Stock Market News Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ ఈ రోజు ‍(శుక్రవారం, 22 డిసెంబర్‌ 2023) ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఈ రోజు మన ఈక్విటీలకు గ్లోబల్‌ మార్కెట్ల ప్రోత్సాహం లభించినా... తొలి అరగంటలో ఒడిదొడుకులకు లోనయ్యాయి. కింద పడినా మళ్లీ పుంజుకున్నాయి. ఓపెనింగ్‌ టైమ్‌లో 1,679 షేర్లు అప్‌వార్డ్‌లో ఉండగా, 359 షేర్లు డౌన్‌వార్డ్‌లో ఉన్నాయి. 88 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (మంగళవారం) 70,865 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 18.36 పాయింట్లు లేదా 0.03 శాతం లాభంతో 70,883.46 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గత సెషన్‌లో 21,25 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 16.30 పాయింట్లు లేదా 0.08 శాతం పెరుగుదలతో 21,271.30 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


ప్రి-ఓపెన్‌ సెషన్‌
ప్రి-ఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ దాదాపు 230 పాయింట్ల లాభంతో 72,000 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంతో 21,300 పాయింట్ల దిగువన ఉంది.


మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో... HCL టెక్‌, టాటా స్టీల్, టాటా మోటార్స్, రఏఐ స్టీల్, సన్ ఫార్మా, విప్రో, టెక్ మహీంద్ర ముందంజలో ఉన్నాయి.


అదే సమయానికి, నిఫ్టీ 50 ప్యాక్‌లో... అదానీ పోర్ట్స్, LTI మైండ్‌ట్రీ, హిందాల్కో ఇండస్ట్రీస్, HCL టెక్నాలజీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు... M&M, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, L&T, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లోకి చేరాయి.


నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు తలో 1 శాతానికి పైగా లాభంతో ఈ రోజు బలాన్ని ప్రదర్శించాయి. నిఫ్టీ ఫార్మా కూడా 0.9 శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 0.2 శాతం నష్టాల్లో ఉంది.


BSE మిడ్‌ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.6 శాతం, 1 శాతం చొప్పున పెరిగాయి.


25 శాతం మినిమమ్‌ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) నిబంధనపై, ప్రభుత్వ రంగ బీమా సంస్థ LICకి 10 సంవత్సరాల పొడిగింపు దక్కడంతో ఈ కంపెనీ షేర్లు 6 శాతం ర్యాలీ చేశాయి. 


ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 188.24 పాయింట్లు లేదా 0.27% పెరిగి 71,053.34 దగ్గర; NSE నిఫ్టీ 84.95 పాయింట్లు లేదా 0.40% లాభంతో 21,340 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
క్రిస్మస్‌కు ముందు గ్లోబల్ మార్కెట్లు మళ్లీ ఊపందుకున్నాయి. బలమైన ఆర్థిక గణాంకాల తర్వాత అమెరికన్ మార్కెట్లు గురువారం పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గింస్తుందన్న ఆశలను బలమైన US GDP డేటా పెంచింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.87 శాతం బలపడి 37,400 పాయింట్లను దాటింది. S&P 500 1 శాతం పైగా పెరిగింది. టెక్-ఫోకస్డ్ నాస్‌డాక్ ఇండెక్స్ 1.26 శాతం బలపడింది. 


ఈ రోజు ప్రారంభంలో ఆసియా మార్కెట్లు బుల్లిష్‌గా ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.36 శాతం, టోపిక్స్ 0.51 శాతం లాభపడ్డాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.43 శాతం, కోస్‌డాక్ 0.33 శాతం బలంగా ఉన్నాయి. హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ ఫ్యూచర్స్ కూడా లాభంలో ప్రారంభమయ్యే సంకేతాలు చూపాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి