Stocks to watch today, 12 December 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 46 పాయింట్లు లేదా 0.25 శాతం రెడ్ కలర్‌లో 18,545 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
యూనిపార్ట్స్ ఇండియా: ఇంజినీర్డ్ సిస్టమ్స్, సొల్యూషన్స్‌ను అందించే ఈ కంపెనీ ఇవాళ (సోమవారం, 12 డిసెంబర్ 2022) దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేస్తోంది. 2022 నవంబర్ 30 - డిసెంబర్ 2 తేదీల రూ. 835.6 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కొనసాగింది. రూ. 548- 577 రేంజ్‌లో ఒక్కో షేరును విక్రయించింది. ఈ ఇష్యూ మొత్తం 25.3 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయింది.
భారతి ఎయిర్‌టెల్: 2020 జనవరిలో ఈ కంపెనీ జారీ చేసిన ఫారిన్ డెట్ బాండ్లను కలిగి ఉన్నవారికి $8.6 మిలియన్ల విలువైన ఈక్విటీని కేటాయించడానికి ఈ టెలికాం ప్లేయర్ బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ 1 బిలియన్ డాలర్ల కోసం విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లను (FCCBలు) జారీ చేసింది. 2025 నాటికి వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంది.
NTPC: తమిళనాడులోని ఎట్టయపురం వద్ద 162.27 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఈ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ తెలిపింది. దీంతో కలిపి, NTPC స్టాండలోన్ ఇన్‌స్టాల్డ్, కమర్షియల్ కెపాసిటీ 57,801.27 మెగావాట్లకు చేరుకుంది. మొత్తం గ్రూప్ ఇన్‌స్టాల్డ్, కమర్షియల్ కెపాసిటీ 70,416.27 మెగావాట్లకు చేరుకుంది.
వొడాఫోన్ ఐడియా: ఈ టెలికాం ప్లేయర్, దాని వెండార్ ATC టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిసి, రూ. 1,600 కోట్ల విలువైన ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల సబ్‌స్క్రిప్షన్ చివరి తేదీని 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించడానికి పరస్పరం అంగీకరించాయి.
మ్యారికో: 493 బిలియన్ వియత్నామీస్ డాంగ్‌లతో (సుమారు రూ. 172 కోట్లు) వియత్నాంకు చెందిన బ్యూటీ ఎక్స్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేస్తోంది. మహిళల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల బ్రాండ్లు 'ప్యూరిటే డి ప్రోవెన్స్', 'లివ్'ను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల, వియత్నాంలో తన ఉనికిని విస్తరించుకోవడానికి మ్యారికోకు వీలవుతుంది.
గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్: గోవాలోని గ్రెన్‌మార్క్ ఫార్మా తయారీ కర్మాగారంలో అవసరమైన లేబొరేటరీ కంట్రోల్ మెకానిజం ఏర్పాటు చేయడంలో వైఫల్యం సహా వివిధ తయారీ లోపాలను US హెల్త్ రెగ్యులేటర్ USFDA కనుగొంది. ఈ మేరకు గ్లెన్‌మార్క్ యొక్క MD గ్లెన్ సల్దాన్హాకు ఒక లేఖ పంపింది.
వి-గార్డ్ ఇండస్ట్రీస్: సన్‌ఫ్లేమ్ ఎంటర్‌ప్రైజెస్‌ను రూ. 660 కోట్లకు మొత్తం నగదు ఒప్పందంలో వి-గార్డ్ కొనుగోలు చేయబోతోంది. సన్‌ఫ్లేమ్ కంపెనీని కొనుగోలు చేయడం వల్ల వి-గార్డ్ కిచెన్ ఉపకరణాల వ్యాపారాన్ని పెంచడంలో సాయపడుతుంది, సినర్జీ ప్రయోజనాలను అందిస్తుంది.
హిందుస్థాన్ జింక్: అనిల్ అగర్వాల్ యాజమాన్యంలో నడుస్తున్న ఈ సంస్థలో తనకున్న మైనారిటీ ఈక్విటీ వాటాను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వం, విదేశీ ఫండ్స్ ఏ మేరకు దీని మీద ఆసక్తి చూపుతాయి, ఎంత మేర నిధులు వస్తాయన్న లెక్కలు వేస్తోంది. ప్రస్తుతం, హిందుస్థాన్ జింక్‌లో భారత ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉండగా, 5.54 శాతం వాటా పబ్లిక్ వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.