Stocks to watch today, 03 November 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 157.5 పాయింట్లు లేదా 0.87 శాతం రెడ్ కలర్‌లో 18,005 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: HDFC, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, కోరమాండల్ ఇంటర్నేషనల్, వొడాఫోన్ ఐడియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేవయాని ఇంటర్నేషనల్, SKF ఇండియా, అజంతా ఫార్మా, యూకో బ్యాంక్, సనోఫీ ఇండియా, బ్లూ స్టార్, సఫైర్ ఫుడ్స్, అమరరాజా బ్యాటరీస్
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
రిలాక్సో ఫుట్‌వేర్స్: 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్స్ పడిపోవడం, ముడిసరుకు ధరలు పెరిరిగిన కారణంగా ఈ పాదరక్షల తయారీ సంస్థ నికర లాభం 67.38 శాతం తగ్గి రూ. 22.40 కోట్లకు క్షీణించింది. ఏడాది క్రితం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.68.69 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ నమోదు చేసింది.
మహీంద్ర & మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్: సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 55 శాతం క్షీణించి రూ. 492 కోట్లకు చేరుకుంది. క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 1,103 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
లుపిన్: లుపిన్‌కు చెందిన మహారాష్ట్ర ప్లాంట్‌లో పరికరాలను శుభ్రపరచడానికి తగిన విధానం లేకపోవడం, తయారీ లోపాలను USFDA గుర్తించింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (API) ఉత్పత్తి చేసే తారాపూర్ (థానే) ప్లాంట్‌లో జరిగిన తనిఖీలోనూ బయటపడ్డ వివిధ లోపాలను ఎత్తిచూపుతూ ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చింది.
అదానీ ట్రాన్స్‌మిషన్: ఈ అదానీ గ్రూప్ సంస్థ ఏకీకృత నికర లాభం గత సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఈసారి 32 శాతం క్షీణించి రూ. 194 కోట్లకు చేరింది. ఫారెక్స్ కదలికలు ప్రధానంగా ప్రతికూల ప్రభావం చూపాయి.
దాల్మియా భారత్: సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, ఈ సిమెంట్ తయారీ సంస్థ ఏకీకృత నికర లాభం రూ.47 కోట్లుగా నమోదైంది, 76.84 శాతం క్షీణించింది. ఏడాది క్రితం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
JK సిమెంట్: జేకే సిమెంట్ అనుబంధ సంస్థ Jaykaycem (సెంట్రల్) మధ్యప్రదేశ్‌లోని పన్నాలో కొత్తగా ఏర్పాటు చేసిన సిమెంట్ తయారీ కేంద్రాలను ప్రారంభించింది. వీటి సామర్థ్యం సంవత్సరానికి 2 మిలియన్ టన్నులు. క్లింకరైజేషన్ పూర్తి కావచ్చే దశలో ఉంది, త్వరలో ప్రారంభమవుతుంది.
MTAR టెక్నాలజీ: FY23 సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఈ డిఫెన్స్ కంపెనీ ఏకీకృత లాభం 30 శాతం పెరిగి రూ.24.7 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 38.2 శాతం పెరిగి రూ.126.2 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.