'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత రూత్ ప్రభు (Samantha) జంటగా నటించిన సినిమా 'ఖుషి' (Kushi Movie 2023). తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? ఎర్లీ షోస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...
'ఖుషి'లో పాజిటివ్ పాయింట్స్ ఏంటి?
విజయ్ దేవరకొండ, సమంత నటనకు... వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీకి ప్రీమియర్ షోస్ నుంచి మంచి మార్కులు పడ్డాయి. తమ తమ పాత్రల్లో విజయ్ & సమంత జీవించారని చెబుతున్నారు. ఆ తర్వాత కామెడీ బావుందని ఎక్కువ మంది పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. స్క్రీన్ మీద కూడా వాటి పిక్చరైజేషన్ బావుందని మంచి రిపోర్ట్ వచ్చింది.
హిట్ కొట్టేశాం రా అబ్బాయిలూ...
ఇక బాక్సాఫీస్ దగ్గర తగ్గేది లే!
అమెరికా ప్రీమియర్ షోస్ నుంచి 'ఖుషి'కి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దాంతో విజయ్ దేవరకొండ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది 'హిట్ కొట్టేశాం రా అబ్బాయిలూ' అంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 'జెర్సీ' సినిమాలో నాని రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లి అరిచిన సీన్ పోస్ట్ చేస్తున్నారు.
Also Read : 'ఖుషి'ని ఎందుకు చూడాలి? స్పెషల్ ఎట్రాక్షన్స్ ఏంటి? టాప్ 5 రీజన్స్ మీద ఓ లుక్ వేయండి
'నిన్ను కోరి', 'మజిలీ' వంటి మంచి చిత్రాలు అందించిన శివ నిర్వాణ, ఈ 'ఖుషి' చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. మలయాళ హిట్ 'హృదయం' ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Also Read : 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?
మరి, మైనస్ పాయింట్స్ ఏంటి?
'ఖుషి'లో స్టోరీ సింపుల్ అని, కథ నుంచి పెద్దగా ఏమీ ఆశించవద్దని కొందరు సూటిగా చెప్పేశారు. డీసెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మాత్రమే అంటున్నారు. సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ రన్ టైమ్ అనేది కంప్లైంట్! రెండు గంటల నలభై ఐదు నిమిషాలు బదులు కొంత ట్రిమ్ చేయవచ్చట. అదీ సంగతి!
గమనిక : సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు చేసిన పోస్టులను పాఠకుల కోసం ఇవ్వడం జరిగింది. అంతే తప్ప... ఈ పోస్టులకు, ABP Desam సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. ఆ పోస్టుల్లో పేర్కొన్న అభిప్రాయాలకు 'ఏబీపీ దేశం' బాధ్యత వహించదు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial