Satyabhama Today Episode నిశ్చితార్థంలో క్రిష్ చేసిన రచ్చకు సత్య కూడా కారణమని శాంతమ్మ సత్యను నిందిస్తుంది. ఇష్టమొచ్చినట్లు తిరిగిందని.. కళ్లు కప్పి నాటకాలు ఆడిందని తిడుతుంది. విశాలాక్షి కలుగజేసుకొని జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి వదిలేయండి అని చెప్తుంది. దీంతో శాంతమ్మ అందరికి విషయం తెలిసిపోతుందని తలెత్తుకొని బయట ఎలా తిరుగుతామని ప్రశ్నిస్తుంది. 


విశాలాక్షి: శేఖర్ అన్నయ్య అర్థం చేసుకున్నారు. జరిగిన దాంట్లో సత్య ప్రమేయం ఏం లేదు అని చెప్పారు. మాధవ్ ఇష్టపడి నిశ్చితార్థం చేసుకున్నాడు. బయట వాళ్లే అర్థం చేసుకున్నది మనం మన ఇంటి పిల్లని తప్పు పట్టడం ఏంటి అత్తయ్య. 
హర్ష: అవును అమ్మ నువ్వు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. సంతోష పడాల్సిన సమయంలో మనమే రచ్చ చేసుకుంటున్నామ్.. దీని గురించి ఇక నువ్వు మాట్లాడొద్దు నానమ్మ.
శాంతమ్మ: ఆ మాట నువ్వుకాదురా మీ నాన్నకి చెప్పమను నోరు మూసుకొని లోపలికి వెళ్లిపోతా.. 
సంధ్య: నానమ్మకి చెప్పండి నాన్న ఎంగేజ్‌మెంట్ అయిన ఆనందం అయినా అక్కకు లేకుండా చేస్తున్నారు. కన్నీళ్లతో తలవంచుకొని దోషిలా ఎలా నిలబడిందో చూడండి కొద్దిగా కూడా జాలి అనిపించడం లేదా.. 
సత్య: ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను నానమ్మ ఇంతలా నిలదీస్తున్నావ్.
శాంతమ్మ: మీ నాన్నని అడుగు చెప్తాడు.
సత్య: నాన్న.. లోకం అంతా నన్ను దోషి అన్నానేను పట్టించుకోను. మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నా సత్య బంగారం అని ఒక్కమాట మీరు అంటే చాలు.
విశాలాక్షి: సత్య మాటలు వింటున్నారు కదా తన బాధ అర్థమవుతుంది కదా..మనం చెప్పామని మన కోసమే రాజీపడి సత్య పెళ్లికి ఒప్పుకుంది. ఎవడో ఏదో అన్నాడుఅని  దాని మనసు గాయపడేలా చేయడం ఏమైనా బాగుందా..
విశ్వనాథం: తప్పు చేశావ్ అమ్మా.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సత్య షాక్ అయిపోయి ఏడుస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు క్రిష్ జరిగింది అంతా తలచుకొని తాగుతూ ఏడుస్తాడు. 


బాబీ: ఏంటన్నా ఇది వదిన ఏంటి నిన్ను కొట్టడం ఏంటి.. నేను అస్సలు నమ్మలేకపోతున్నా అన్నా. వదిన కూడా అందరి ఆడవాళ్ల లానే ఇలా మారిపోతుంది అని నేను అస్సలు అనుకోలేదు అన్న. నిన్ను సిన్సియర్‌గా ప్రేమించింది అనుకున్నా ఇలా అమెరికా సంబంధం రాగానే మాట మార్చేస్తుంది అనుకోలేదు. నిన్ను అందరి ముందు పిచ్చోడిని చేసింది. ఇంత మోసం చేసిన తర్వాత కూడా వదిలేస్తే నిన్ను చేతకాని వాడిలా చూస్తారు అన్నా. తనని ఏదో ఒకటి చేయాలి. తనని మాత్రమే కాదు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఏదో ఒకటి చేయాలి. అప్పుడు కానీ నీ విషయంలో ఎంత తప్పు చేశారో వాళ్లకి అప్పుడు అర్థం అవుతుంది. ఆ ఫ్యామిలీని రోడ్డుకు లాగేయాలి. 


సత్య: ఏమైంది నాన్న నా మీద కోపమా.. అసహ్యమా.. నా ముఖం కూడా చూడాలి అనిపించడం లేదా.. నాతో మాట్లాడండి నాన్న.. నేనేం పాపం చేశాను.. కోపంగా ఉంటే చెంప పగలగొట్టండి.. తప్పు చేశాను అనిపిస్తే నన్ను చావగొట్టండి అంతే కానీ నా వైపు చూడకుండా నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెట్టకండి నాన్న. నన్ను ఇలా వెలివేయకండి నేను తట్టుకోలేను. ఏంటి నాన్న ఇంకా నామీద అనుమానమా.. నోరు తెరచి చెప్పండి నాన్న. నాన్న మీరు అంటే నాకు ప్రాణం. కలలో కూడా నేను మీ మాటను జవదాటను. మీరు ఏం చెప్పనా నేను కాదు అనను. నా ప్రాణం తీసుకుంటే మా నాన్న నా మాట నమ్ముతాడు అంటే అందుకు నేను సిద్ధం నాన్న.


విశ్వనాథం: అమ్మా సత్య.. కన్నకూతుర్ని కూడా నమ్మనంత కసాయి వాడు కాదు అమ్మా మీ నాన్న. నా కూతురులో ఈ తండ్రి తాలూకు నిజాయితీ ఉంది. నిన్ను నేను అనుమానించడం అంటే నన్ను నేను అమనుమానించుకోవడమే. నిన్ను అసహ్యంగా చూడటం కాదమ్మా.. నీ కళ్లలో ఉన్న బాధ చూడలేక నా చూపు దాచుకున్నానమ్మా.. జరిగింది ఈ నాన్నకి అప్పుడే చెప్పకపోవడం నువ్వు చేసిన తప్పు. వాడు ఎవడో నీ వెంట పడటం నీ సమస్య అనుకున్నావ్ కానీ అది మన సమస్య అని ఇప్పటికైనా తెలిసిందా అమ్మ. నీకు అర్థమవుతుందా  సత్య.. సత్య తండ్రిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. 


సునంద: మాధవ్ రింగ్ చూస్తూ.. నీ వెలికి ఉన్న నిశ్చితార్థం రింగ్ తీసేస్తావా.. సీరియస్‌గా అడుతున్నాను.
మాధవ్: వాట్ మామ్.. కోపం ఎవరిమీద..
సునంద: నాది కోపం కాదురా స్వార్థం. 
శేఖర్: నువ్వు ఇలా మాట్లాడటం మొదటి సారి సునంద.
సునంద: ఇలాంటి సమస్య ఎదురుకావడం కూడా మొదటిసారే అండి. వెంటనే కాల్ చేసి విశ్వనాథం అన్నయ్యతో మాట్లాడండి. తప్పని పరిస్థితుల్లో సంబంధం విషయంలో వెనక్కి తరుగుతున్నాం అని చెప్పండి.
మాధవ్: అంత సింపుల్‌గా ఎలా అనేస్తావ్ అమ్మా.. సత్య విషయంలో నీ అభ్యంతరం ఏంటి.
సునంద: నా అభ్యంతరం సత్య విషయంలోకాదు సత్య వెంట పడుతున్న ఆ రౌడీ విషయంలో. ఇలా ఎన్నిరోజులు అని ఒకర్ని ఒకరు కాపలా కాసుకొని ఉంటారు.
శేఖర్: పెళ్లి వరకే కదా మనం ఇక్కడ ఉండేది తర్వాత అమెరికా వెళ్లిపోతాం కదా.
సునంద: అదేమైనా తక్కువ సమయమా.. ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి.
శేఖర్: ఓపెన్‌గా నీ అభిప్రాయం చెప్పు వాడు సత్య మీద నిందలు వేశాడనా..
మాధవ్: అమ్మా రేపు ఎవరో ఒక అమ్మాయి వచ్చి నా గురించి బ్యాడ్‌గా మాట్లాడితే నమ్మేస్తావా..
సునంద: ఎలా నమ్ముతాను నిందలు వేసినందుకు చెంప పగలగొడతాను.
మాధవ్: ఇప్పుడు సత్య చేసింది అదే వాడి చెంప పగలగొట్టింది. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయినట్లే అని నువ్వే చెప్పావు కదా.. ఇప్పుడు మనం బ్రేక్ చేసుకుంటే సత్య పరిస్థితి ఏంటి. 
సునంద: నేను కేవలం నీ గురించే ఆలోచిస్తా.. 
మాధవ్: నా జీవితంలో సత్యకు తప్ప వేరే అమ్మాయికి చోటు లేదు. సత్య మంచి అమ్మాయి. నీ అర్థం లేని మాటల వల్ల సత్యని దూరం చేసుకుంటే ఒకవిధంగా నా జీవితంలో సంతోషాన్ని దూరం చేసుకున్నట్లే అని మాధవ్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్ ఫిబ్రవరి 6th: మేఘన మెడలో తాళి కట్టేవరకు తనతోనే ఉండమని పంచమికి కండీషన్ పెట్టిన మోక్ష!