Horoscope Today 6th February 2024  - ఫిబ్రవరి 6 రాశిఫలాలు


మేష రాశి (Aries Horoscope Today) 


ఏ విషయంలోనూ రాజీపడేందుకు ఇష్టపడరు. స్వేచ్ఛగా ఫీలవుతారు. మనసు కొంచెం చంచలం అనిపిస్తుంది.కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. నూతన అవకాశాల కోసం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచి రోజు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.


వృషభ రాశి (Taurus  Horoscope Today)


వైవాహిక జీవితంలో మీ సమస్యల పరిష్కారానికి ఈ రోజు మంచి రోజు. నటీనటులు , సంగీతకారులతో సహా కళాకారులు వారి వృత్తిపరమైన వృద్ధిని పొందుతారు. ఉద్యోగులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం అందుతుంది. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. 


మిథున రాశి (Gemini Horoscope Today) 


ప్రేమలో ఉన్నవారికి శుభదినం. మీ ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉందని మీరు విశ్వసించాలి.  డిజైనర్లు, కాపీ రైటర్లు, చెఫ్‌లు, సివిల్ ఇంజనీర్లు, మెకానిక్స్, ఆటోమొబైల్ నిపుణులు, విద్యావేత్తలకు శుభదినం. డబ్బు విషయంలో ఈ రోజు మీ పరిస్థితి బాగా లేదు.  పెద్ద పెట్టుబడులను ఆపేయడం మంచిది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి ఫలితాలను పొందలేరు.


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  


మీ మేధో సామర్థ్యం అధిక స్థాయిలో ఉంటుంది...క్లిష్టమైన పనులను కూడా సులభంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగులు తమకు ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. సహోద్యోగులు, సీనియర్ ఉద్యోగుల దగ్గర మీ గౌరవాన్ని పెంచుకుంటారు. కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు ఇదే మంచి సమయం. వైవాహిక జీవితంలో సంతోషం నింపేందుకు ప్రయత్నించాలి. 


Also Read: ఈ ఏడు వ్యసనాల్లో ఒక్కటున్నా చాలు ఇక అంతే!


సింహ రాశి (Leo Horoscope Today)


ఈ రోజు మీ ఆలోచనలకు పదునుపెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. మీరు దూరదృష్టి గల వ్యక్తి అనిపించుకుంటారు..ఆ లక్షణాలు ఈ రోజు మరింత మెరుగుపడతాయి. మీరు వెళ్లే మార్గంలో ఏవైనా అడ్డంకులు ఎదురైనా అధిగమించగలరు. నిజాయితీగా వ్యవహరించాలి. కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టేందుకు ముందుకు సాగండి. అనుకున్న పనులు పూర్తిచేసిన తర్వాతే కొత్త పనులు ప్రారంభించడం మంచిది.


కన్యా రాశి  (Virgo Horoscope Today) 


ఈ రోజు ఆర్థికంగా మంచిరోజు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మొత్తం చేతికందుతుంది. ఏఏ ఖర్చులు తగ్గించుకోవచ్చో  మీ తెలివితేటలు ఉపయోగించి గుర్తించండి. గ్రహాలు మీకు అనూకల దిశలో ఉన్నాయి..ఇలాంటి టైమ్ లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. వ్యాయామం చేయాలి..ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.


Also Read: కుజుడి ప్రభావంతో 40 రోజుల పాటూ ఈ రాశులవారికి మానసిక ఆందోళన, సమస్యలు!


తులా రాశి (Libra Horoscope Today) 


ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఈ రోజు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు వృత్తిపరంగా బావుంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి.  మీ కేరింగ్ యాటిట్యూడ్  ప్లస్ పాయింట్ అవుతుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 


ఈ రోజు మీ మనస్సును కుదురుగా ఉంచుకోవాలి. ఆలోచనల్లో దూరదృష్టి మీకు మంచి విజయాలను అందిస్తుంది. వెళ్లే మార్గంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఆ అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తారు. మీరు నిజాయితీగా వ్యవహరించినప్పుడు మీ సక్సెస్ ను ఎవ్వరూ అడ్డుకోలేరు. కొత్త ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మీరు నమ్మండి. 


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 


ఈ రోజంతా రకరకాల బాధ్యతలలో బిజీగా ఉంటారు. కార్యాలయంలో మీ సలహాలు, అభిప్రాయాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ కి సంబంధించిన చర్చలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు ద్వితీయార్థం కలిసొస్తుంది. పెద్ద ఆర్థిక సమస్యలు ఉండవు . మీ కలలను నెరవేర్చుకోవడానికి కష్టపడి ప్రయత్నించాలి. 


Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం


మకర రాశి (Capricorn Horoscope Today) 


వాహనం కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఇంటికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలుంటాయి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేసేందుకు మంచి రోజు. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మరోసారి ఆలోచించాలి. 


కుంభ రాశి  (Aquarius Horoscope Today) 


పాత సంబంధాలు మళ్లీ ప్రారంభం అవుతాయి. వ్యాపారంలో సవాళ్లు ఉన్నప్పటికీ లాభాలుంటాయి. న్యాయవాదులు ముఖ్యమైన కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు  సానుకూల ఫలితాలు పొందుతారు.  


Also Read: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే!


మీన రాశి (Pisces Horoscope Today) 


మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అనుకున్న పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ప్రేమ జీవితంలో సమస్యలను పరిష్కరించుకోండి. ఆర్థికంగా  బాగానే ఉంటారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు..ఈ రోజు కొత్త ఒప్పందాలపై సంతకం చేస్తారు. గతం పెట్టుబడులు ఇప్పుడు లాభాలనిస్తాయి.