Naga Panchami Today Episode: వైదేహి తన భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుంది. తర్వాత వరుణ్, భార్గవ్‌లను పిలుస్తుంది. అందరూ హాల్‌లో ఉండగా డాడీ ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా చేయమన్నారు అని చెప్తుంది. ఇక వరుణ్, భార్గవ్‌లు ఈ పెళ్లి ఎవరికీ ఇష్టం లేదు అని ఒకసారి ఆలోచించమని చెప్తారు. వైదేహి వాళ్లని తిడుతుంది. 


వైదేహి: ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. మీరు నేను చెప్పిన పనులు చేయండి చాలు. 
చిత్ర: పంచమికి విడాకులు ఇవ్వకుండా మోక్షకి రెండో పెళ్లి చేస్తే ఇంట్లో వాళ్లని అరెస్ట్ చేసి లోపల వేస్తారు అత్తయ్య. 
వైదేహి: పంచమితో జరిగింది అసలు పెళ్లే కాదు. ఎక్కడ రిజిస్టర్ చేయలేదు. అవన్నీ నేను చూసుకుంటాను అనవసరమైన విషయాలు లేవనెత్తకుండా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడండి. 
శబరి: ఇంత మంది వద్దని చెప్తున్నా వినకుండా నీ పైత్యం నీదే అంటే ఎలా వైదేహి. 
మీనాక్షి: నీ పెత్తనాన్ని ఈ ఇంట్లో ఎవరూ కాదు అనరు వదినా కానీ ఈ పెళ్లి విషయంలో నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. 
మోక్ష: సరే మమ్మీ. ఇంతమంది మాట ఎందుకు కాదు అనడం నిశ్చితార్థాన్ని కొన్ని రోజులు వాయిదా వేద్దాం. 
వైదేహి: ఎందుకు వేయాలి రా.. నువ్వు మేఘనను పెళ్లి చేసుకుంటాను అన్న తర్వాతే కదా ముహూర్తం పెట్టించాను. 
జ్వాల: నంబూద్రీ ఆత్మ దూరి.. అత్తయ్య వీళ్లు ఎవరూ ఏ పని చేయనవసరం లేదు అన్నీ నేను చూసుకుంటాను. ఈ పెళ్లి మాత్రం ఆగడానికి వీల్లేదు. 
భార్గవ్: నీకేదో దెయ్యం పట్టినట్లుంది.
జ్వాల: ఎవరికి దెయ్యం నాకా.. ఏదీ చూపించు.. కనిపిస్తుందా నీకు చెప్పు.. 
మినాక్షి: నువ్వు ఇలా మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది జ్వాల. నీ ప్రవర్తనే విడ్డూరంగా ఉంది. 
జ్వాల: మారింది నేను కాదు మీరంతా. పాపం ఒకసారి అమ్మాయి ముఖం చూడండి. పెళ్లి చేసుకుంటావా అని మేఘన నిన్ను అడిగిందా.. అన్నిఫిక్స్ చేసి ఇప్పుడు పెళ్లి ఆపండి అంటే ఆ అమ్మాయి ఎలా ఫీలవుతుంది. 
మేఘన: నా కోసం మీరు అంతా గొడవ పడొద్దు...
శబరి: మనవడా నువ్వు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నావో నాకు తెలీదు నాకు మాత్రం ఇష్టంలేదు. 
వైదేహి: ఈ చిన్న వయసు నుంచే వాడు పెళ్లం పిల్లలు లేకుండానే సన్యాసిగా ఉండిపోవాలా.. మరోవైపు పంచమి, ఫణేంద్ర మోక్ష ఇంటికి వస్తారు.
శబరి: పంచమితో మాట్లాడి తన ఇష్టాఇష్టాలు ఏంటో తెలుసుకొని ఆ తర్వాత ఏమైనా చేయండి. అంత వరకు మాత్రం ఈ పెళ్లి ప్రస్తావన ఆపండి.
పంచమి: అవసరం లేదు బామ్మగారు. మోక్ష బాబు మరో పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 
జ్వాల: ఆమాట చాలు కదా.. 
పంచమి: మీరు ఏం రాసుకొని ఎక్కడ ఏం సంతకాలు పెట్టమన్నా పెడతాను. నా స్నేహితురాలు మేఘన చాలా మంచి అమ్మాయి. మోక్షాబాబుకి మంచి జోడు. ఈ పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. మీ ఇద్దరి పెళ్లికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. మోక్ష పంచమికి తీసుకొని బయటకు వెళ్తాడు. 


మోక్ష: నేను కోరుకున్నది ఇష్టపడింది నిన్నే.. నన్ను ఎవరికో తాకట్టుపెట్టడానికి అమ్మేయడానికి నేను బొమ్మను కాదు. ప్రాణం ఉన్న మనిషిని. మా అమ్మ చావడానికి సిద్ధపడింది అని మేఘనతో పెళ్లికి ఒప్పుకున్నానే కానీ నువ్వన్నట్లు సుఖంగా ఉండటానికి కాదు. 
పంచమి: మేఘన నాగకన్య అని అనుకున్నా కానీ కాదు. మీరు ధైర్యంగా తనని పెళ్లిచేసుకోవచ్చు.
మోక్ష:  స్టాపిట్.. నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నా మనసులో మరొకరికి స్థానం ఉండదు. 
పంచమి: నన్ను క్షమించండి మోక్షాబాబు. నాతో కలిసి జీవితం అంటే ఎడారిలో నడక లాంటిదే. ఈ జన్మకు మీ కోరిక తీరదు.
మోక్ష:  నేను అందుకు సిద్ధమే పంచమి. ఈ జన్మకు ఇద్దరం కలిసి ఎడారి దాటేద్దాం. ఆ ఫలితం మనకు కనీసం వచ్చే జన్మలోనైనా కనిపిస్తుంది. 
పంచమి: నేను ఈ జన్మకు అనుభవిస్తున్న పాపం చాలు మోక్షాబాబు. దయచేసి నా మీద ఇంక ఎలాంటి ఆశలు పెట్టుకోకండి.
మోక్ష:  సరే పంచమి నన్ను వదిలించుకోవాలి అనుకున్న దానివి నాకోసం మళ్లీ ఎందుకు వచ్చావో చెప్పు. 
పంచమి: నాలో ఇప్పుడు ఎలాంటి ప్రేమలు పగలు లేవు. మేఘన నాగకన్య అని మీరు తనని పెళ్లి చేసుకుంటే చనిపోతారు అని భయపడ్డాను. మేఘన నాగకన్యకాదని ఆ విషయం మీకు చెప్పడానికి వచ్చాను. 
మోక్ష:  నేను చనిపోవాలి అని మేఘనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ ఇప్పుడు నాకు ఆ పెళ్లి అవసరం లేదు. మేఘనని ఇప్పుడే పంపించేస్తా.. 
పంచమి: వద్దు అంటూ కాళ్లు పట్టుకుంటుంది. జీవితంలో ఎవరో ఒకరికి న్యాయం జరగాలి.  నాకు అలాంటి భాగ్యంలేదు కనీసం ఆ అభాగ్యురాలికైనా న్యాయం చేయండి. 
మోక్ష: సరే పంచమి నా మీద నీకు ప్రేమలేదు అని నేను నమ్మాలి అంటే నీ చేతుల మీదగా ఈ పెళ్లి జరిపించాలి. ఆ షరుతు మీద అయితేనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. మనసులో.. పంచమి కచ్చితంగా నన్ను వదులుకోలేదు. చివరి నిమిషంలో అయినా ఈ పెళ్లి ఆపుతుంది. నేను మేఘన మెడలో తాళి కట్టే వరకు నువ్వు నా పక్కనే ఉండాలి.
పంచమి: మీరు పెళ్లికి ఒప్పుకున్నారు అది చాలు. 
 
మరోవైపు జ్వాల ప్రవర్తన గురించి చిత్ర బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఫణేంద్ర పాము నుంచి మనిషిగా మారడం చూస్తుంది. షాక్ అయిపోతుంది. చిత్ర చూడటం చూసేసిన ఫణేంద్ర మళ్లీ పాముగా మారిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ ఫిబ్రవరి 6th: రాజ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన శ్వేత – అరవింద్ కు వార్నింగ్ ఇచ్చిన కావ్య