Stock Market Update: స్టాక్‌ మార్కెట్లు వరుసగా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా అనిపించడం లేదు. దాంతో ఒకవైపు చమురు ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు వస్తు సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లన్నీ ప్రతికూలంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఇవన్నీ మదుపర్లను కలవరపెడుతున్నాయి. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 366 పాయింట్ల నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,498 వద్ద ముగిసింది. 


BSE Sensex


క్రితం సెషన్లో 55,468 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,921 వద్ద ఆరంభమైంది. 55,996 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత  అమ్మకాల సెగ తగలడంతో 54,931 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 366 పాయింట్ల నష్టంతో 55,102 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 16,605 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,723 వద్ద మొదలైంది. వెంటనే 16,768 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం  మదుపర్లు విక్రయాలకు దిగడంతో 16,442 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 107 పాయింట్ల నష్టంతో 16,498 వద్ద ముగిసింది.


Bank Nifty


బ్యాంకు నిఫ్టీ 428 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 35,621 వద్ద ఓపెనైన సూచీ 35,804 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. 34,721 వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 34,944 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీలో 18 కంపెనీలు లాభాల్లో, 32 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, యూపీఎల్‌,  పవర్‌గ్రిడ్‌, విప్రో, టెక్‌ మహీంద్రా లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ సెమ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, శ్రీసెమ్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంక్‌ సూచీలు 1-2 శాతం పతనమవ్వగా ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ స్వల్పంగా నష్టపోయాయి. మెటల్‌, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌ సూచీలు 1-2 శాతం లాభపడ్డాయి.