Krishna Mukunda Murari Today Episode: మురారి, కృష్ణలు తమ ఫ్రెండ్స్‌కి సెండాఫ్ ఇవ్వడానికి బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇంతలో ఓ పిల్లడు బండికి అడ్డంగా రావడంతో బైక్ ఆపుతారు. ఓ వ్యక్తి పిల్లాడిని కొట్టడానికి వస్తే అడ్డుకొంటాడు. ఆ పిల్లడి చేతిలో దుప్పటి తీసుకొంటాడు. దొంగ అని ఆ పిల్లాడిని తిడతాడు. ఆ పిల్లాడు తన తల్లి కోసం అలా చేశాను అని తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు అని మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు అంటాడు. ఇక మురారి వాళ్లు ఆ పిల్లాడిని బైక్‌లో ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఓ బస్ స్టాప్ దగ్గర ఆవిడ ఉంటే దుప్పటికప్పి మందులు, డబ్బులు ఇస్తారు. వాళ్లకి ఉండటానికి ఓ ప్లేస్ ఇస్తామని చెప్తారు. 


కృష్ణ: ఉదయం దేవుడి గదిలో.. స్వామి ఇంట్లో అన్ని సమస్యలు తీరిపోయాయి. ఆదర్శ్‌ ముకుంద కూడా సంతోషంగా ఉన్నారు. కానీ పెద్దత్తయ్యకి ఎందుకో ఇంకా నమ్మకం కలగడం లేదు. ఇంకా ముకుందని అనుమానంగానే చూస్తున్నారు. ఆ అనుమానం తొలగిపోయేలా చూడు స్వామి. తర్వాత దేవుడికి హారతి ఇస్తే అక్కడే ఉన్న క్లాత్ కూడా కాలిపోతుంది. దీంతో కృష్ణ టెన్షన్ పడుతుంది. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తుంది. గడికి వెళ్లాలి అని మురారి దగ్గరకు పరుగులు పెడుతుంది. మురారికి జరిగింది చెప్తుంది. 
మురారి: అవన్నీ మూఢ నమ్మకాలు కృష్ణ ఓ డాక్టర్‌వి అయి ఉండి నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతావా.. సరే ఇప్పుడేం చేయమంటావ్ చెప్పు.
కృష్ణ: గుడికి తీసుకెళ్లండి.. 
మురారి: హారతి కర్పూరం పడిపోయింది అని మంటలు అంటుకున్నాయి అని ఎవరికీ చెప్పకు ఇప్పటికే పెద్ద పెద్దమ్మ టెన్షన్‌లో ఉంది. అది తెలిస్తే ఇంకా సెంటిమెంట్‌గా ఫీలవుతుంది. 
రేవతి: కృష్ణ ఇలా రండి.. ఏంటి ఇది.. నిన్ను కాఫీతాగి మురారికి తీసుకెళ్లమంటే పట్టించుకోకుండా వెళ్లిపోయావ్ ఏంటి..
భవాని: ఏమైంది మీకు.. ఏం జరిగింది.
కృష్ణ: ఏం జరగలేదు పెద్దత్తయ్య.. అత్తయ్య అది ఏసీపీ సార్ స్నానానికి వెళ్లారు. నేను పూజ చేస్తున్నాను.. సోప్ పెట్టడం మర్చిపోయాను అని గుర్తొచ్చి పరుగెత్తికుంటూ వెళ్లిపోయాను.. 
మధు: ఏదైనా చెప్తే అతికినట్లు ఉండాలి. ఈ సీరియస్ సీన్‌కి నువ్వు చెప్పిన సోప్‌కి సంబంధం లేదు.. 
ఆదర్శ్: మధు ఎందుకు ఈ డిస్కషన్.. సోప్ పెట్టడానికే అని అంది కదా.. 
భవాని: ఇక మీ వాదనలు ఆపండి వాళ్లు ఎక్కడికో బయల్దేరారు కదా వెళ్లనివ్వండి. గుడికి వెళ్తున్నాం అని కృష్ణ చెప్తుంది. 


మరోవైపు ముకుంద కాంపిటేషన్ గురించి ఆలోచిస్తుంది. ఆదర్శ్‌తో కలిసి తనకు పార్టిసిపేట్ చేయడం ఇష్టంలేదు అని అందుకు ఏంచేయాలా అని ఆలోచిస్తుంది. ఇక కృష్ణ వాళ్లు గుడికి వస్తారు. 


కృష్ణ: పంతులతో.. ఆ రోజు శుక్రవారం హారితి తీసుకునేటప్పుడు హారతి ఆరిపోయింది పంతులు గారు. గాలికి ఆరిపోయింది అని మా ఏసీపీ సార్ అన్నారు. కానీ నా మనసు ఏదో కీడు శంకించింది. కానీ ఈరోజు పొద్దున్న ఇంట్లో పూజ చేస్తుంటే హారతి పళ్లెంలోని హారతి కింద పడి మొత్తం కాలిపోయింది. నాకు ఏదో అయిపోతుంది అని భయం కాదు పంతులుగారు. రెండు సార్లు నా భర్త కోసం నా సౌభాగ్యం కోసం పూజ చేస్తున్నప్పుడే ఇలా జరిగింది. అందుకే నా భర్తకు ఏదైనా ఆపద కలుగుతుందేమో అని భయంగా ఉంది.
పంతులు: భయపడకు అమ్మా. మన జీవితంలో జరిగే ఈ చిన్న చిన్న సంఘటనలకు జరగబోయే మార్పులకు సంకేతం. అది మంచి కావొచ్చు చెడు కావొచ్చు. ఇక పంతులు మురారి జాతకం చూసి దేవుడి మందు హారతి వెలిగించి మృత్యుంజయ మంత్రం చెప్పమని కృష్ణతో చెప్తారు. కృష్ణ అలానే చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: 'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 5th: చూపులమ్మ కలశాన్ని గాయత్రీదేవి ఫొటో దగ్గర పెట్టిన తిలోత్తమ.. అలర్ట్ అయిన విశాల్!