Stock Market Update: స్టాక్ మార్కెట్లో (Indian Stock markets) హోలీ పండుగ ఒకరోజు ముందే వచ్చేసినట్టుంది! అన్ని రంగాల సూచీలూ ఆకుపచ్చ రంగులో కళకళలాడాయి. గురువారం వీక్లీ ఎక్స్‌పైరీ కావడంతో సూచీలు ఒడుదొడుకుల్లో ఉంటాయని అనుకున్నారు. కానీ ముడి చమురు ధరలు తగ్గడం (Crude Oil), రష్యా- ఉక్రెయిన్ (Russia - Ukrain war) మధ్య చర్చలు జరుగుతుండటం, ఫెడ్ రేట్ల పెంపును (US Fed rates hike) పట్టించుకోకపోవడం మదుపర్లలో సానుకూల సెంటిమెంటును నింపింది. పైగా అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం కలిసొచ్చింది. దాంత బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 శాతానికి పైగా లాభపడ్డాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 56,816 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) నేడు 57,620 వద్ద మెరుగ్గా ఆరంభమైంది. ఉదయం నుంచే మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీ గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగింది. 57,518 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 58,095 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. మొత్తంగా 1047 పాయింట్ల లాభంతో 57,863 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 16,975 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) గురువారం 17,202 వద్ద భారీ గ్యాప్ అప్‌తో మొదలైంది. అప్పట్నుంచే గరిష్ఠ స్థాయిల్లో సూచీ కదలాడింది. 17,175 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 17,344 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 322 పాయింట్ల లాభంతో 17,297 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంకూ అదే జోరు ప్రదర్శించింది. ఉదయం 36,302 వద్ద ఆరంభమైంది. 36,261 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సూచీ 36,611 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 680 పాయింట్ల లాభంతో 36,428 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీలో 46 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. 4 నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), టైటాన్ (Titan), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ లైఫ్, రిలయన్స్ 3-5 మధ్య లాభాల్లో ముగిశాయి. ఇన్ఫీ (Infy), సిప్లా, ఐఓసీ, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలూ గ్రీన్‌లోనే ముగిశాయి. ఆటో, బ్యాంక్, మెటల్, రియాల్టీ 2 శాతం వరకు మెరుగయ్యాయి.