అక్కినేని మనవడు, యువ హీరో సుశాంత్ నటించిన వెబ్ సిరీస్ 'మా నీళ్ల ట్యాంక్'. జీ 5 ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్‌ ఒరిజినల్ సిరీస్ ఇది. జూలై 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌గా టీజర్ విడుదల చేశారు.


అనగనగా ఒక పల్లెటూరు బుచ్చివోలు.అది ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కోదండం సొంతూరు. తాను ప్రేమించిన అమ్మాయి సురేఖ (ప్రియా ఆనంద్) రాకపోతే నీళ్ల ట్యాంక్‌లోకి దూకేస్తానని ఎమ్మెల్యే కొడుకు గోపాల్ (సుదర్శన్) బెదిరిస్తాడు. అసలు, సురేఖ ఎక్కడికి వెళ్ళింది? సురేఖను తీసుకొచ్చే బాధ్యత తీసుకున్న ఎస్సై గిరి (సుశాంత్) ఏం చేశాడు? ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఊరిలో వాతావరణం ఎలా ఉంది? ఎవరి ప్లాన్స్ ఏంటి? అనేది జూలై 15న వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలని 'మా నీళ్ల ట్యాంక్' టీమ్ అంటోంది. టీజర్ చివర్లో 'ఇదే మేటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా. నా పాన్ ఇండియా ఫ్యాన్స్ నీ కోసం వెతుకుతారు' అని సుదర్శన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 


'వరుడు కావలెను' సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీ సౌజన్య ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ''రొమాంటిక్ కామెడీ సిరీస్ ఇది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. మంచి కథ, కామెడీతో ఆహ్లదకరంగా తీశాం'' అని ఆమె చెప్పారు.


Also Read : గుండెపోటుతో సీనియర్ నటి అంబికా రావు మృతి


ప్రియా ఆనంద్, సుదర్శన్, నిరోషా, ప్రేమ్ సాగర్, 'బిగ్ బాస్' దివి తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్ కొల్లా నిర్మాత. కిట్టూ విస్సాప్రగడ మాటలు, పాటలు రాశారు. రాజశ్రీ బిస్త్, సురేష్ మైసూర్ కథ, స్క్రీన్ ప్లే... నరేన్ ఆర్కే సిద్దార్థ్ సంగీతం అందించారు.


Also Read : ఓ వారం వెనక్కి వెళ్లిన పృథ్వీరాజ్ - 'కడువా' విడుదల వాయిదా