Seethe Ramudi Katnam Today Episode మనసులో తన గురించి ఆలోచిస్తున్నావ్ అని.. ఏం ఆలోచిస్తున్నావో చెప్పు అని సీత రామ్‌ని అడుగుతుంది. నీ గురించి నేను ఆలోచించడం లేదు అని రామ్ అంటాడు. దానికి సీత మరెందుకు టెన్షన్ పడుతున్నావు. నీ ముఖంలో తెలిసిపోతుంది అని అంటుంది. దానికి రామ్ నేను కంగారు పడుతున్నా అని నా ముఖంలో రాసుందా అని సీత ప్రశ్నిస్తాడు. ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుంది అని సీత సమాధానం ఇస్తుంది. తనకు నిద్ర వస్తుందని పాలు తీసుకురమ్మని రామ్ సీతతో చెప్పాడు. దానికి సీత పాలు తాగాకా మురిపాలు ఏమైనా ఉంటాయా అని చిలిపిగా రామ్‌ని ప్రశ్నిస్తుంది. దానికి రామ్ ముహూర్తం పెట్టేవరకు అలాంటివి ఏం వద్దు అని అంటాడు. 


రామ్: మధ్యాహ్నం కూడా ఇలాగే ముద్దు ముద్ద అన్నావ్. దాని తర్వాత పెద్ద గొడవ అయింది. 
సీత: ఓహో సెంటిమెంటా..


రామ్: అమ్మా తల్లి నీకు దండం పెడతా ప్రతీ సారి మా పిన్నిని బ్యాడ్ చేయాలి అని చూడకు. 


సీత: ఆవిడ గుడ్ అయితే నేను బ్యాడ్ ఎందుకు చేస్తాను. ఇక సీత పాలు తీసుకురావడానికి కిచెన్‌కు వెళ్తుంది. వెండి గ్లాస్‌లో రామ్‌ కోసం, గాజు గ్లాస్‌లో తన కోసం పాలు రెడీ చేస్తుంది. ఉష, ప్రీతిలు సీత తాగే పాలలో నిద్ర మాత్రలు కలపడానికి వస్తారు. ప్రీతి సీతని పిలుస్తుంది. 
సీత: ఏంటి.. టీవి రిమోట్ కనిపించడం లేదు. నిన్న నైట్ మేము హర్రర్ మూవీ చూస్తుంటే వద్దు అన్నావు. మళ్లీ మేం టీవీ చూడకూడదు అని రిమోట్ దాచేయ్ లేదు కదా.. మరోవైపు సీత పాలలో ఉష నిద్ర మాత్రలు కలుపుతుంది. 
ఉష: మాత్రలు కలిపేశా రేపు అంతా అనుకున్నట్లే జరుగుతుంది. 
ప్రీతి: సీతకు మన ప్లాన్ తెలిసిపోయిందా.. తాను తాగాల్సిన పాలు అన్నయ్యకు ఇస్తుంది. 
సీత: ఆగు మామ గ్లాస్‌లు మారిపోయాయి. ఈ వెండి గ్లాస్ నీది ఆ గాజు గ్లాస్‌ నాది. తీసుకో అని నిద్రమాత్రలు కలిపిన పాలు సీత తాగేస్తుంది. సీతకు కూడా నిద్ర వచ్చి పడుకుండిపోతుంది. 


మహాలక్ష్మి: ఏమైంది నేను చెప్పిందిచేశారా..
ప్రీతి: చేశాం పిన్ని. 
మహాలక్ష్మి: రేపు మధ్యాహ్నం వరకు సీత లేవదు. ఉదయం రామ్‌తో సంతకం పెట్టించేస్తా. సీత తలరాత తిరగరాస్తా.. 
రామ్: ఉదయం లేచి.. ఎప్పుడూ నా కంటే ముందే లేచే సీత ఈరోజు ఇంకా పడుకుంది ఏంటి. సీత.. సీత.. నిద్ర పోతున్న సీతను రామ్ ముద్దు పెట్టుకోబోతాడు. ఇంతలో మహాలక్ష్మి, అర్చన అక్కడికి వస్తారు. 
మహాలక్ష్మి: ఏం చేస్తున్నావ్ రామ్..
రామ్: సీత ఎంత నిద్ర లేపినా లేవడం లేదు పిన్ని. 
అర్చన: ఇంటి పనులు వంట పనులు అన్నీ తనే చేస్తుంది కదా రామ్ అలసిపోయి ఉంటుంది. నువ్వు డిస్ట్రబ్ చేయకు.
రామ్: డైలీ తనే ముందు లేచి నాకు బెడ్ కాఫీ ఇచ్చేది ఈరోజు లేవలేదు.
మహాలక్ష్మి: రామ్ కాసేపు పడుకోని ఇప్పుడు లేచి తనేం చేయాలి. నువ్వు వెళ్లి త్వరగా ఫ్రెష్ అయి కిందకి రా రామ్. ఆడిటర్‌, లాయర్ వస్తున్నారు. ఆఫీస్‌కి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. 
రామ్: సరే పిన్ని..
అర్చన: సీతని లేపుతుంది. లేవకపోవడంతో స్లీపింగ్ పిల్స్ బాగా పనిచేస్తున్నాయ్ మహా..
మహాలక్ష్మి:  అయితే ఇక మన పనికి అడ్డు లేదు పద.. 


రేవతి: పొద్దున్నే ఇంటికి లాయర్, ఆడిటర్ వచ్చారు ఏంటి. 
చలపతి: మహాలక్ష్మి మళ్లీ ఏదో ప్లాన్ చేయబోతుంది. 
రేవతి: సీత కోసమా..
చలపతి: మహాలక్ష్మి మొదటి టార్గెట్ సీతే కదా..
రేవతి: సీత ఎక్కడ..
మహాలక్ష్మి: డాక్యుమెంట్స్ అంతా పక్కా రెడీ చేశారు కదా.. రామ్ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం పెట్టాలి రామ్. 
రామ్: అలాగే పిన్ని.. 
చలపతి: అవి ఏం డాక్యుమెంట్స్ వాటి మీద రామ్‌తో ఎందుకు సంతకాలు పెట్టించాలి అనుకుంటున్నారు. సీత ఏంటి ఇంకా కిందకి రాలేదు. 
రేవతి: ఒక్క నిమిషం రామ్.. ఆ డాక్యుమెంట్స్‌లో ఏముందో చూడకుండానే సంతకం పెడుతున్నావ్ ఏంటి రామ్.. మేటర్ ఏంటో తెలుసుకోకుండా సంతకం పెడితే సమస్యలు వస్తాయి.
అర్చన: అంటే మహానే అనుమానిస్తున్నావా.. 
గిరిధర్: రామ్‌కి మహా అన్యాయం చేస్తుందని అంటున్నావా.. 
మహాలక్ష్మి: రామ్ నీకు కూడా నా మీద డౌట్ ఉంటే డాక్యుమెంట్స్ చదివి సంతకం పెట్టు. 
రామ్: అవసరం లేదు పిన్ని. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వేం చేసినా నా మంచి కోసం ఆలోచించి చేస్తావ్. అని రామ్ సంతకం పెట్టేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 5th: మురారికి ప్రమాదమని భయపడుతున్న కృష్ణ.. గుడికి పరుగులు!