు 470 డాలర్ల నుంచి పెంచింది. మన దేశంలో, ఈ ధరలు అక్టోబర్ నుంచి, ఒక నెల ఆలస్యంతో వర్తిస్తాయి.


జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ: స్టీల్-టు-ఎనర్జీ వ్యాపారాలు చేసే JSW గ్రూప్, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేయడానికి లైసెన్స్ టెక్నాలజీ కోసం ప్రయత్నిస్తోంది. చైనీస్ ఆటోమేకర్ లీప్‌మోటర్‌తో ఈ కంపెనీ ముందస్తు చర్చలు జరుపుతోందని రాయిటర్స్ రిపోర్ట్‌ చేసింది.


ABFRL: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL), TCNS క్లోథింగ్‌లో 29% వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. ఈ స్టాక్‌ నిన్న 1.02% నష్టంతో రూ.219.10 వద్ద ముగిసింది.


NHPC: కంపెనీ CMD రాజీవ్ కుమార్ విష్ణోయ్ అదనపు బాధ్యతల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇది, నేటి (సెప్టెంబర్ 1, 2023‌‌) నుంచి పూర్తి కాల నియామకం జరిగే వరకు వర్తిస్తుంది. ఈ స్టాక్‌ నిన్న 1.28% నష్టంతో రూ.50.30 వద్ద క్లోజ్‌ అయింది.


జైడస్ లైఫ్‌ సైన్సెస్‌: తీవ్రమైన మొటిమల చికిత్సకు ఉపయోగించే ఐసోట్రిటినోయిన్ క్యాప్సూల్స్‌ను అమెరికాలో మార్కెట్‌ చేయడానికి జైడస్ లైఫ్‌ సైన్సెస్‌కు US FDA నుంచి తుది ఆమోదం లభించింది. ఈ షేర్లు నిన్న 0.41% నష్టంతో రూ.625.55 వద్ద ఆగాయి.


ఇది కూడా చదవండి: కీలక సూచీలకు గుడ్‌బై, శుక్రవారం నుంచి ఈ కంపెనీ షేర్లు కనిపించవు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial