Seethe Ramudi Katnam Today Episode రామ్ ఆస్తి పేపర్ల మీద సంతకం చేసేస్తాడు. తనమీద నమ్మకానికి మహాలక్ష్మి రామ్‌కి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు తన భర్త రామ్ నీ కొడుకు మహా నిన్ను కాక ఇంకెవ్వరిని నమ్ముతాడు అని అంటాడు. మరోవైపు సీత ఇంకా నిద్రలోనుంచి లేవదు. అర్జెంట్ పని ఉంది అని రామ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక లాయర్‌కు ఫార్మాలిటీస్ పూర్తి చేయమని మహా చెప్తుంది. అప్పుడే సీత వస్తుంది.


సీత: ఏంటా ఫార్మాలిటీస్.. 
మహాలక్ష్మి: మనసులో.. ఇది ఏంటి నిద్ర లేచింది. 
చలపతి: మనసులో.. చాలా ఆలస్యంగా వచ్చావ్ సీత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
మహాలక్ష్మి: నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
రేవతి: రామ్‌తో ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకున్నారు కదా వదినా. వాటి గురించి సీతకు చెప్పాల్సిన అవసరం లేదా.. 
లాయర్: మహాలక్ష్మి గారు ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉంది ఏంటి తన పిచ్చి ఇంకా తగ్గలేదా..  
సీత: ఏ నల్లకోటు ఎవరికి పిచ్చి.. నీకు పిచ్చి.. మీ తాతకు పిచ్చి.. పో.. 
మహాలక్ష్మి: ఏయ్ మెంటల్ ఏం చేస్తున్నావ్..
సీత: నాకు మెంటల్ అంటావా మెంటల్ అంటే ఏంటో చూపించనా అని పేపర్లు చింపేస్తుంది. 
మహాలక్ష్మి: ఎంత పని చేశావ్ ఏం చేయాలి నిన్ను. అవి ఎంత విలువైనా డాక్యుమెంట్స్‌ నీకు తెలుసా కావాలనే చేశావ్ కదూ..
సీత: అవును కావాలనే చించేశా.. మా ఆయన 50 శాతం ఆస్తులను మీ పేరుమీద మార్చుకోవడానికి సంతకాలు పెట్టించుకున్నారు. మీ కుట్ర నాకు ముందే తెలుసు. అందుకే అంతా అయ్యే వరకు ఆగి ఆయన వెళ్లాక వచ్చి పేపర్స్ చింపేశా. 
రేవతి: వదిన ఇంతకు దిగజారిందేంటి..
సీత: నా మామ వాటా ఆస్తి క్షేమం..  


లాయర్: ఏంటి సార్ ఆ పిచ్చి అమ్మాయి రామ్ భార్య అని చెప్తుంది. నిజమేనా..
మహాభర్త: తను మా కోడలి చెల్లెలు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో అక్క భర్తే తన భర్త అనుకుంటుంది. 
మహాలక్ష్మి: అది సరే మన ప్లాన్ గురించి సీతకి ఎలా తెలిసింది. చలపతికి తెలీదు రేవతికి తెలిసే ఛాన్సే లేదు. 
ఆడిటర్: నైట్ మీరు లాయర్‌కి కాల్ చేసి డాక్యుమెంట్లు రెడీ అయ్యాయా అని అడిగారు కదా మేడమ్..
మహాలక్ష్మి: నేనా.. నేను మీతో మాట్లాడటం ఏంటి.. 
ఆడిటర్: అదేంటి మేడమ్ నైట్ మీరు లాయర్‌గారికి కాల్ చేసి డాక్యుమెంట్స్‌లో ఏం రాస్తున్నారు కన్ఫర్మేషన్ కోసం ఒకసారి చెప్పండి అని అడిగారు కదా.. లాయర్‌గారు మీకు అంతా పూర్తిగా చెప్పారు కదా..
మహాలక్ష్మి: లేదు నేను మీకు ఫోన్ చేయలేదు. 
అర్చన: నువ్వు ఫోన్ చేయలేదు అంటున్నావ్ మరి ఎవరు చేశారు మహా.
గిరిధర్: నీఫోన్‌తో లాయర్‌కి కాల్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది వదినా. అసలు నిద్రమాత్రలు తాగితే అప్పుడే ఎలా మెలకువ వచ్చింది. 
సీత: ఏంటి అత్త ఆఫీస్‌లో సీక్రెట్‌గా జరిగిన మీటింగ్ నాకు తెలిసిపోయింది అనుకుంటున్నావా.. నీ ఫోన్ నుంచి లాయర్‌కి ఫోన్ చేసింది నేనే. మహా నిద్రపోయిన తర్వాత సీత ఫోన్ తీసుకొని మాట్లాడటం చూపిస్తారు. మహాలక్ష్మితో పాటు అందరూ షాక్ అవుతారు. 
సీత: ఏంటి మరదల్స్ ఈ రోజు మధ్యాహ్నం వరకు నిద్ర పోవాల్సిన నేను ఎలా నిద్ర లేచాను అని ఆలోచిస్తున్నారా. ఆ విషయం కూడా నేనే చెప్తాను. నేను పాలు కలుపుతున్నప్పుడు రిమోట్ కోసం నన్ను పిలిచావ్ ఈలోపు ఉష వంట గదికి వెళ్లి నా పాలలో నిద్ర మాత్రలు కలిపావు. అప్పుడే నాకు అనుమానం వచ్చి వంట గది వైపు ఒక కన్ను వేసి ఉంచా.. ఆ పాలు సింక్‌లో పారబోసి మళ్లీ పాలు తీసుకొని వెళ్లా.. అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: Ram Charan: ఉపాసన తాతయ్య బయోపిక్‌లో రామ్ చరణ్!?