Eggless Cake Recipe : కేక్స్ అనగానే చాలామంది వాటిలో ఎగ్ ఉంటాది అని తినరు. కానీ ఎగ్​ లేకుండా, మైదాని వాడకుండా కూడా మనం టేస్టీ కేక్స్ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా వాటిని వండేందుకు ఓవెన్​ ఉండాలి అనుకుంటారు. కానీ వాటిని ఇవేమి లేకుండా.. ఇంట్లో సింపుల్​గా రెడీ చేసుకోవచ్చు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో? ఎలా చేస్తే మంచి రుచి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


బెల్లం - అరకప్పు


పెరుగు - అరకప్పు


బటర్ - పావు కప్పు


గోధుమ పిండి - 1 కప్పు


కోకా పౌడర్ - 2 టేబుల్ స్పూన్స్


మిల్క్ పౌడర్  - 2 టేబుల్ స్పూన్స్


బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్


బేకింగ్ సోడా - పావు టీస్పూన్


పాలు - ముప్పావు కప్పు


చాక్లెట్ - 2 ముక్కలు


తయారీ విధానం


ముందుగా బటర్​ను వేడి చేసి మెల్ట్ చేసుకోవాలి. అనంతరం బెల్లాన్ని సన్నగా తురుముకోండి. మిక్సీ వేయకుండా చిన్నచిన్నగా తురుముకోవాలి. దీనిని ఓ మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోండి. దానిలో బెల్లం వేయండి. అనంతరం పెరుగు, మెల్ట్ చేసిన బటర్ వేసుకోవాలి. పెరుగు ఫ్రెష్​గా ఉండాలి. అసలు పులియని పెరుగును మాత్రమే దీనికోసం తీసుకోవాలి. ఒకవేళ పెరుగు ఫ్రెష్​గా లేకుండా.. పుల్లని రుచిని ఇస్తుంటే దానిని ఉపయోగించకపోవడమే మంచిది. 


బటర్, బెల్లం, పెరుగు బాగా మిక్స్​ అయ్యేలా కలపండి. మిక్సింగ్ ఎంత బాగా చేస్తే.. కేక్స్ అంత మంచిగా వస్తాయి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని.. దానిలో గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఆ పౌడర్​లో కోకాపౌడర్ వేసుకోవాలి. దానిలోనే మిల్క్ పౌడర్ కూడా వేయాలి. ఇలా చేయడం వల్ల ఈ పౌడర్స్​ అన్ని బాగా కలుస్తాయి. రుచిని పెంచుతాయి. బేకింగ్ పౌడర్ కూడా వేసేయండి. అవన్నీ బాగా కలిసిన తర్వాత బేకింగ్ సోడా కూడా వేసి.. బాగా కలిపి.. ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం మిశ్రమంలో కలుపుకోవాలి. 



ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. దానిలో పాలు వేస్తూ.. మెత్తగా కలుపుతూ.. మంచి క్రీమీగా వచ్చేలా పిండిని బాగా కలుపుకోవాలి. చాక్లెట్​ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిశ్రమంలో వేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న కప్పులలో వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఈ కప్స్​ని ప్లేస్ చేయాలి. వీటిని ప్లేస్ చేసే ముందు ఇడ్లీ కుక్కర్ అడుగు భాగంలో కాస్త నీరు పోయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్​ని పెట్టాలి. 20 నుంచి 25 నిమిషాల్లో ఈ కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. వీటిని హాయిగా లాగించేవచ్చు. పిల్లలకు ఇవి బాగా నచ్చుతాయి. వీటిని పెద్దలు కూడా హాయిగా లాగించేయవచ్చు. దీనిలో బెల్లం వేస్తాము కాబట్టి మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మరి ఈ సమ్మర్ హాలీడేస్ అయ్యేలోపు పిల్లలకి వీటిని ఇంట్లో చేసి తినిపించేయండి. 


Also Read : బంగాళదుంపలతో దోశలు.. మినపప్పు లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు