Stock Market Updates: సోమవారం (19 ఫిబ్రవరి 2024) ట్రేడింగ్ సెషన్‌లో, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ చారిత్రాత్మక గరిష్టాన్ని తాకి, మరో రికార్డ్‌ సృష్టించింది. ఆ సెషన్‌లో నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయి (Nifty At All time High) 22,186.65 వద్దకు చేరుకుంది. జేఎం ఫైనాన్షియల్‌ అంచనా ప్రకారం, రాబోయే మూడు, నాలుగు నెలల్లో నిఫ్టీ బస్‌ జర్నీ ఎలాంటి అడ్డంకులు లేని హైవే మీద సాగిపోవచ్చు.


"ఎన్నికల ముందస్తు ర్యాలీలోస రాబోయే 3, 4 నెలల్లో NSE నిఫ్టీ 23,500 పాయింట్ల రికార్డ్‌ స్థాయికి చేరగలదని మేం ఆశిస్తున్నాం. మా అంచనా ప్రకారం, నిఫ్టీ ప్రస్తుత స్థాయి నుంచి 6.22 శాతం పెరగొచ్చు" - JM ఫైనాన్షియల్‌ డైరెక్టర్, టెక్నికల్ & డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ రాహుల్ శర్మ


నిఫ్టీతో పాటే, ప్రి-ఎలక్షన్‌ ర్యాలీలో బుల్లిష్‌నెస్‌ చూడగలిగే 10 స్టాక్స్‌ పేర్లను కూడా రాహుల్‌ శర్మ వెల్లడించారు. డెలివరీ కింద ఈ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. 10 శాతం పోర్ట్‌ఫోలియోను ఈ మొత్తం 10 స్టాక్స్‌కు  కేటాయించాలని సూచించారు.


ఎన్నికలకు ముందు ర్యాలీ చేయగలిగే అవకాశం ఉన్న 10 స్టాక్స్‌ (10 Stocks Likely to Rally Ahead of Elections)


- ఎన్నికలకు ముందు ర్యాలీని చూడగలిగే 10 స్టాక్స్‌ లిస్ట్‌లో కోఫోర్జ్‌ ఉంది. దీని ప్రస్తుత ధర రూ.6,800. రాబోయే 3-4 నెలల్లో ఇది రూ.8,000 వరకు పెరగవచ్చు, ఇది 18 శాతం వృద్ధిని చూపుతుంది. 
- ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం రూ.189 వద్ద ట్రేడవుతోంది. ఇది 59 శాతం జంప్‌తో రూ.300కి చేరుకుంటుందని అంచనా.
- L&T షేర్‌ ఇప్పుడు రూ.3,350 వద్ద ఉంది. ఈ స్టాక్ 19 శాతం వరకు రాబడితో రూ. 4000 వరకు వెళ్లవచ్చు. 
- మారుతి సుజుకి రూ.11,500 వద్ద ఉంది. ఇది 13 శాతం పెరుగుదలతో రూ.13,000 వరకు ర్యాలీ చేయవచ్చు.
- రాహుల్ శర్మ సూచించిన స్టాక్స్‌లో, ప్రభుత్వ రంగంలోని NMDC అత్యధిక రాబడిని ఇచ్చే ఛాన్స్‌ ఉంది. రూ.248 వద్ద ట్రేడ్‌ అవుతున్న ఈ స్టాక్‌ 61 శాతం వరకు రాబడిని ఇవ్వగలదు, రూ. 400 స్థాయిని తాకవచ్చు. 
- రిలయన్స్ రూ.2,955 వద్ద ఉంది. 3-4 నెలల్లో ఇది రూ.3500కి చేరుకుంటుందని, పెట్టుబడిదార్లకు 18 శాతం రాబడిని ఇస్తుందని లెక్కగట్టారు. 
- రేమండ్ షేర్‌ రూ.1,772 దగ్గర ఉంది. ఈ స్టాక్ 24 శాతం జంప్‌తో రూ.2,200 వరకు వెళ్లవచ్చు. 
- సెయిల్ స్టాక్ ప్రస్తుతం రూ.134 స్థాయిలో ఉంది. ఇది 54 శాతం పెరిగి రూ.200 లెవెల్‌ను చేరవచ్చు.
- SBI ప్రస్తుతం రూ.764 వద్ద ఉంది. 3-4 నెలల్లో 18 శాతం లాభఫడి రూ.900కి చేరుకునే అవకాశం ఉంది. 
- జొమాటో షేర్‌ రూ.157 వద్ద ఉంది. ఇది 27 శాతం జంప్‌తో రూ.200 స్థాయికి చేరుకుంటుందని అంచనా.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి