Trinayani Today Episode: విశాల్ చాటుగా మెట్లమీద నుంచి చూడటం సుమన చూస్తుంది. చాలా రోజుల తర్వాత ఓ ఆసక్తికరమైన అంశం చూశాను అంటుంది. విశాల్‌తో మిమల్ని కన్న తల్లి గురించి కట్టుకున్న భార్య నయనికి కూడా తెలీకూడదు అని మీరు కోరుకోవడం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది అంది. విశాల్ అలాంటిది ఏం లేదు అంటాడు. దానికి సుమన మీరు మాట మార్చే ప్రయత్నం చేసినా మీ కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు అని అంటుంది.
సుమన: ఎందుకు మీరు గాయత్రీ అత్తయ్య గురించి తెలీకూడదు అనుకుంటున్నారో చెప్పారా..
విశాల్: సుమన ఇప్పుడు వివరంగా చెప్పే అంత టైంలేదు. అక్కడ తిలోత్తమ అమ్మ వాళ్లు వాళ్ల ప్రయత్నంలో ఉన్నారు. చూపులమ్మ తల్లి వాళ్లకి మా అమ్మ జాడ చూపిస్తుంది.
సుమన: అది సరే మీ అమ్మ ఇప్పుడు ఎక్కడుంది అనే సంగతి మీకు తెలుసా బావగారు.
విశాల్: మనసులో.. దేవుడా ఇంకా గాయత్రీ పాపే మా అమ్మ అని బయటకు చెప్పలేదు. లేదంటే సుమన బ్లాక్ మెయిల్ చేసేది.
సుమన: తెలీశా తెలీదా బావగారు.
విశాల్: తెలీదు ఎవరికీ తెలీదనే అనుకుంటున్నాను.
సుమన: కారణం ఏంటో ఇప్పుడు చెప్పేంత టైం లేదు అంటున్నారు మంచిది.
విశాల్: సుమన మనం మాట్లాడుకుంటే కింద అమ్మవాళ్లు ప్రయత్నించి అమ్మ జాడ తెలుసుకునేలా ఉన్నారు.
సుమన: నేను కానివ్వను బావగారు.
విశాల్: అదెలా..
సుమన: ఈ ప్రయత్నంలో తిలోత్తమ అత్తయ్య వాళ్లు విఫలం అయితే నాకు వచ్చే లాభం ఏంటిఅంట..
విశాల్: నువ్వే చెప్పాలి. ఎంత కావాలి..
సుమన: నేను డబ్బే అడుగుతాను అని బాగానే గెస్ చేశారు కానీ ఈసారి అడగను. చూపులమ్మ తల్లి జాడ చూపిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఆ తల్లి మిమల్ని కన్న తల్లి జాడ చూపించకూడదు అని మీరు అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పల్లెటూరి నుంచి వచ్చాను కదా కొన్ని చావు తెలివితేటలు ఉంటాయి బావగారు. అంటూ కలశంపై గురి చూసి కొట్టి గోలీతో కొడుతుంది. దీంతో కలశం ఎగిరిపడి తిలోత్తమ మీద నీరు పడతాయి. అందరూషాక్ అవుతారు. తిలోత్తమ కళ్లు మంట అని అరుస్తుంది.
నయని: చూపులమ్మ తల్లి కింద పడిపోగానే అత్తయ్య ఇలా అయిపోయారు.
డమ్మక్క: గాయత్రీ దేవి ఫొటోని పట్టుకొని క్షమించమని అడగండి తగ్గిపోతుంది.
హాసిని: ఫొటోని పట్టుకొని కింద పడేసేలా ఉన్నారు. అలా కాదు.. ఆ అత్తయ్య పేరు ఉన్న ఈ గాయత్రీ కాలు పట్టుకొని క్షమించమని అడగండి. రండి అత్తయ్య. తిలోత్తమ గాయత్రీ పాప కాలు పట్టుకొని తప్పు అయిపోయింది అని క్షమాపణ కోరుతుంది. దీంతో కళ్లు మంట తగ్గుతుంది.
తిలోత్తమ: చూపులమ్మ తల్లి నేలపాలవ్వడం వెనుక మంత్ర తంత్రాలు లేవు. చిన్నపిల్లలా ఉన్న గాయత్రీ అక్కయ్య ఈ ఇంటికి వస్తే తిరిగివెనక్కి వెళ్లలేదు. అర్జెంటుగా అఖండ స్వామిని కలవాలి. రేపు ఏదో ఒకటి తేలిపోవాలి. ఎవరో ఒకరు మిగలాలి. గాయత్రీ అక్కనా.. నేనా..
మరోవైపు సుమన విశాల్ దగ్గరకు వచ్చి తన మాట అంటూ విసిగిస్తుంది. ఇంతలో విక్రాంత్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడిగి సుమనతో కాసేపు వాదించి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక ఉదయం విశాల్ గన్ తీసుకుంటాడు. నయని రావడంతో దాచేస్తాడు. నయని వచ్చి తిలోత్తమ వాళ్లు బయటకు వెళ్తున్నారు అని చెప్తుంది.
హాసిని: చూపులమ్మను కూడా సంచిలో పెట్టుకొని వెళ్లారు విశాల్.
విశాల్: మనసులో వాళ్లు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు వదినా. ఫాలో అవుతాను. నయని వస్తాను అంటే వద్దు అని విశాల్ ఒక్కడే తిలోత్తమను ఫాలోఅవుతాడు. ఇక హాసిని కూడా విశాల్‌ని ఫాలో అవ్వాలి అని ఆ విషయం నయనికి తెలీకూడదు అనుకుంటుంది. తిలోత్తమ వాళ్లు అఖండ స్వామి దగ్గరకు వస్తారు. విశాల్ కూడా ఫాలో అయ్యాడు. హాసిని కూడా అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: రష్మిక: అయితే ఆలోచించాల్సిందే - ఆ రూమర్‌పై ఘాటుగా స్పందించిన రష్మిక