Oorvasivo Rakshasivo Today Episode: విజయేంద్ర వైష్ణవి ఇంటికి వచ్చి ఇళ్లంతా చూసి ఏడుస్తాడు. ఆ ఇంట్లో వైష్ణవి ఫొటోలు చూసి చాలా బాధపడతాడు. ఎటు చూసినా నువ్వే గుర్తొస్తున్నావ్ వైష్ణవి అని అనుకుంటాడు. నీ కుటుంబానికి ఇలా జరిగింది అని అందరూ చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను అని ఏడుస్తాడు. 


విజయేంద్ర: నో ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను. నీకు ఏం కాదు వైష్ణవి. నువ్వే ఇక్కడే ఎక్కడో ఉన్నావ్. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఒకవేళ నేను లేనప్పుడు నీకు ఏమైనా అన్యాయం జరిగి ఉంటే.. అది ఎవరు చేశారో నేను కచ్చితంగా కనుక్కుంటాను. నేను వచ్చాను వైష్ణవి తొందర లోనే నిన్ను చేరకుంటాను. 
దుర్గ: తనలో తాను.. ఈరోజుతో మధుసూదన్ బాబాయ్ కళ్లలో వెలుగు వస్తుంది. నీ జీవితంలో చీకటి మొదలవుతుంది. మధుసూదన్ బాబాయ్ కళ్లు తెరిచే సరికి నిన్ను అతని ఎదురుగా నిల్చొపెడతా. 
ధీరేంద్ర: తన తల్లి (ప్రగతి) దుర్గను కలవొద్దు అన్న మాటలు తలచుకొని.. అమ్మ భయం చూస్తుంటే నా బ్రైన్‌లో కూడా నెగిటివ్ ఆలోచనలే వస్తున్నాయి. ఎందుకైనా మంచిది నేను అమ్మ చెప్పినట్లు చేస్తే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ మధుసూదన్ కంట పడకూడదు. 
దుర్గ: ఏం చేస్తున్నావ్ ధీరు అంటూ.. కాల్ చేస్తుంది. ఈ రోజు మధు సూధన్ బాబాయ్‌కి చూపు వస్తుంది. బాబాయ్ ప్రపంచాన్ని చూడబోతున్నారు. దానికి కారణం నువ్వే ధీరు. 
ధీరు: మనసులో.. ఒకవేళ వాడే నా కేసులో సాక్ష్యం అని తెలిసి ఉంటే అసలు ఈ ఆపరేషన్ చేయించే వాడినే కాదు. పైగా వాడిని మా అమ్మకి అప్పగించేవాడిని. 
దుర్గ: ధీరు ఎక్కడున్నావ్.. బాబాయ్ కళ్లకు కట్లు విప్పతారు. హాస్పిటల్‌కి రావా..
ధీరు: దుర్గా ఈ రోజు నాకు చాలా పనులు ఉన్నాయ్. ఏమీ అనుకోవద్దు. 
దుర్గ: అయితే పోస్ట్ పోన్ చేసుకో నా కంటే అవి ఎక్కువా నీకు.. బాబాయ్‌కి కంటి చూపు ప్రసాదించిన దేవుడు నువ్వే అని మొదట నిన్నే చూడాలి అని బాబాయ్ అనుకుంటున్నారు. నువ్వు రాకపోతే కట్లు కూడా విప్పించుకోను అంటున్నారు. నా కోసం ఏమైనా చేస్తా అంటావ్ కదా ఒక పది నిమిషాలు రాలేవా.. 
ధీరు: సరే దుర్గా వస్తా.. 
దుర్గ: హాస్పిటల్‌కి వచ్చిన ధీరుతో.. ఏమైంది టెన్షన్‌గా ఉన్నావ్.. నీ టెన్షన్ నీ ముఖంలో తెలిసిపోతుంది. ఆ టెన్షన్‌కి కారణం కూడా నాకు తెలుసు.
ధీరు: తెలుసా నీకు ఎలా తెలుసు.
దుర్గ: బాబాయ్ కంటికి కట్లు విప్పుతున్నావ్ కదా దాని గురించే కదా..
ధీరు: మనసులో.. నీకు అలా అర్థమైందా.. 


మధుసూదన్‌కి కట్లు విప్పుతున్నారని నర్స్ దుర్గా వాళ్లని పిలుస్తుంది. ఇద్దరూ లోపలికి వెళ్తుంది. ఇక దుర్గు బాబాయ్ నీకు ఆపరేషన్ చేసిన అతను వచ్చారు అని అంటుంది.
మధుసూదన్: థ్యాంక్స్ బాబు నాకోసం మీ పనులు అన్నీ మానుకొని వచ్చారు. 
దుర్గ: కళ్లు తెరవగానే ఆయన్నే చూస్తాను అన్నావ్ కదా అందుకే అన్ని పనులు ఆపేసి మీ కోసం వచ్చారు. ధీరు బాబాయ్ కళ్లు తెరవగానే నువ్వు కనపడాలి కదా ఎదురుగా నిలబడు. ధీరు ఏమైంది ఎందుకు చమటలు పడుతున్నావ్.. 


మధుసూదన్ కళ్లు తెరచి ధీరుని చూస్తాడు. వైష్ణవికి ధీరు చేసిన అన్యాయం గుర్తు చేసుకుంటాడు. నువ్వా నాకు ఆపరేషన్ చేయించింది నువ్వా అని అడుగుతాడు. దుర్గ కావాలి అనే బాబాయ్ ఈయన నీకు తెలుసా అని అడుగుతుంది. దీంతో మధుసూదన్ తెలుసమ్మా అంటాడు. 


మధుసూదన్: కళ్లు రాకముందు ఏ మహానుభావుడు నాకు ఆపరేషన్ చేయిస్తున్నాడో అతన్ని చూద్దాం అనుకున్నాను. కానీ వీడు దేవుడు కాదమ్మా.. నరరూప రాక్షసుడు. ఆపపిల్లల జీవితాలతో ఆడుకునే రాక్షసుడు. 
దుర్గ: బాబాయ్ నువ్వు ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నావో.. అసలు ఈయన ఎవరో తెలుసా..
మధుసూదన్: వీడే కాదు అమ్మ వీడి ఇంట్లో అందరూ దుర్మార్గులే.. నా కళ్లు పోవడానికి కారణం కూడా వీళ్లే అమ్మ.
దుర్గ: ధీరు ఈయన చెప్పేది నిజమేనా.. 
ధీరు: లేదు దుర్గా ఈయన అబద్ధం చెప్తున్నారు. 
మధుసూదన్: ఎవర్రా అబద్ధం చెప్పేది నిన్ను చంపేస్తా.. అమ్మా దుర్గా వీడిని నమ్మకు. పాపం ఆ అమ్మాయిని వీడు వీడి ఫ్రెండ్స్ కలిసి దారుణంగా రేప్ చేసి చంపేశారు అమ్మ. న్యాయం కోసం పోరాడిన పవిత్ర అక్కని చంపేశారు. అందుకే పవిత్ర అమ్మానాన్న ఆత్మహత్య చేసుకున్నారు. నా దగ్గర ఉన్న సాక్ష్యాలతో వీడిని ఉరికంబం ఎక్కించాలి అమ్మ. 
దుర్గ: ఇన్ని రోజులు నువ్వు మంచి వాడివి అనుకున్నా అమ్మా నువ్వు ఎంత దుర్మార్గుడివో తెలిశాక నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తా.. అని దుర్గ అన్నట్లు ధీరు కలకంటాడు. ఇక నిజంగా లోపలికి వెళ్తారు. మధుసూదన్‌కి దుర్గ పరిచయం చేస్తుంది. 


మధుసూదన్‌కి డాక్టర్‌ కట్లు విప్పుతారు. మధుసూదన్ తనకి కళ్లు కనిపించడం లేదని చెప్తాడు. దుర్గ ఏడుస్తుంది. ధీరు ధైర్యం చెప్తాడు. మరోసారి ట్రై చేసి చూపు వచ్చేలా చేయమని చెప్తాడు. మరోవైపు ధీరు హాస్పిటల్‌కి వెళ్లాడని రక్షిత తన భర్త మీద సీరియస్ అవుతుంది. ఇంతలో ధీరు బొకే తీసుకొని ఇంటికి వస్తాడు. మధుసూధన్‌కి చూపు రాలేదు అని చెప్తాడు. అక్కడికి నేను వద్దంటే ఎందుకు వెళ్లావని తిడుతుంది. ఇక డాక్టర్ ఆపరేషన్ సక్సెస్‌ అయిందని చెప్పారని.. మధుసూదన్ కనిపించడం లేదు అంటున్నాడు అంటే ఏదో తేడా జరిగింది అని రక్షిత అంటుంది. దానికి పురు మధుసూదన్ చూపు వచ్చే రాలేదు అంటున్నాడా అని అడుగుతాడు. రక్షిత మధునాటకం ఆడుతున్నాడేమో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 



Also Read: హీరోల ఇమేజ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తే అంతే - 'గుంటూరు కారం'పై ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్