Stock Market News Today in Telugu: నిన్న, లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున పేకమేడలా కుప్పకూలిన స్టాక్‌ మారెట్లు, ఈ రోజు (బుధవారం, 05 జూన్‌ 2024) కొద్దిగా పుంజుకున్నాయి, తిరిగి లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు జంప్‌ చేసి 73,000 పైన, నిఫ్టీ 22,100 పైన స్టార్ట్‌ అయ్యాయి. అయితే ప్రధాన ఇండెక్స్‌లు రెండూ ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయాయి. మార్కెట్‌లోని అస్థిరతను సూచించే ఇండియా VIX దాదాపు 22 శాతం క్షీణించింది.


ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 72,079 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 948.84 పాయింట్లు లేదా 1.32 శాతం పెరిగి 73,027.88 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 21,884 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 243.85 పాయింట్లు లేదా 1.11 శాతం లాభంతో 22,128 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


BSE సెన్సెక్స్ మార్కెట్ 948.84 పాయింట్లు లేదా 1.32 శాతం జంప్ తర్వాత, 73,027 స్థాయి వద్ద పెరుగుదలతో ప్రారంభమైంది. NSE నిఫ్టీ 243.85 (1.11 శాతం) లాభంతో 22,128 వద్ద ప్రారంభమైంది.


పోగొట్టుకున్న విలువను తిరిగి సంపాదించుకునేందుకు బ్రాడర్‌ మార్కెట్లు కష్టపడుతున్నాయి. నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.47 శాతం & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.32 శాతం చొప్పున పెరిగాయి.


రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ FMCG 2 శాతం లాభాలతో లీడింగ్‌లో ఉంది. ఆటో రంగం 1.73 శాతం పెరిగింది. ఒక్క మెటల్‌ సెక్టార్‌ మాత్రమే నష్టాల్లో ఉంది, 0.36 తగ్గింది.


సెన్సెక్స్‌, నిఫ్టీ రెండింట్లో ఓలటాలిటీ ఉంది, హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఉదయం 9.25 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 122.82 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 71,956 స్థాయి వద్ద, ఆ తర్వాత 10 నిమిషాలకు (ఉదయం 9.35 గంటలకు) 453 పాయింట్లు పెరిగి 72,532 వద్ద కదిలింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా క్రమంగా నష్టాల్లోకి జారుకుంది.


సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 22 లాభాలతో ట్రేడవుతుండగా, 8 స్టాక్‌లు క్షీణిస్తున్నాయి. హెచ్‌యూఎల్ 5 శాతం పెరుగుదలతో టాప్ గెయినర్‌గా కొనసాగుతోంది. నెస్లే 3.75 శాతం పెరిగింది. ఏషియన్ పెయింట్స్ 3.20 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.23 శాతం, టాటా స్టీల్ 2.14 శాతం పెరిగింది.


నిప్టీ షేర్ల పరిస్థితి
నిఫ్టీ 50 ప్యాక్‌లోని 31 స్టాక్స్ లాభపడగా, 19 స్టాక్స్ పతనంలో ఉన్నాయి. హెచ్‌యూఎల్ ఇక్కడ కూడా టాప్ గెయినర్‌గా ఉంది, 5.85 శాతం పెరిగింది. బ్రిటానియా 5 శాతం పైగా లాభపడింది. టాటా కన్జ్యూమర్ 4.20 శాతం, ఏషియన్ పెయింట్స్ 3.94 శాతం పెరిగాయి. నెస్లేలో 3.87 శాతం బలం కనిపించింది. మరోవైపు... అదానీ ఎంటర్‌, హిందాల్కో 5 శాతం పైగా విలువ కోల్పోయాయి. అదానీ పోర్ట్స్‌, ఎల్‌&టీ, ఎన్‌టీపీసీ కూడా దాదాపు 5 వరకు నష్టాలను పోగేసుకున్నాయి.


ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 11.34 పాయింట్లు లేదా 0.01% లాభంతో 72,090.39 దగ్గర; NSE నిఫ్టీ 11.45 పాయింట్లు లేదా 0.05% నష్టంతో 21,873.05 వద్ద ట్రేడవుతున్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఓటింగ్‌ పూర్తికాగానే ధరాఘాతం - పెరిగిన పాల రేట్లు - పెరగనున్న పెట్రోల్‌, మొబైల్‌ బిల్లులు!