Instant Potato Dosa Recipe : ఇన్​స్టాంట్​గా.. మినపప్పు లేకుండా దోశలు ఈజీగా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు బంగాళదుంపలతో టేస్టీ దోశలు చేసుకోవచ్చు. అదేంటి మినపప్పు లేకుండా దోశలు ఎలా వేసుకుంటాము. పైగా బంగాళదుంపలతో అని అనుకుంటున్నారా? అయితే ఆలస్యం లేకుండా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? దీనిని ఎలా తయారు చేయాలి? చట్నీ కాంబినేషన్ ఏది అయితే రుచి బాగుంటుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


బంగాళ దుంపలు - 4


పచ్చిమిర్చి - 4


ఉప్పు - రుచికి తగినంత


రవ్వ - కప్పు 


బియ్యం పిండి - కప్పు


ఉల్లిపాయ - 1 


కొత్తిమీర - చిన్న కట్ట


జీలకర్ర - 1 స్పూన్


చిల్లీ ఫ్లేక్స్ - 1 స్పూన్


నీళ్లు - దోశల పిండికి సరిపడేంత


నూనె - దోశలకు సరిపడేంత


తయారీ విధానం


ముందుగా బంగాళదుంపలపై పొట్టు తీసేయాలి. అనంతరం వాటిని ముక్కలుగా కోసుకోవాలి. వాటిని కడిగి.. మిక్సీజార్​లో వేసుకోవాలి. దానిలో పచ్చిమిర్చి ముక్కలను వేసి కాస్త ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దానిలో రవ్వ వేసుకుని.. పిండిలో కాస్త నీరు పోసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో బియ్యం పిండి వేసి.. నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ.. దోశలకు సరిపడే కొలతల్లో పోసుకోవాలి. 


ఉల్లిపాయలు, కొత్తిమీరను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. వాటిని బంగాళదుంప మిశ్రమంలో వేయాలి. జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, సరిపడేంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. దోశ పిండిని వేసుకునేలా కాకుండా.. పిండిని పోసుకునేలా నీటిని వేయాలి. పిండిని దోశలకోసం పలుచగా కలుపుకున్నాక.. దోశ పాన్ తీసుకోవాలి. స్టౌవ్ వెలిగించి దానిపై ఇది పెట్టి.. వేడియ్యాక.. దోశ పిండిని సన్నగా పోసుకోవాలి. దానిపై నూనె వేసి వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఒకవైపు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని రెండు వైపులా వేయించాల్సిన అవసరం లేదు. 



మిగిలిన పిండితో దోశలు వేసుకోవాలి. అంతే టేస్టీ ఇన్​స్టాంట్ దోశలు రెడీ. వీటిని మీకు నచ్చిన చట్నీతో లాగించవచ్చు. లేదంటే కూరతో కూడా తీసుకోవచ్చు. ఈ దోశలకు బెస్ట్ కాంబినేషన్ అంటే వెలుల్లి కారమే. చాలామంది దీని రైస్​లో చేసుకుంటారు కానీ ఇది దోశలకు బెస్ట్ కాంబినేషన్. మీరు కూడా వెల్లుల్లి కారం చేసుకోవాలంటే దీనిని ఫాలో అయిపోండి. 


వెల్లిల్లి కారం రెసిపీ..


వెల్లుల్లి కారం చేయడం చాలా ఈజీ. వెల్లుల్లి రెబ్బలపై తొక్కలను తీసేయాలి. ఇలా ఓ పదిహేను రెబ్బలు సిద్దం చేసుకోవాలి. కారం, ఉప్పు మీ రుచికి తగ్గట్లు వేసుకోవాలి. కానీ కారం ఎక్కువగా ఉంటే రుచి బాగుంటుంది. దీనిలో జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కొందరు వేసుకుంటారు. మరికొందరు జీలకర్ర లేకుండానే చేసుకుంటారు. కానీ ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని వేసుకుని.. బాగా దంచుకోవాలి. మెత్తని పేస్ట్​గా చేసుకున్న దానిని.. తినేప్పుడు నూనె వేసుకుని.. బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. దోశలకు.. దీనిని మంచి కాంబినేషన్​గా ట్రై చేయవచ్చు. ఇది సమయాన్ని సేవ్ చేస్తుంది. అలాగే ఇన్​స్టాంట్​గా చేసుకోవచ్చు. 


Also Read : కేరళ స్టైల్ పొట్లం ఇడ్లీ.. రెసిపీ చాలా ఈజీ.. దీనితో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?