Mars Transit In Capricorn 2024: గ్రహాలు రాశులు మారిన ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి శుభఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. డిసెంబరు 27 నుంచి ధనస్సు రాశిలో సంచరిస్తున్న కుజుడు...ఫిబ్రవరి 5 నుంచి రాశిమారుతున్నాడు. మకర రాశిలో ప్రవేశించి మార్చి 15 వరకూ ఇదే రాశిలో ఉంచాడు. అనంతరం కుంభరాశిలోకి అడుగుపెడతాడు. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది.  ఈ రాశిలవారికి మాత్రం ప్రతికూల ఫలితాలున్నాయి...


Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం


మిథున రాశి 


మకర రాశిలో కుజుడి సంచారం మిథున రాశివారికి అస్సలు బాలేదు. ఈ సమయంలో కెరీర్లో సవాళ్లు తప్పవు. వృత్తిపరమైన లక్ష్యాలు నేరవేరవు. ఆదాయం సరిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు. జీవిత భాగస్వామితో వివాద సూచనలున్నాయి. కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితం పొందుతారు. చట్టపరమైన చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడతారు. 


కర్కాటక రాశి


కుజుడి సంచారం సమయంలో కర్కాటక రాశి వారు భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. మీ కృషి , సంకల్పం  మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడతాయి. కార్యాలయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆవేశంలో తీసుకునే నిర్ణాయాలు మీ కెరీర్ వృద్ధికి సహకరించవు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. 


Also Read: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే!


సింహ రాశి


మీలో ఉండే నిజాయితీ వృత్తిపరమైన ఎదుగుదలకు సహకరిస్తుంది. ఉన్నతాధికారులు మీ ప్రయత్నాలను గుర్తిస్తారు. సృజనాత్మక ఆలోచనలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక భద్రతకోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే మంచి సమయం. మీ సంభాషణలు ఆకట్టుకునేలా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మకరరాశిలో కుజుడి సంచారం మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది.   


కన్యా రాశి 


ఒకేసారి మీరు వివిధ రకాల ప్రాజెక్టులను చేపడతారు. అన్నింటినీ పట్టుదలతో పూర్తిచేయాలి అనుకుంటారు. మకర రాశిలో కుజుడు సంచరించే సమయం మీకు అంత అనకూల ఫలితాలను ఇవ్వడం లేదు. చేయాలనుకున్న పనిలో అడ్డంకులు ఎదురవడంతో మీరు కొంత నిరాశ చెందుతారు. కోపం కారణంగా సహోద్యోగులతో అనవసర వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామంపై దృష్టి సారించడం మంచిది.   


Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!


మకర రాశి


కుజుడి సంచారం మీ రాశిలోనే ఉంటుంది. ఫలితంగా మీ స్వభావం చాలా దూకుడుగా ఉంటుంది. భవిష్యత్ గురించి ఆశగా ఉండండి కానీ ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోకుండా ఉండడమే మంచిది. కఠినమైన ప్రయత్నాల ద్వారా మాత్రమే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవగలుగుతారు. కెరీర్ కి సంబంధించిన సమస్యలుంటాయి కానీ వాటిని అధిగమించే సత్తా మీకుంటుంది. మీ ఆర్థిక స్థితి క్రమంగా  మెరుగుపడుతుంది. 


కుంభ రాశి


ఈ రాశివారు చాలా కాలం తర్వాత పాతస్నేహితులను కలుస్తారు. మీ పరిచయాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు.ఆ మార్పు మంచిదా కాదా అన్నది పూర్తిగా మీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు.  ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వ్యక్తిగత సంబంధాల మధ్య అపార్థాలు ఏర్పడతాయి..మాట తూలకండి. 


Also Read:  ఈ రాశులవారికి నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఫిబ్రవరి 1 రాశిఫలాలు


గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.