Stock Market News Today in Telugu: ఇండియన్‌ స్టాక్ మార్కెట్ ఈ రోజు (బుధవారం, 07 ఫిబ్రవరి 2024) గ్యాప్‌-అప్‌లో ఓపెన్‌ అయ్యాయి. బ్యాంకింగ్ షేర్లతో పాటు మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ షేర్లు ఫుల్‌ రైజింగ్‌ ఉన్నాయి, ఓవరాల్‌ మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. సెన్సెక్స్ 72500 స్థాయికి ఎగువన ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే బ్యాంక్ నిఫ్టీ 46000 దాటింది. నిఫ్టీ ఆల్-టైమ్ గరిష్ఠానికి దాదాపు 75 పాయింట్ల దూరంలోకి వెళ్లింది. 


నిన్న ప్రారంభమైన RBI MPC భేటీ ఫలితాలు గురువారం మార్నింగ్‌ సెషన్‌లో వెల్లడవుతాయి. రెపో రేట్‌ ఈసారి కూడా మారదని మార్కెట్‌ భావిస్తోంది. ఈ అంచనాకు విరుద్ధంగా వచ్చే నిర్ణయం రేపు మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 72,186 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 362.41 పాయింట్లు లేదా 0.50 శాతం పెరుగుదలతో 72,548.50 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 21,929 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 115.65 పాయింట్లు లేదా 0.53 శాతం జంప్‌తో 22,045.05 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


బ్యాంక్ నిఫ్టీ కూడా 253.80 పాయింట్లు లేదా 0.56 శాతం పెరుగుదలతో 45,944 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఈ ఇండెక్స్‌లోని మొత్తం 12 బ్యాంక్ స్టాక్స్‌ గ్రీన్‌లో ఉన్నాయి. PSU షేర్లు పెరగడంతో బ్యాంకు షేర్లు కూడా లాభపడుతున్నాయి.


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.8 శాతం, స్మాల్‌ క్యాప్ సూచీ కూడా 0.8 శాతం లాభపడ్డాయి.


ఆల్ రౌండ్ బూమ్
స్టాక్ మార్కెట్‌లో ఆల్ రౌండ్ గ్రోత్ కనిపించడంతోపాటు కొన్ని ఇండెక్స్‌లు గరిష్ట స్థాయుల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్, మెటల్ ఇండెక్స్ రికార్డ్‌ స్థాయి వద్ద ప్రారంభమయ్యాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ దాదాపు 3 శాతం లాభపడింది. PSU బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం పెరిగింది. మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ల్లోనూ స్ట్రెంత్‌ ఉండడంతో, నిఫ్టీ50 సూచీ ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరలోకి వెళ్లింది. అయితే, ఐటీ ఇండెక్స్‌ స్వల్ప నష్టాల్లో ఉంది.


సెన్సెక్స్ షేర్లు
ఉదయం 9.33 గంటలకు, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 22 స్టాక్స్‌ లాభాల్లో, 8 స్టాక్స్‌ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. ఎస్‌బీఐ 2.50 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.82 శాతం పెరిగాయి. ఏషియన్ పెయింట్స్, M&M, టైటన్, కోటక్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్, బ్రిటానియా, HDFC లైఫ్, కోల్ ఇండియా కూడా గెయినర్స్‌ లిస్ట్‌లో ఉన్నాయి. టాప్‌ లూజర్స్‌లో.. హెచ్‌సీఎల్‌ 1.17 శాతం, ఇన్ఫోసిస్‌ ఒక శాతం క్షీణించాయి.


నిఫ్టీ షేర్లు
నిఫ్టీ 50 ప్యాక్‌లో.. 38 స్టాక్స్‌ లాభాల్లో ఉండగా, 12 స్టాక్స్‌ క్షీణించాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో.. ఎస్‌బీఐ 2.88 శాతం, కోల్ ఇండియా 2.56 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.09 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 1.67 శాతం చొప్పున పెరిగాయి. టాప్‌ లూజర్స్‌లో.. హెచ్‌సీఎల్ టెక్ 1.23 శాతం, ఇన్ఫోసిస్ 1.21 శాతం, పవర్ గ్రిడ్ 0.58 శాతం, బీపీసీఎల్ 0.57 శాతం, విప్రో 0.55 శాతం పడిపోయాయి. 


ఈ రోజు ఉదయం 09.58 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 198.81 పాయింట్లు లేదా 0.28% పెరిగి 72,384.91 దగ్గర; NSE నిఫ్టీ 67.45 పాయింట్లు లేదా 0.31% పెరిగి 21,996.85 వద్ద ట్రేడవుతున్నాయి. 


ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఆర్తి ఫార్మాలాబ్స్, AIA ఇంజినీరింగ్, అపోలో టైర్స్, అశోక బిల్డ్‌కాన్, ఆదిత్య విజన్, బోరోసిల్ రెన్యూవబుల్స్, కమిన్స్ ఇండియా, డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా, EPL, FDC, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్, GMR పవర్ అండ్‌ అర్బన్ ఇన్‌ఫ్రా, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ & కెమికల్స్, HBL పవర్ సిస్టమ్స్, హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా, HMT, ఇండియా పెస్టిసైడ్స్, జమ్నా ఆటో ఇండస్ట్రీస్, JK పేపర్, కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్, లుపిన్, మణప్పురం ఫైనాన్స్, నవనీత్ ఎడ్యుకేషన్, నెస్లే ఇండియా, నోసిల్, PDS, పికాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రొటీన్ ఇగోవ్ టెక్నాలజీస్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, సఫారీ ఇండస్ట్రీస్ (ఇండియా), సంఘ్వి మూవర్స్, శివాలిక్ బైమెటల్ కంట్రోల్స్, షాల్బీ, శోభా, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా, స్టార్ సిమెంట్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్, UNO మిండా, వరోక్ ఇంజినీరింగ్.


గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం, ఆసియాలో నికాయ్‌ తప్ప మిగిలిన మేజర్‌ మార్కెట్లు పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నాయి. హాంగ్ సెంగ్, కోస్పి, ASX 200 ఇండెక్స్‌లు 0.7-1.8 శాతం వరకు పెరిగాయి, బలం ప్రదర్శిస్తున్నాయి. నిక్కీ ఫ్లాట్‌ లైన్ దిగువన ట్రేడవుతోంది. నిన్న, US మార్కెట్లలో S&P 500 0.23 శాతం పెరిగింది. డౌ జోన్స్‌ 0.37 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.07 శాతం గెయిన్‌ అయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఐటీఆర్‌-1 నుంచి ఐటీఆర్‌-7 వరకు ఉన్నాయి, సరైన ఫామ్‌ ఎంచుకోండి