Oorvasi Vo Rakshasi Vo Today Episode మధుసూదన్ దగ్గరకు దుర్గ వస్తుంది. కళ్లు కనిపించనట్లు మధుసూదన్ నటిస్తే కళ్లు తెరచి మాట్లాడొచ్చు బాబాయ్ అని దుర్గ అంటుంది. దీంతో మధుసూదన్ నీకు నాకు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా నన్ను కన్నబిడ్డను చూసుకున్నట్లు చూసుకున్నావ్ అమ్మా అని అంటారు.
దుర్గ: నువ్వు ధీరేంద్రని చూడగానే ఎక్కడ కోపంతో మాటలు అనేస్తావేమో అని చాలా భయపడ్డాను బాబాయ్. కానీ ధీరుకి ఎలాంటి అనుమానం రాకుండా బాగా నటించావ్.
మధుసూదన్: కంటి చూపు వచ్చినా రానట్టు నటించమని నవ్వే కదమ్మా చెప్పావ్. కానీ ఈ నాటకం ఇంకా ఎన్నిరోజులమ్మా.
దుర్గ: మీకు చూపు వచ్చిందని వాళ్లకి తెలీకూడదు బాబాయ్. అది మీ ప్రాణాలకే ప్రమాదం. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను.
మధుసూదన్: నేను కళ్లు తెరవగానే వాడు కనిపించగానే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. రెండేళ్లగా నా కూతురికి నన్ను దూరం చేసి నన్ను అంధకారంలో బతికేలా చేశాడు. నా కళ్లముందు ఉన్నా ఏం చేయకుండా ఆగిపోయింది నీకు ఇచ్చిన మాట కోసమే అమ్మా.
దుర్గ: మీ బాధని నేను అర్థం చేసుకోగలను బాబాయ్. మీకు ఇలా అవ్వడానికి కారణం ఆ దుర్మార్గుడు. అందుకే అతని చేతులమీదుగానే మీకు న్యాయం చేయాలి అనుకున్నా అందుకే పక్కా ప్లాన్‌తో ఇదంతా చేశాను. తొందర్లోనే భవ్య దొరుకుతుంది. భవ్య మనకు దొరికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు కోర్టులో చూపించి ధీరుకి శిక్ష పడే వరకు మీకు కంటి చూపు వచ్చిన విషయం మన మధ్యే ఉండాలి.
మధుసూదన్: ఇంత చేస్తున్నావ్.. అసలు ఎవరమ్మా నువ్వు.
దుర్గ: త్వరలోనే నేను ఎవరో చెప్తాను బాబాయ్.
మధుసూదన్: అమ్మా దుర్గ నా కూతురు భవ్య నిజంగానే బతికే ఉందికదా అమ్మ.
దుర్గ: తొందర్లోనే మీ భవ్యని మీ దగ్గరకు తీసుకొస్తాను.
రక్షిత: నీకు నేను ఒక ఫొటో చూపిస్తాను. రెండేళ్ల క్రితం మిస్ అయిన భవ్య ఎక్కడు ఉందో నువ్వు 24 గంటల్లో కనిపెట్టాలి.
వాసు: రెండేళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయి ఇప్పుడు 24 గంటల్లో కనిపెట్టడం కష్టం మేడం.
రక్షిత: నెగిటివ్ వర్డ్స్ నాకు నచ్చవు ఎలా అయినా ఆ అమ్మాయి గురించి నాకు కావాలి. మరోవైపు పని ఆమె ఈ మాటలు వింటుంది.
వాసు: ఆ అమ్మాయి గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మేడం.
రక్షిత: నీకు కావాల్సిన సమాచారం నీ ఫోన్‌కు వస్తుంది.
పురు: నువ్వు అనవసరంగా ఆ మధుసూదర్, భవ్యల గురించి ఆలోచిస్తున్నావ్ రక్షిత. అది జరిగి రెండేళ్లు అయింది. ఇప్పుడు వాళ్లు మన మీద పగ తీర్చుకోవాలి అనుకుంటారా..
రక్షిత: శత్రువులను అంత ఈజీగా వదిలేయకూడదు. కచ్చితంగా శత్రుశేషం లేకుండా చేయడమే నా టార్గెట్. అప్పటి వరకు నేను రిలాక్స్ అవ్వలేను.
లక్ష్మి: దుర్గకి ఫోన్ చేసి.. రక్షిత అమ్మగారు ఎవరికో పిలిచి భవ్య అనే అమ్మాయి గురించి 24 గంటల్లో కనుక్కోమన్నారు.
దుర్గ: అవునా నేను చూసుకుంటానులే.. నేను మధుసూదన్ అనుకున్నట్లు భవ్య రక్షిత లేదా.. మరి రెండేళ్లుగా భవ్య ఎక్కడ ఉంది. నాన్న ఇన్నిరోజులు భవ్యని రక్షిత దాచిపెట్టింది అనుకున్నాను. మధుసూదన్ బాబాయ్‌ని చూడగానే ఆ రక్షిత భవ్య సేఫ్‌గా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది అని ఆమెని ఫాలో అయితే భవ్య ఎక్కడుందో తెలిస్తుంది అనుకున్నా కానీ ఇప్పుడు నా ఆలోచన తప్పు అయింది. భవ్య రక్షిత దగ్గర లేదు నాన్న. భవ్య ఎక్కడుందో రక్షితకు కూడా తెలీదు.
దుర్గతండ్రి: శత్రువు మన కంటే ఒక అడుగు ముందు ఉన్నప్పుడు మనం ఇంకాస్త తెలివిగా ఆలోచించాలి. మనవాళ్లని పంపించి భవ్యని వెతకమని చెప్పు.
దుర్గ: ఇప్పుడు రక్షిత కంటే ముందు మనకు భవ్య దొరికితే మధుసూదన్ బాబాయ్ మనవైపు ధైర్యంగా నిలబడతాడు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాడు. కానీ మన పేర్లు బయటకు రాకూడదు నాన్న.
దుర్గతండ్రి: అంతవరకు నువ్వేం టెన్షన్ పడకు పవిత్ర విషయంలో నువ్వే గెలుస్తావ్.
రక్షిత: నాలైఫ్‌లోకి దుర్గ ఎప్పుడు అయితే ఎంట్రీ అయిందో అప్పడి నుంచే నాకు మనస్శాంతి లేకుండా పోయింది. దుర్గ ఉన్న ప్రతీచోట మనకు ప్రమాదం ఉందనేభయం వెంటాడు తుంది. ఎప్పుడు ఏ చిన్న విషయం నా దగ్గర దాచని ధీరు నా దగ్గర దాస్తున్నాడు. నేను వద్దన్న పనులే చేస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే ధీరుని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు.
పురు: నవ్వుతూ.. నీ భయం నాకు అర్థమైంది రక్షిత. నీకో విషయం చెప్పనా నీ భయం అంతా దుర్గ మన శత్రువనో ధీరుని ఏదో చేస్తుందనో కాదు అసూయ. ఇన్నేళ్లు నువ్వు గీసిన గీత దాటని నీ కొడుకు దుర్గ మాట వింటున్నాడు అని అసూయ.
రక్షిత: ఎవరో మన మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ పవిత్ర కోసం దాని ఫ్యామిలీ కోసం మన మీద పగపట్టింది ఎవరు అని తెలుసుకోవాలి. అంతా ఎవరో కావాలని చేస్తున్నారు. మనల్ని పక్కా లాక్ చేయాలి అని ప్రయత్నిస్తున్నారు.
దుర్గ: పవిత్రకు న్యాయం చేయాలి అని ఇన్ని రోజులు పక్కా ప్లాన్‌తో పనిచేస్తున్నాను. కానీ ఇప్పుడు భవ్య రక్షితకు దొరికితే ఇంకా ఎప్పటికీ పవిత్రకు న్యాయం జరగదు. ఎలా అయినా భవ్య ముందు నాకు దొరకాలి. ఇంతలో ఎవరో దుర్గకు కాల్ చేసి భవ్య గురించి తెలిసిందని లొకేషన్ పెడతారు. మరోవైపు విజయేంద్ర వైష్ణవి కోసం ఎంక్వైరీ చేస్తుంటారు. విజయేంద్ర వైష్ణవి స్కెచ్ గీయిస్తాడు. అది ఎగిరి దుర్గ కారు మీద పడుతుంది. విజయేంద్రను దుర్గ చూస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.