Stock Market News Today in Telugu: భారత స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌ & నిఫ్టీ ఈ రోజు (బుధవారం, 24 ఏప్రిల్‌ 2024) కూడా శుభారంభం చేశాయి. ఓపెనింగ్‌ ట్రేడ్‌లో బ్యాంక్ నిఫ్టీ 48,100 దగ్గరకు చేరింది. స్మాల్‌ క్యాప్ ఇండెక్స్ గరిష్ట స్థాయికి చేరుకుంది, నిన్నటి బూమ్‌ను కొనసాగిస్తోంది. 


ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 73,738 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 219.12 పాయింట్లు లేదా 0.30 శాతం పెరుగుదలతో 73,957.57 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 22,368 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 53.55 పాయింట్లు లేదా 0.24 లాభంతో 22,421.55 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో... BSE మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌లు బలంగా ఉన్నాయి, బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లను మించి పెరిగాయి.


సెక్టార్ల వారీగా చూస్తే... ఒక్క ఎఫ్‌ఎంసీజీ రంగం మాత్రమే రెడ్ జోన్‌లో ఉంది. మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 1.15 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.07 శాతం పెరిగాయి. రియాల్టీ ఇండెక్స్‌ వరుసగా రెండో రోజు కూడా ఎగబాకుతోంది.


ఈ రోజు బిజినెస్‌ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 25 షేర్లు పురోగమనంలో ఉంటే, 5 షేర్లు తిరోగమనంలో ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో... జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.26 శాతం లాభంతో ముందుంది. టాటా స్టీల్ 1.18 శాతం, నెస్లే 0.97 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.77 శాతం, టాటా మోటార్స్ 0.66 శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌లో..  హెచ్‌యూఎల్ 0.48 శాతం, టైటన్ 0.28 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.27 శాతం తగ్గాయి. ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌&టీ షేర్లు కూడా పతనావస్థలో కనిపించాయి.


ఓపెనింగ్‌ టైమ్‌లో, BSEలో మొత్తం 2,860 షేర్లు ట్రేడ్ అవుతుండగా.. వాటిలో 2,174 షేర్లు లాభాల్లో ఉన్నాయి. 591 షేర్లు క్షీణించాయి. 95 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 123 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 32 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో ఆగిపోయాయి.


బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ‌(BSE Market Capitalization)
BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ మరోమారు రూ. 400 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది, రూ. 401.45 లక్షల కోట్లకు చేరుకుంది,


బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్‌ మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపింది, ఈ ఇండెక్స్‌లోని 12 షేర్లలో 9 లాభాల్లోకి వచ్చాయి.


ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 275.30 పాయింట్లు లేదా 0.37% పెరిగి 74,013.76 దగ్గర; NSE నిఫ్టీ 75.40 పాయింట్లు లేదా 0.34% పెరిగి 22,443.40 వద్ద ట్రేడవుతున్నాయి. 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, దాల్మియా భారత్, మాక్రోటెక్ డెవలపర్లు, ఇండియన్ హోటల్స్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సింజీన్ ఇంటర్నేషనల్, DCB బ్యాంక్, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్, సుప్రీమ్ పెట్రోకెమ్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, అనంత్ రాజ్.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, ఈ ఉదయం, జపాన్‌లోని నికాయ్‌ 2 శాతం ర్యాలీ చేసింది. కోస్పి, తైవాన్ 1.7 శాతం చొప్పున పెరిగాయి. హాంగ్ సెంగ్ 0.9 శాతం పెరిగింది.


యూఎన్‌ మార్కెట్లలో, నిన్న, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.69 శాతం పెరిగింది. S&P 500 1.2 శాతం లాభపడింది. నాస్డాక్ కాంపోజిట్ 1.59 శాతం ర్యాలీ చేసింది.


యూఎస్‌ మాన్యుఫాక్చరింగ్‌ డేటా తర్వాత అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ పెరిగింది, ప్రస్తుతం 4.619 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $88 పైకి చేరింది. గోల్డ్ తగ్గుతోంది, ఔన్సుకు $2,330 దగ్గర ఉంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బ్యాటరీ ఫ్లాంట్‌ కోసం రిలయన్స్‌ను ఢీ కొడుతున్న అమరరాజా