Stock Market News Today in Telugu: గ్లోబల్‌ మార్కెట్లలో మిక్స్‌డ్‌ సెంటిమెంట్‌ కారణంగా ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 12 ఏప్రిల్‌ 2024) డౌన్‌ ట్రెండ్‌లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 75,000 స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ 22,700 దిగువన ఓపెన్‌ అయింది. బ్యాంక్, ఫైనాన్షియల్‌ షేర్లు బలహీనంగా కదులుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్‌ కనిపించింది. స్మాల్‌ క్యాప్, మిడ్‌ క్యాప్ సూచీలు కష్టాల్లో పడ్డాయి. మెటల్ ఇండెక్స్, ఫార్మా ఇండెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్, ఐటీ సెక్టార్, బ్యాంకింగ్ రంగాలపై ఒత్తిడి కారణంగా మార్కెట్‌లో ఉత్సాహం కనిపించడం లేదు.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (బుధవారం) 75,038 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 148.51 పాయింట్లు లేదా 0.20 శాతం తగ్గి 74,889.64 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 22,753 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 76.40 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 22,677.40 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో.. BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.03, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.13 పెరిగాయి.


ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 11 షేర్లు గ్రీన్‌ జోన్‌లో ట్రేడవుతుండగా, మిగిలిన 19 స్టాక్స్ రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో... ఎన్‌టీపీసీ 2.68 శాతం, టాటా మోటార్స్ 1.27 శాతం, ఎల్‌అండ్‌టీ 0.66 శాతం, నెస్లే 0.56 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.36 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు... సన్ ఫార్మా 1.50 శాతం పడిపోయింది. మారుతి 1.28 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.22 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ సుమారు 1 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.85 శాతం చొప్పున క్షీణించాయి.


నిఫ్టీ50 ప్యాక్‌లో 17 స్టాక్స్‌ లాభాల్లో ట్రేడవుతుండగా, 33 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌ లిస్ట్‌లో... NTPC, టాటా మోటార్స్, DVZ ల్యాబ్స్, కోల్ ఇండియా, నెస్లే షేర్లు కనిపించాయి. మరోవైపు... సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ షేర్లు అత్యధికంగా పడిపోయాయి.


సెక్టార్ల వారీగా చూస్తే... నిఫ్టీ హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీ, PSU బ్యాంక్‌, ఆటో సెక్టార్లు లాభాలను చవిచూశాయి.


ఈ రోజు ఉదయం 10.05 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 390.64 పాయింట్లు లేదా 0.52% తగ్గి 74,647.51 దగ్గర; NSE నిఫ్టీ 108.95 పాయింట్లు లేదా 0.48% తగ్గి 22,644.00 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
గురువారం భారత మార్కెట్లు సెలవు తీసుకున్నా, గ్లోబల్‌ మార్కెట్లు పని చేశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో ఈ రోజు  సెంటిమెంట్‌ మిశ్రమంగా ఉంది. సింగపూర్, దక్షిణ కొరియా, చైనా నుంచి వచ్చే ఆర్థిక & వాణిజ్య డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఈ ఉదయం... జపాన్‌లోని నికాయ్‌ 0.29 శాతం, టోపిక్స్‌ 0.55 శాతం పెరిగాయి. దక్షిణ కొరియాలోని కోస్పి 0.33 శాతం పతనం కాగా, కోస్‌డాక్ 0.85 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాలో, S&P/ASX 200 0.41 శాతం క్షీణించింది. హాంగ్‌కాంగ్‌లోని హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ 1.68 శాతం విలువ కోల్పోయింది.


నిన్న, U.S.లో టెక్ స్టాక్స్‌ పుంజుకోవడంతో S&P 500, నాస్‌డాక్ కాంపోజిట్ వరుసగా 0.74 శాతం, 1.68 శాతం లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్ రేంజ్‌ బౌండ్‌లో ఉంది.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.56 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ $90 పైన కొనసాగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్‌ స్థాయిలో ఔన్సుకు $2,412 దగ్గర ఉంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి