A.P. Residential Degree College CET 2024: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీఆర్‌డీసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2024కు మార్చి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను మే 14న ప్రకటించనున్నారు. అనంతరం సీట్ల భర్తీ కోసం తొలి విడత కౌన్సెలింగ్ మే 23న, రెండో విడత కౌన్సెలింగ్ మే 31న, మూడో విడత కౌన్సెలింగ్ జూన్ 7న నిర్వహించనున్నారు.
వివరాలు...
➥ ఏపీఆర్‌డీసీ సెట్-2024
సీట్ల సంఖ్య: 152.
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 01.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 31.03.2024.
➥ హాల్‌టికెట్ల విడుదల: 17.04.2024.
➥ పరీక్ష తేది: 25.04.2024 (2.30 PM to 5 PM)
➥ ఫలితాల వెల్లడి: 14.05.2024.
➥ మొదటి విడత కౌన్సెలింగ్ (అన్ని యూనివర్సిటీలు): 23.05.2024.
➥ రెండో విడత కౌన్సెలింగ్ (అన్ని యూనివర్సిటీలు): 31.05.2024.
➥ మూడో విడత కౌన్సెలింగ్ (అన్ని యూనివర్సిటీలు): 07.06.2024.
ALSO READ:
APRS CAT 2024: ఏపీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి - పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం 'ఏపీఆర్‌ఎస్ క్యాట్-2024' నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభంకాగా.. విద్యార్థుల నుంచి ఏప్రిల్ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మొదటి జాబితాను జూన్ 8న, రెండో జాబితాను జూన్ 16న, మూడో జాబితాను జూన్ 23న ప్రకటించనున్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించి ఉండకూడదు. తెల్లరేషన్ కార్డు ఉండాలి. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఆదాయ పరిమితి వర్తించదు.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..