Krishna Mukunda Murari Today Episode ముకుంద మాటలను తలచుకొని ఆదర్శ్ ఆలోచిస్తూ ఉంటాడు. మధు ఆదర్శ్‌ని చూసి ఏంటి బ్రో ఒక్కడే సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు ముకుంద గురించి తెలిసిపోయిందా అని అనుకుంటాడు. తనలాగే ఆదర్శ్ కూడా ముకుంద బిహేవియర్‌లోని తేడాని గమనించే ఉంటాడని అనుకుంటాడు.
మధు: తనలో తాను.. పాపం ఎక్కడో హాయిగా ఉన్న ఆదర్శ్‌ని కృష్ణ తీసుకొచ్చింది. కృష్ణ పిచ్చి కానీ ముకుంద ఎప్పుడు మారాలి. అవును ఆ తొండ మేటర్ ఇంకా తేలలేదు ఒకసారి కెలికి చూద్దాం. బ్రో ఏంటి ఆలోచిస్తున్నావ్. ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నావు.
ఆదర్శ్: నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పడానికి.. ప్రాబ్లమ్స్ ఏమైనా కొని తెచ్చుకోవాలా ఏంటి.
మధు: బ్రో నీకు ఒకటి అడగాలి అసలు ఆ తొండ ఎక్కడి నుంచి వచ్చింది బ్రో.
ఆదర్శ్: మనసులో.. వీడు ఒకడు కనిపిస్తే చాలు తొండ అని చంపేస్తున్నాడు. చెప్పమంటావా.. జాగ్రత్తగా విను ఎవరికి చెప్పకు జాగ్రత్తకు విను.. వాళ్ల అమ్మ పెట్టిన గుడ్డు నుంచి ఆ తొండ వచ్చింది. సరేనా ఎవరికీ చెప్పకు.
మధు: అర్థమైంది బ్రో తొండ లేదు ఏదీ లేదు ఏదో జరిగింది. ఈ విషయం తెలుసుకునే వరకు వదలను.
మరోవైపు బెస్ట్ కపుల్ ప్రోగ్రాం లేదు అని గోపి మురారికి ఫోన్ చేస్తాడు. కృష్ణకి ఆ విషయం చెప్పి తెగ టెన్షన్ పడతాడు మురారి. ఇక కృష్ణ తనకు ఓ ఐడియా వచ్చిందని గెంతులేస్తుంది. సేమ్ ప్రోగ్రాం మనం మన ఇంట్లోనే ఏర్పాటు చేద్దామని అంటుంది. ఇక ముకుంద, ఆదర్శ్‌లను మనమే గెలిపించొచ్చు అని అంటుంది. మురారి కూడా సూపర్ అంటూ ఓకే చెప్తేస్తాడు. మరోవైపు భవాని వాళ్లు హాల్‌లో ఉండగా ముకుంద, ఆదర్శ్ అక్కడికి వస్తారు.
భవాని: నాన్న నీతోనే మాట్లాడాలి అనుకుంటున్నా.. ఏం చేయాలి అనుకుంటున్నావ్..
మధు: అదే నువ్వు మిలటరీ నుంచి వచ్చేశావ్ కదా ఏం చేయాలి అనుకుంటున్నావ్ అని పెద్ద పెద్దమ్మ అడుగుతుంది.
ఆదర్శ్: ఇంకా ఏం అనుకోలేదు అమ్మ.
భవాని: నేను చెప్పొచ్చా నాన్న..
ఆదర్శ్: ఏంటి అమ్మా అది నువ్వేం చేయమంటే అదే చేస్తాను.
భవాని: సమయం వచ్చినప్పుడు నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావు అనిపించినప్పుడు నేనే చెప్తా.
ముకుంద: మనసులో.. ఏం చేయమంటారు ఈవిడ. నా గురించి పూర్తిగా తెలిసిపోయిందా.. నన్ను దోషిగా నిలబెడుతుందా..
మురారి: బెస్ట్ కపుల్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది.
ముకుంద: హమ్మయ్య టెన్షన్ మొత్తం పోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది.
మధు: అదేంటి బ్రో ఇంత షాకింగ్ న్యూస్ చెప్పావ్..
కృష్ణ: ప్రోగ్రాం క్యాన్సిల్ అయినా ఎంజాయ్ మెంట్‌కి ఎంటర్‌టైన్ మెంట్‌కి ఢోకానే లేదు. ఆ ప్రోగ్రాం మనం చేస్తున్నాం. మన ఫ్యామిలీలోని జంటలు అందరూ పాల్గొంటారు. బెస్ట్ కపుల్ ఎవరో మనమే డిసైడ్ చేస్తాం.
ఇక ఆదర్శ్‌ని పార్టీ ఇవ్వమని కృష్ణ అడుగుతుంది. ఇప్పుడే కావాలి అని రచ్చచేస్తుంది. ఇక రెండు జంటలు బయటకు వెళ్లేందుకు రెడీ అవుతారు. మరోవైపు భవాని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అనగానే ముకుంద సంతోష పడింది అని .. మళ్లీ ఆ ప్రోగ్రాం ఇంట్లో చేస్తాం అనగానే డల్ అయిందని అలా ఎందుకు మారిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. దీనిబట్టి ఆదర్శ్ తన పక్కన ఉండటం ముకుంద ఇష్టం లేదు అని తనకు అర్థమవుతుంది అని ఇంట్లో ఎవరికీ ఎందుకు అర్థంకావడం లేదు అని అనుకుంటుంది.
భవాని: కృష్ణకి కానీ అనిపిస్తే ముఖం మీదే అడిగేస్తుంది. కడిగేస్తుంది. కానీ ముకుంద మారిపోయింది అన్న భ్రమలో ఉండిపోయి.. మైకం కమ్మేసి ముకుందని పసిగట్టడం లేదు. ఎదుటివారిలో మంచి తనం తప్ప మరొకటి చూడలేని అమాయకురాలు అయిపోయింది. అయినా ముకుంద మారిపోయింది అంటే అంత గుడ్డిగా ఎలా నమ్మేసింది. మొసలి కనీళ్లుకు కరిగి పోయి ఆ మనిషి మార్పు గమనించలేకపోతుంది. ఒకప్పుడు ఆ ముకుంద వల్ల ఈ ఇంటికి దూరంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ మనిషి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ తెలియాలి. నా అనుమానం నిజం కాకూడదు అని అనుకుంటున్నాను. కానీ నిజం అయితే మాత్రం ముకుందని క్షమించను. తను మారకపోతే నా ఇద్దరి కొడుకుల జీవితాల్లోనూ విషాదం చోటుచేసుకుంటుంది. ఆ పరిస్థితి రానివ్వను.
మరోవైపు ముకుంద రెడీ అయిపోతుంది. బయట కూడా ఆదర్శ్‌ని ఎలా మ్యానేజ్ చేయాలా అని అనుకుంటుంది. ఇంతలో ఆదర్శ్ వస్తాడు. ఆదర్శ్ డ్రెస్ బాలేదు అని మార్చుకోమని ముకుంద చెప్తుంది. ఇంతలో ఆదర్శ్ బయటకు వస్తే నీకు డస్ట్ ఎలర్జీ కదా అని అడుగుతాడు. అప్పుడు ముకుంద ఆదర్శ్‌లో మురారిని ఊహించుకొని డస్ట్ అలర్జీ అయితే మాస్క్ పెట్టుకుంటా జాగ్రత్తగా ఉంటాను అని కానీ నీతో బయటకు వచ్చే ఛాన్స్ మిస్ చేసుకోలేను అని అలర్జీ లేదు ఓన్లీ ఎనర్జీనే ఉంది అని అంటుంది. ఆ మాటలు తనతో చెప్పిందని ఆదర్శ్ మురిసిపోతాడు. ముకుంద షాక్ అయిపోతుంది. మరోవైపు కృష్ణ, మురారిలు పార్టీకి రెడీ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 7th: పులమ్మని చెల్లాచెదురు చేసిన సుమన.. విశాల్‌కి ఏం డిమాండ్ చేస్తుందో!