Stock Market News Today in Telugu: బడ్జెట్‌ ముందు, ఇండియన్‌ బెంచ్‌మార్క్‌ సూచీలు ఈ రోజు (గురువారం, 01 ఫిబ్రవరి 2024) ఫ్లాట్‌గా కదులుతున్నాయి. పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమైన దేశీయ సూచీలు, భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ నుంచి దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నాయి.



ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (బుధవారం) 71,752 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 247 పాయింట్ల వృద్ధితో 71,998.78 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 21,726 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 54 పాయింట్లు పెరిగి 21,780.65 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడ్డాయి.


సెన్సెక్స్ షేర్లు
ఓపెనింగ్‌ ట్రేడ్‌లో, సెన్సెక్స్‌30 ప్యాక్‌లో మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం, ఎన్‌టిపిసి, టీసీఎస్, హెచ్‌యుఎల్ లాభపడ్డాయి. మరోవైపు.. ఎల్‌ అండ్‌ టీ, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటన్, బజాజ్ ట్విన్స్ నష్టపోయాయి.


ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి కొత్త డిపాజిట్లు తీసుకోకుండా, క్రెడిట్ లావాదేవీలు చేయకుండా తీసుకోకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ మీద రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) బుధవారం ఆంక్షలు విధించింది. దీంతో.. Paytm షేర్లు 20 శాతం తగ్గి రూ.609కి పతనమయ్యాయి.


ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 199.19 పాయింట్లు లేదా 0.28% పెరిగి 71,951.30 దగ్గర; NSE నిఫ్టీ 55.55 పాయింట్లు లేదా 0.26% పెరిగి 21,781.25 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో ఉన్నాయి. నికాయ్‌ 0.6 శాతం క్షీణించింది. కోస్పి, తైవాన్ 0.7 శాతం, 0.1 శాతం చొప్పున పెరిగాయి.


అందరూ ఊహించినట్లుగానే యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను మార్చలేదు, పాత రేట్లనే యథాతథంగా కొనసాగించింది. లక్ష్యంగా పెట్టుకున్న 2 శాతం వైపు ద్రవ్యోల్బణం స్థిరంగా కదులుతున్నంత వరకు రేట్లను తగ్గించబోమని సూచించింది. ఫెడ్‌ నిర్ణయాల తర్వాత, బుధవారం, డౌ జోన్స్ 0.8 శాతం, నాస్‌డాక్ 2.2 శాతం, S&P 500 1.6 శాతం పతనమయ్యాయి.


యూఎస్‌ బెంచ్‌మార్క్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ దాదాపు 3 వారాల కనిష్ట స్థాయికి 4 శాతం మార్క్‌ దిగువకు పడిపోయాయి. కమోడిటీస్‌లో... గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు $2,060కి చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $81 దిగువకు పడిపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి