విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా నటించిన 'ఖుషి' (Kushi Movie) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత (Samantha) కథానాయిక. పాటలు బ్లాక్ బస్టర్ హిట్ కావడం, ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? విజయ్ దేవరకొండ ముందు ఉన్న టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే... 


'ఖుషి' ప్రీ రిలీజ్‌ @ 53 కోట్లు!
Kushi Pre Release Business Details : ప్రపంచవ్యాప్తంగా 'ఖుషి' థియేట్రికల్ హక్కులను రూ. 53 కోట్లకు అమ్మినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ బాగా జరిగింది. విజయ్ దేవరకొండ క్రేజ్ మరోసారి చాటి చెప్పింది. 


నైజాం ఏరియాలో 'ఖుషి' థియేట్రికల్ హక్కులను 15 కోట్ల రూపాయలకు ఇచ్చినట్లు తెలిసింది. సీడెడ్ రూ. 6 కోట్లకు, ఆంధ్రాలో అన్ని ఏరియాలు కలిపితే రూ. 20 కోట్లకు విక్రయించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలు కలిపితే మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 41 కోట్లు జరిగింది. 


కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ద్వారా 'ఖుషి' నిర్మాతలకు రూ. 5 కోట్లు వచ్చాయట. ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 7 కోట్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... రూ. 53 కోట్లు జరిగినట్టు అంచనా. దానికి రూ. 50 లక్షలు ఎక్కువ వస్తే... బ్రేక్ ఈవెన్ అయినట్లే!


Also Read : టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్‌ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!



'ఖుషి'కి ముందు విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా 'లైగర్'. ఆ చిత్రంతో ఆయన పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు. అది ఆశించిన విజయం సాధించలేదు. కానీ, విడుదలకు ముందు విపరీతమైన క్రేజ్ నెలకొనడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో రికార్డులు నమోదు చేసింది. రూ. 88.50 కోట్లకు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ అమ్మారు. 


'లైగర్' కంటే ముందు 'వరల్డ్ ఫేమస్ లవర్' రూ. 30.50 కోట్లు, 'డియర్ కామ్రేడ్' రూ. 34.60 కోట్లు, 'టాక్సీవాలా' రూ. 18 కోట్లు, 'నోటా' రూ. 26 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. యంగ్ హీరోల్లో ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కూడా ఆయనే.


Also Read : డ్రగ్స్ కేసులో నాకు నోటీసులా? - స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్
 
'ఖుషి' సినిమా బుకింగ్స్ మొదలు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే... పెద్దలతో పాటు పిల్లలు కూడా సినిమా చూడొచ్చు అన్నమాట. ఇంకా ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే... 165 నిమిషాలు! 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial