Stock Market @12 PM 28 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం నష్టాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. రూపాయి విలువ మరింత పతనం అవుతుండటం కలవరపెడుతోంది. ఉదయం గ్యాప్‌డౌన్‌తో ఓపెనైన సూచీలు ప్రస్తుత కోలుకుంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 50 పాయింట్ల నష్టంతో 15,780, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 191 పాయింట్ల నష్టంతో 52,865 వద్ద కదలాడుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 53,161  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,846 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,౭౭౧ వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,023 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 191 పాయింట్ల నష్టంతో 52,965 వద్ద కొనసాగుతోంది. 


NSE Nifty


సోమవారం 15,832 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,757 వద్ద ఓపెనైంది. 15,710 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,702 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 40 పాయింట్ల నష్టంతో 15,780 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 33,578 వద్ద మొదలైంది. 33,503 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,697 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 185 పాయింట్ల నష్టంతో 33,626 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, హీరోమోటో కార్ప్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటాన్‌, ఏసియన్ పెయింట్స్‌, దివిస్‌ ల్ఆయబ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. దాదాపుగా మేజర్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, ఆటో సూచీలు ఎగిశాయి.