Guppedantha Manasu February 6th Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 6 ఎపిసోడ్)
ఓ డెడ్ బాడీ దొరికింది..గుర్తించేందుకు రమ్మని చెప్పి మహేంద్రని తీసుకెళ్తాడు ముకుల్. మరోవైపు దేవయాని-శైలేంద్ర సంతోషిస్తారు. ఫణీంద్ర మాత్రం టెన్షన్ పడతాడు. ఇంతలో ఇంటికి వచ్చిన మహేంద్రని అడుగుతారు వసుధార, అనుపమ. అది రిషి సర్ డెడ్ బాడీ కాదని చెప్పండి మావయ్యా అని వసు అంటే కరెక్టేనమ్మా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకు మీరు అబద్ధం చెబుతున్నారని వసుధార అంటుంది. ఇది నిజమే అని చెబుతాడు మహేంద్ర...అది నా రిషి డెడ్‌బాడీనే, రిషి మనకు ఇక లేడని కన్నీళ్లతో కుప్పకూలిపోతాడు. అయినా రిషి క్షేమంగానే ఉన్నాడని వాదిస్తుంది వసుధార. అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన ఫణీంద్ర ని చూసి మహేంద్ర మరింత ఏమోషనల్ అవుతాడు. ఆ మాట వినగానే దేవయాని, శైలేంద్ర ఆనందం ఆపుకోలేకపోతారు. నిజాన్ని నేనే కళ్లతో చూస్తానని, హాస్పిటల్ వెళ్దామని ముకుల్‌తో అంటుంది వసుధార. మహేంద్ర వద్దని చెప్పినా వసుధార వినదు.
Also Read: మరో 12 ఎపిసోడ్స్ తో గుప్పెడంత మనసు కి శుభం కార్డ్ - కార్తీకదీపం లానే చేస్తారా!
శైలేంద్ర: రిషి చనిపోయాడనే నిజాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావని అర్థమవుతోంది. టెస్టుల్లో అది రిషిదే అని తేలిందని చెబుతున్నారు కదా
వసు: కోపంగా శైలేంద్ర కాలర్ పట్టుకున్న వసుధార..టెస్టులది ఏముంది. నీలాంటి వెధవ ఎవడైనా మారుస్తాడు అని ఆన్సర్ ఇస్తుంది. నువ్వే రిపోర్ట్స్ మార్చావు కదా. నిజం చెప్పు అని నిలదీస్తుంది.
దేవయాని:శైలేంద్రకు రిపోర్ట్స్ మార్చాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు
వసు: వీడు ఎక్కడ ఉండైనా అక్రమాలు చేయగలడు
దేవయాని: పిచ్చిపిచ్చిగా మాట్లాడకు . నా కొడుకు అమాయకుడు. అన్నింటికి వాడిపై పడితే..వాడు ఊరుకున్నా నేను ఊరుకోను
వసు: నేరాలు చేసేది మీరే కాబట్టి మీపై నిందలు వేస్తున్నాను
దేవయాని: రిషి చనిపోయిన నిజాన్ని తట్టుకోలేక వసుధార మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యింది ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది
దేవయానిపై ఫైర్ అయిన వసుధారని కంట్రోల్ చేస్తుంది అనుపమ.
ముకుల్: మీరు నమ్మినా నమ్మకపోయినా రిషి చనిపోయాడన్నది నిజం
అది అబద్ధం అందుకు నా ఊపిరే సాక్ష్యం. రిషి ఎక్కడున్నా నేను వెతికి మీ ముందుకు తీసుకొస్తానని వసుధార కోపంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కూతురిని ఆపడానికి చక్రపాణి ప్రయత్నిస్తాడు. ఇంతలోనే రిషి చనిపోయాడనే నిజాన్ని తట్టుకోలేక ఫణీంద్ర గుండెనొప్పితో కుప్పకూలిపోతాడు.
Also Read: ఈ రాశివారు ఏ విషయంలోనూ రాజీపడేందుకు ఇష్టపడరు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు
ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వసుధార ఓ చోట కూర్చుంటుంది. లోకమంతా ఏకమైనా, దేవుడే దిగి వచ్చినా రిషి చనిపోయాడంటే నమ్మకూడదని ఫిక్సవుతుంది. అక్కడ రాజీవ్ ప్రత్యక్షమవుతాడు. మళ్లీ ఇన్నాళ్లకు నిన్ను చూసే అదృష్టం దక్కింది మై డియర్ మరదలు పిల్లా అంటూ టార్చర్ మొదలెడతాడు.
వసుధార: మళ్లీ ఎందుకొచ్చావ్, ఎందుకు నా వెంట పడుతున్నావ్
రాజీవ్: కష్టంలో ఉన్నావని అర్థమైంది, ప్రేమ, ఆప్యాయతతో నిన్ను పలకరిద్దామని వచ్చాను. రిషి చనిపోయాడంట కదా...బంగారం లాంటి మనిషి అని
వసు: రిషి చనిపోలేదు. బతికే ఉన్నారు
రాజీవ్: నువ్వు తోడు లేని ఒంటరిదానివి...నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి . నీ గుండెల్లో బాధ తీరిపోయేవరకు కన్నీళ్లు పెట్టుకో. కానీ ఒంటరిగా ఉండాలని మాత్రం అనుకోకు. నీకు తోడుగా నేనుంటాను. నువ్వు ఓకే అంటే నీ మెడలో తాళి కడతా అంటూ తాళిబొట్టు తీసి చూపిస్తాడు
వసు: నువ్వు మనిషివేనా ఎదుటివాళ్ల పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావ్ . ఇంకోసారి ప్రేమ, గీమా అంటూ నా వెంట పడకు వసు చేయి పట్టుకున్న రాజీవ్ చెంప పగలగొడుతుంది...అది పట్టించుకోకుండా వసుధారని లాక్కెళుతుంటాడు.. ఇంతలో కారులోంచి దిగిన ఓ వ్యక్తి రాజీవ్ ను ఆపుతాడు...తను ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్....
ఎపిసోడ్ ముగిసింది...