Stocks to watch today, 18 October 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 124.5 పాయింట్లు లేదా 0.72 శాతం రెడ్‌ కలర్‌లో 17,439.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్‌ కంపెనీలు: ICICI లాంబార్డ్ GIC, స్కాఫ్లర్ ఇండియా, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, పాలిక్యాబ్ ఇండియా, L&T టెక్నాలజీ సర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్, KPIT టెక్నాలజీస్, మహీంద్రా CIE ఆటోమోటివ్, HFCL, లాయిడ్ మెటల్స్ & ఎనర్జీ, ప్రాజ్ ఇండస్ట్రీస్


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ACC: ఇంధన ధర బాగా పెరగడం వల్ల, సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సిమెంట్ కంపెనీ రూ.87.32 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.450.21 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్: ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ ఈ  మీడియా మేజర్‌లో తనకున్న 5.51 శాతం వాటాను ఇవాళ విక్రయిస్తోంది. ఒక్కో షేరు రూ.250-263.7 ప్రైస్‌ రేంజ్‌లో ఆఫ్‌లోడ్ అవుతుంది. అమ్మకం ద్వారా 169.5 మిలియన్‌ డాలర్లను ఫండ్‌ మేనేజర్‌ వెనక్కు తీసుకుంటారు.


PVR: సెప్టెంబరు త్రైమాసికంలో ఏకీకృత నష్టాన్ని రూ.71.49 కోట్లకు తగ్గించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.153.27 కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసింది.


హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా: సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సిమెంట్ తయారీ సంస్థ నికర లాభం 88.23 శాతం క్షీణించి రూ.7.01 కోట్లకు పడిపోయింది. తగ్గిన అమ్మకాలు దీనికి కారణం. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.59.56 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది.


టాటా కాఫీ: ప్లాంటేషన్ &ఇన్‌స్టంట్ కాఫీ వ్యాపారాల్లో మెరుగైన పనితీరు, ఏక కాల అసాధారణ ఆదాయం కారణంగా సెప్టెంబరు 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.147 కోట్లకు ఏకీకృత లాభంతో, 172 శాతం వృద్ధిని నమోదు చేసింది. నాన్ కోర్ అసెట్‌ను అమ్మడం ద్వారా అసాధారణ ఆదాయాన్ని సంపాదించింది.


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: మొండి బకాయిల క్షీణత, నికర వడ్డీ ఆదాయం పెరగడం వల్ల సెప్టెంబరు త్రైమాసికంలో ఈ రుణదాత నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.535 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ బ్యాంక్‌ రూ.264 కోట్ల స్వతంత్ర లాభాన్ని నివేదించింది.


మహారాష్ట్ర సీమ్‌లెస్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకకీృత లాభం 86 శాతం పెరిగి రూ.176.6 కోట్లకు చేరుకుంది. శరత్ కుమార్ మొహంతీని CFOగా ఈ కంపెనీ నియమించింది, దీనికి వాటాదారుల ఆమోదం రావలసి ఉంది. 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి కూడా కంపెనీ సిఫార్సు చేసింది.


వి మార్ట్ రిటైల్: ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లైమ్‌రోడ్‌ను (LimeRoad) ఈ ఫ్యాషన్‌ రిటైలర్‌ కొనుగోలు చేయబోతోంది. ఓమ్ని-ఛానల్ స్పేస్‌లో కంపెనీ ఉనికిని విస్తరించుకోవడానికి ఇది సహాయపడుతుంది. 


స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్: ఈ హైదరబాదీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, Q2FY23లో రూ.49.5 కోట్ల నికర లాభంతో బౌన్స్‌ బ్యాక్‌ అయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.222.68 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. అయితే, ఆదాయం ఏడాది ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి రూ.281 కోట్లకు చేరుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.