Stocks to watch today, 14 March 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 34 పాయింట్లు లేదా 0.20 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,213 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


మహీంద్రా CIE ఆటోమోటివ్: బ్లాక్ డీల్ ద్వారా, మహీంద్ర CIE ఆటోమోటివ్‌లో 2,28,80,000 షేర్లు లేదా 6.05% వాటాను మహీంద్ర & మహీంద్ర ఆఫ్‌లోడ్ చేసింది. సోమవారం ఈ బ్లాక్‌ డీల్‌ జరిగింది.


సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్: ప్రమోటర్‌ కంపెనీ బ్లాక్‌స్టోన్, సోమవారం, బ్లాక్ డీల్ ద్వారా సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్‌లో తన మొత్తం 20.5% వాటాను సుమారు రూ. 4,916 కోట్లకు విక్రయించింది.


లుపిన్: లుపిన్‌కు చెందిన పుణెలోని బయోరీసెర్చ్ సెంటర్‌లో యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) తనిఖీ పూర్తి చేసింది. ఎలాంటి పరిశీలనలు జారీ చేయలేదు. అంటే, ఈ ఫ్లాంటు 100% ఓకే అని అర్ధం.


ఎంబసీ ఆఫీస్ పార్క్స్ REIT: తన 43.6 msf పాన్-ఇండియా పోర్ట్‌ఫోలియోలో పర్యావరణం, సామాజిక, పరిపాలన (ESG) కార్యక్రమం కోసం ఎంబసీ ఆఫీస్ పార్క్స్ REIT రూ. 300 కోట్లకు పైగా కేటాయించింది.                        


గెయిల్: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 4 మధ్యంతర డివిడెండ్‌ను గెయిల్ బోర్డు (ఇండియా) ఆమోదించింది. రికార్డు తేదీగా 2023 మార్చి 21ని కంపెనీ ప్రకటించింది.              


నాల్కో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం, ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 2.5 రెండో మధ్యంతర డివిడెండ్‌ను నాల్కో ప్రకటించింది.                        


అపోలో పైప్స్‌: నిధుల సమీకరణను పరిశీలించడానికి కంపెనీ బోర్డు ఇవాళ సమావేశం కాబోతోంది. కాబట్టి ఈ స్టాక్‌ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటుంది.                       


టాటా కెమికల్స్: ఫిచ్ రేటింగ్స్ టాటా కెమికల్స్ (TCL) దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ బాండ్‌ జారీల రేటింగ్‌ను "స్టేబుల్‌" ఔట్‌లుక్‌తో 'BB+'కు సవరించింది.                      


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.