Stock Market News Today in Telugu: గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు & మంచి దేశీయ డేటా ఆధారంగా ఈ రోజు (సోమవారం, 04 మార్చి 2024) భారతీయ స్టాక్‌ మార్కెట్లలో బూమ్‌ కనిపించింది, నిఫ్టీ మళ్లీ కొత్త రికార్డ్‌ను (22,440.90) అందుకుంది. గత శుక్రవారం అమెరికన్‌ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకోవడం, ఈ రోజు ఉదయం ఆసియా మార్కెట్లు పటిష్టంగా ప్రారంభం కావడంతో దేశీయ మార్కెట్లు హైయ్యర్‌ సైడ్‌లో స్టార్ట్‌ అయ్యాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


BSE సెన్సెక్స్ 96.95 పాయింట్లు లేదా 0.13 శాతం పెరుగుదలతో 73,903 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. NSE నిఫ్టీ 25.10 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 22,403 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ఉండగా, BSE స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.3 శాతం పడిపోయింది.


మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 14 స్టాక్స్‌ లాభాల్లో ట్రేడవుతుండగా, 16 స్టాక్స్ క్షీణించాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్ ఎన్‌టీపీసీ 2.68 శాతం పెరిగింది. పవర్ గ్రిడ్ 1.97 శాతం, సన్ ఫార్మా 0.63 శాతం లాభపడింది. భారతి ఎయిర్‌టెల్‌ 0.62 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.56 శాతం చొప్పున ఎగబాకాయి. JSW స్టీల్, టాటా స్టీల్, టైటన్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, టాటా కన్స్యూమర్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.


నిఫ్టీ 50 ప్యాక్‌లో 22 స్టాక్స్‌ గ్రీన్‌ జోన్‌లో ఉండగా, 28 స్టాక్స్‌ రెడ్‌ జోన్‌లో కనిపించాయి. ఇక్కడ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్లు 2.75 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా కొనసాగుతున్నాయి. ఎన్‌టీపీసీ 1.95 శాతం, పవర్ గ్రిడ్ 1.71 శాతం, బజాజ్ ఆటో 1.38 శాతం, ఓఎన్‌జీసీ 1.36 శాతం చొప్పున పెరిగాయి.


నిఫ్టీ మీడియా, మెటల్ ఇండెక్స్‌లు 1 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్ 0.7 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి.


రూ.3.93 లక్షల కోట్లకు బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఈ రోజు 3,93,09,172.09 కోట్లకు (రూ.393.09 లక్షల కోట్లు) చేరింది. బీఎస్‌ఈలో ట్రేడింగ్‌ను పరిశీలిస్తే.. ఓపెనింగ్‌ టైమ్‌లో 3,286 షేర్లు ట్రేడ్ అవుతుండగా.. వాటిలో 1,347 షేర్లు లాభాల్లో, 1,810 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 129 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 161 షేర్లు 52-వారాల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. 13 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 146 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 94 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి.


ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 25.53 పాయింట్లు లేదా 0.03% పెరిగి 73,831.68 దగ్గర; NSE నిఫ్టీ 8.35 పాయింట్లు లేదా 0.03% పెరిగి 22,386.75 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. నికాయ్‌ 1 శాతం జంప్‌తో 40,000 మార్క్‌ను అధిగమించి, రికార్డ్ బ్రేకింగ్ రన్నింగ్‌ను కొనసాగిస్తోంది. CSI 300, హాంగ్‌కాంగ్ హ్యాంగ్ సెంగ్ 0.2 శాతం పడిపోయాయి. దక్షిణ కొరియా కోస్పి 1.43 శాతం పెరిగింది. 


శుక్రవారం, యూఎస్‌ మార్కెట్లలో నాస్‌డాక్ 1.14 శాతం, S&P 500 0.80 శాతం, డౌ జోన్స్ 0.23 శాతం లాభపడ్డాయి, అప్‌వర్డ్ ట్రెండ్‌ను కొనసాగించాయి. ఈ వారం చివరిలో యూఎస్‌ కాంగ్రెస్‌లో ఫెడ్‌ చైర్ జెరోమ్ పావెల్ ప్రసంగం ఉంటుంది. ఈ మంగళవారం చైనా 2024 వృద్ధి అంచనాలు వెలువడతాయి. ఈ రెండూ మార్కెట్‌ డైరెక్షన్స్‌ను నిర్ణయిస్తాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి