Stock Market News Today in Telugu: గత సెషన్‌లో (సోమవారం) రికార్డు స్థాయికి పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఈ రోజు (మంగళవారం, 20 ఫిబ్రవరి 2024) ట్రేడింగ్‌లో డీలా పడింది, 22,100 దిగువకు పడిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ స్వల్ప లాభంతో గ్రీన్‌ కలర్‌లో ప్రారంభమైంది. అమెరికన్‌ మార్కెట్లు సోమవారం సెలవు తీసుకోవడం, ఆసియా మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు లేకపోవడం వంటివి మన మార్కెట్లపై ప్రభావం చూపాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (సోమవారం) 72,708 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 19.71 పాయింట్లు పెరిగి 72,727.87 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 22,122 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 23 పాయింట్లు తగ్గి 22,099.20 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.17 శాతం వరకు పడిపోయాయి.


BSE స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌లో.. స్నోమాన్‌, ఓమాక్స్‌ (Omaxe), దీపక్‌ ఫర్టిలైజర్స్‌, బజాజ్‌ హిందుస్థాన్‌ భారీగా, 8 నుంచి 13 శాతం వరకు లాభపడ్డాయి. 63 మూన్స్‌ 5 శాతం వరకు పడిపోయింది.


BSE మిడ్‌ క్యాప్ స్టాక్స్‌లో.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 6 శాతం పెరిగింది. లోధ, సోనా క్యామ్స్‌ 4 శాతం పైగా లాభపడ్డాయి. ఫెడరల్‌ బ్యాంక్‌ 6 శాతం వరకు తగ్గింది.


సెన్సెక్స్ షేర్లు
మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో కేవలం 9 స్టాక్స్‌ మాత్రమే లాభాల్లో ఉండగా, మిగిలిన 21 స్టాక్స్‌ నష్టాల్లో కనిపించాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో.. పవర్‌గ్రిడ్ 2 శాతం, కోటక్ మహీంద్ర బ్యాంక్ 1.50 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.68 శాతం చొప్పున లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కూడా బలపడ్డాయి. టాప్‌ లూజర్స్‌లో.. మహీంద్ర&మహీంద్ర 1.16 శాతం పడిపోయింది. బజాజ్ ఫిన్‌సర్వ్ 1.01 శాతం, ICICI బ్యాంక్ దాదాపు 1 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకి కూడా రెడ్‌ జోన్‌లో ఉన్నాయి.


సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 0.5 శాతం క్షీణించింది. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2.6 శాతం పెరిగింది.


ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 12.48 పాయింట్లు లేదా 0.01% తగ్గి 72,695.68 దగ్గర; NSE నిఫ్టీ 18.50 పాయింట్లు లేదా 0.08% తగ్గి 22,103.75 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం, నికాయ్‌, హాంగ్ సెంగ్, తైవాన్ 0.5 శాతం చొప్పున పెరిగాయి. స్ట్రెయిట్స్ టైమ్స్ ఫ్లాట్‌గా ఉండగా, కోస్పి 0.5 శాతం క్షీణించింది. ప్రెసిడెంట్స్ డే సెలవు కారణంగా సోమవారం US మార్కెట్‌లో ట్రేడింగ్ జరగలేదు. 


US 10-ఇయర్స్ బాండ్ ఈల్డ్ 4.3 శాతం స్థాయిలో ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు దాదాపు $83.50 స్థాయికి చేరాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఎన్నికల నుంచి లాభపడే 10 స్టాక్స్‌, 3-4 నెలల్లో బలమైన ర్యాలీకి ఛాన్స్‌!